అన్వేషించండి

Stock Market:: శనివారం స్టాక్ మార్కెట్ ఓపెన్- మే 18న ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ అందుకే

Special Live Trading Session on Saturday: డిజాస్టర్ రికవరీ మేనేజ్మెంట్ పరిశీలన పర్యవేక్షణకు శనివారం మే 18న ప్రత్యేకంగా స్పెషల్ ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తోంది.

Saturday Special Trading: వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు ట్రేడింగ్ నిర్వహిస్తుంటాయి. వారాంతంలో శని, ఆదివారాలు మాత్రం కచ్చితంగా సెలవులో ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే ఈసారి ప్రత్యేకంగా మే 18న లైవ్ ట్రేడింగ్ సెషన్ నిర్వహించనున్నట్లు దేశంలోని రెండు స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ప్రకటించాయి. దీంతో రేపు ఇన్వెస్టర్లు వారాంతంలో ట్రేడింగ్ కొనసాగించేందుకు లైన్ క్లియర్ అయ్యింది. 

శనివారం ప్రత్యేకంగా నిర్వహించనున్న ట్రేడింగ్ సమయంలో ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ కేటగిరీల్లో ఇన్వెస్టర్లు ట్రేడింగ్ చేసేందుకు వీలుంటుంది. వాస్తవానికి ఈ ప్రత్యేక ట్రేడింగ్ నిర్వహణకు అసలు కారణం ప్రాథమిక సైట్‌లో పెద్ద అంతరాయం లేదా వైఫల్యాన్ని ఏర్పడినప్పుడు దానిని హ్యాండిల్ చేసేందుకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సంసిద్ధతను తనిఖీ చేసేందుకు ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ నిర్వహించబడుతోంది. రేపు దీనిని రెండు సెషన్లలో నిర్వహించాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు నిర్ణయించాయి. 

మెుదటి సెషన్ ఉదయం 9:15 గంటలకు ప్రారంభమై 10 గంటలకు ముగుస్తుండగా.. రెండో ట్రేడింగ్ సెషన్ ఉదయం 11:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12:30 గంటలకు ముగియనుంది. ఈ స్వల్పకాలిక ట్రేడింగ్ సమయంలో ప్రైమరీ సైట్ నుంచి డిజాస్టర్ రికవరీ సైట్‌కి ఇంట్రాడే స్విచ్‌ఓవర్ ఉంటుంది. అయితే ఇక్కడ రెండు ట్రేడింగ్ సెషన్ల మధ్య కొంత వ్యవధి ఉంచడానికి కారణం.. ముందుగా ఉదయం జరిగే మొదటి సెషన్‌లో ట్రేడింగ్ ప్రాథమిక సైట్ నుంచి నిర్వహించనుంది. అయితే రెండు సెషన్ ట్రేడింగ్ డిజాస్టర్ రికవరీ సైట్ నుంచి కొనసాగనుంది. ఈ మధ్య సమయంలో ట్రేడింగ్ మైగ్రేషన్ జరుగుతుందని ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి.

మే 18 సెషన్‌లో డెరివేటివ్ విభాగంలో అందుబాటులో ఉన్న వాటితో సహా అన్ని సెక్యూరిటీలు గరిష్టంగా 5 శాతం సర్క్యూట్ లిమిట్స్ మధ్య ట్రేడింగ్ కొనసాగిస్తాయి. ప్రాథమిక సైట్‌లో రోజు ప్రారంభంలో వర్తించే ఈక్విటీ, ఫ్యూచర్స్ కాంట్రాక్టుల ధర బ్యాండ్ డిజాస్టర్ రికవరీ సైట్‌కు కూడా వర్తిస్తుందని వెల్లడించాయి. అలాగే ప్రైమరీ సైట్‌లో క్లోజ్ టైమ్ వరకు మార్కెట్ కారకాల కారణంగా ఆప్షన్‌ల కాంట్రాక్ట్‌ల ధర బ్యాండ్‌లలో ఏవైనా మార్పులు డిజాస్టర్ సైట్‌కు ఫార్వార్డ్ చేయబడతాయని స్టాక్ ఎక్స్ఛేంజీలు ప్రకటించాయి. సాధారణంగా విపత్తు పునరుద్ధరణ సైట్‌కు మారడం అనేది వ్యాపార కార్యకలాపాల్లో అనుకోని అంతరాయం ఏర్పడినప్పుడు ట్రేడింగ్ కొనసాగింపును నిర్ధారించడానికి జరుగుతుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget