అన్వేషించండి

IndiGo: ఇవి షేర్లా, విమానాలా? ₹లక్ష కోట్ల మార్క్‌ దగ్గర్లో ఇండిగో మార్కెట్‌ క్యాప్‌

గత రెండు నెలల్లోనే 26 శాతం జంప్‌తో హై ఆల్టిట్యూడ్‌ చేరాయి.

IndiGo Shares: దేశంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్ 'ఇండిగో'ను (IndiGo) నడుపుతున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ షేర్లు ఇవాళ (మంగళవారం, 27 జూన్ 2023) ఇంట్రా-డే ట్రేడ్‌లో కొత్త రికార్డ్‌ సృష్టించాయి. BSEలో 3 శాతం ర్యాలీ చేసి రూ. 2,541.90 వద్ద కొత్త 52-వారాల గరిష్టాన్ని టచ్‌ చేశాయి, జూన్ 23న తాకిన రూ. 2,507.95 గరిష్ట స్థాయిని ఇవాళ దాటాయి. 

విమానంతో పోటీ పడుతున్న ఇండిగో షేర్లు
కొన్నాళ్లుగా ఈ కంపెనీ షేర్లు దాని ఫ్లైట్స్‌తో పోటీ పడి ఎగురుతున్నాయి. గత రెండు నెలల్లోనే 26 శాతం జంప్‌తో హై ఆల్టిట్యూడ్‌ చేరాయి. ఆరోగ్యకరమైన ఆదాయ వృద్ధి అంచనాలే ఈ టేకాఫ్‌కు కారణం.

ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) స్టాక్ ప్రైస్‌ రన్‌ వేపై విమానంలా పరుగులు తీయడంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ (market cap) ఒక లక్ష కోట్ల రూపాయల మార్క్‌ను తాకేందుకు కూతవేటు దూరంలో ఉంది. ఇండిగో మార్కెట్ క్యాప్ ఇంట్రా-డే ట్రేడ్‌లో రూ. 97,940 కోట్లకు పైకి చేరింది. కేవలం మరో 2 శాతం పెరిగితే చాలు, లక్ష కోట్ల రూపాయల మైలురాయిని కూడా ఈ ఫ్లైట్‌ చేరుకుంటుంది.

ఈ కౌంటర్‌ గత ఏడాది కాలంలో దాదాపు 56 శాతం, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 24 శాతం లాభాలను అందించింది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం (2023 ఏప్రిల్‌ 1) నుంచి స్టాక్‌ ప్రైస్‌ పరుగులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.

2022-23 నాలుగో త్రైమాసికంతో (జనవరి-మార్చి) పోలిస్తే, 2023-24 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) ASKల పరంగా సామర్థ్యం 5-7 శాతం పెరుగుతుందని ఇండిగో అంచనా వేసింది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి (FY23), విదేశీ మారకద్రవ్య ప్రభావాన్ని మినహాయించి, రూ. 2,654 కోట్ల లాభాన్ని ఇండిగో ప్రకటించింది. విదేశీ మారక ద్రవ్య ప్రభావాన్ని యాడ్‌ చేస్తే, ఆ సంవత్సరానికి రూ. 306 కోట్ల నికర నష్టాన్ని రిపోర్ట్‌ చేసింది. 2022-23 మూడు & నాలుగు త్రైమాసికాల్లో లాభాలు కళ్లజూసినా, మొదటి & రెండు త్రైమాసికాల్లో నష్టాలను అవి కవర్‌ చేశాయని కంపెనీ తెలిపింది.

రికార్డ్‌ స్థాయి ఆర్డర్‌
500 విమానాల కోసం ఎయిర్‌బస్‌కు ఆర్డర్ పంపినట్లు ఇండిగో గత వారం ప్రకటించింది. ఎయిర్‌క్రాప్ట్స్‌ కొనుగోళ్లలో ప్రపంచంలోనే అతి పెద్ద సింగిల్ ఆర్డర్‌ ఇది. ఇప్పటికే 480 విమానాల ఆర్డర్‌ చేసింది. కొత్త ఆర్డర్‌తో కలిపి ఇండిగో టోటల్‌ ఔట్‌స్టాండింగ్‌ ఆర్డర్ దాదాపు 1,000 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు చేరుకుంది. ఈ కొత్త ఆర్డర్‌ కలిపి, 2006లో ఈ క్యారియర్ ప్రారంభమైనప్పటి నుంచి, ఎయిర్‌బస్‌కు ఇండిగో ఇచ్చిన మొత్తం ఆర్డర్‌లు 1,330కి చేరుకున్నాయి.

ప్రస్తుతం, 300 పైగా ఎక్కువ విమానాలను ఇండిగో ఆపరేట్ చేస్తోంది. త్వరలోనే 480 విమానాలు వచ్చి దిగుతాయి. 2030 - 2035 మధ్య మిగిలిన 500 డెలివెరీ అవుతాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఊగిసలాటలో పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Puliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget