Stock Market: దూసుకెళ్తున్న భారత స్టాక్ మార్కెట్ రంగం.. త్వరలో యూకేని కూడా దాటేసి.. త్వరలో టాప్ 5లో చోటు!
బ్లూమ్‌బర్గ్ సంకలనం చేసిన ఒక సూచీ ప్రకారం.. ఇందులో ప్రాథమిక లిస్టింగ్ ఉన్న కంపెనీల సంయుక్త విలువను సూచిస్తుంది.
![Stock Market: దూసుకెళ్తున్న భారత స్టాక్ మార్కెట్ రంగం.. త్వరలో యూకేని కూడా దాటేసి.. త్వరలో టాప్ 5లో చోటు! Indian stock market soon overtake britain in market value, also enters into world's top 5 club Stock Market: దూసుకెళ్తున్న భారత స్టాక్ మార్కెట్ రంగం.. త్వరలో యూకేని కూడా దాటేసి.. త్వరలో టాప్ 5లో చోటు!](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/01/04113001/stock-market.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత స్టాక్ మార్కెట్ రంగం ప్రపంచంలోనే టాప్ 5 మార్కెట్లలో చోటు సంపాదించే దిశగా దూసుకెళ్తోంది. తాజాగా భారత్‌లో ఈ రంగం యూకే మార్కెట్స్‌ను సైతం అధిగమించింది. ఓ అంచనా ప్రకారం.. భారత స్టాక్ మార్కెట్లు ప్రపంచంలోని టాప్ 5 మార్కెట్లుగా కొనసాగుతున్న క్లబ్‌లో చేరడానికి ఎంతో సమయం పట్టేలా లేదు. దేశంలో తక్కువ వడ్డీ రేట్లు, రిటైల్ ఇన్వెస్టింగ్ బూమ్, ప్రొపెల్ స్టాక్స్ వంటి పరిణామాలు భారత స్టాక్ మార్కెట్ రంగాన్ని ఈ స్థాయికి చేరుకొనేలా చేయడానికి దోహదపడ్డాయి.
భారత దేశ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈ సంవత్సరం 37 శాతం పెరిగి 3.46 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. బ్లూమ్‌బర్గ్ సంకలనం చేసిన ఒక సూచీ ప్రకారం.. ఇందులో ప్రాథమిక లిస్టింగ్ ఉన్న కంపెనీల సంయుక్త విలువను సూచిస్తుంది. ఇది యూకేలో సుమారు 9 శాతం పెరిగి 3.59 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.
Also Read: Petrol-Diesel Price, 12 Oct: మళ్లీ షాక్! నానాటికీ పెరుగుతున్న ఇంధన ధరలు.. నేడు మీ నగరంలో ఇలా..
ఈ రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక పరిమాణానికి చేరువవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో భారత అధిక వృద్ధి సామర్థ్యం, శక్తిమంతమైన సాంకేతిక రంగం.. ఈ ఏడాది పెద్ద ఎత్తున స్టార్టప్‌లు పబ్లిక్‌కు వెళ్లేందుకు దోహదం చేస్తున్నట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక యూకే విషయానికొస్తే, బ్రెగ్జిట్‌కు సంబంధించిన అనిశ్చితులు మార్కెట్‌లో కొనసాగుతున్నాయి.
Also Read: EPFO Interest: 6 కోట్ల మంది ఖాతాదారులకు శుభవార్త.. ఈపీఎఫ్ ఖాతాల్లో నగదు జమ అయ్యేది ఎప్పుడో తెలుసా!
‘‘అంతగా సమర్థత లేని ఆర్థిక వ్యవస్థ నుంచి మంచి దీర్ఘకాలిక వృద్ధి గల సామర్థ్యం ఉన్న మార్కెట్‌గా భారత స్టాక్ మార్కెట్ రంగాన్ని పరిగణిస్తారు. రాజకీయ పరంగా స్థిరమైన పునాది ఉండడం కూడా ఈ సామర్థ్యానికి తోడ్పడుతుంది.’’ అని లండన్, క్యాపిటల్ అసెట్ మేనేజ్‌మెంట్ ఈక్విటీల చీఫ్ రోజర్ జోన్స్ విశ్లేషించారు. మరోవైపు, బ్రెగ్జిట్ ప్రజాభిప్రాయ ఫలితం నాటి నుంచి యూకేలో మార్కెట్ పరంగా అంతగా అనుకూలంగా లేదని ఆయన అన్నారు.
Also Read: "మా"లో చీలిక తప్పదా ? వివాదాస్పద ప్రకటనలు, రాజీనామాలు ఏ తీరానికి చేరబోతున్నాయి ?
Also Read: టాటా చేతికి ఎయిర్ ఇండియా.. స్పైస్ జెట్‌తో పోటీ పడి దక్కించుకున్న టాటా సన్స్
Also Read: Medak: మెదక్‌లో నీచం.. భార్యకి, కొడుక్కీ ఒక అబ్బాయే లవర్.. రోజూ అదే పని.. చివరికి ఇంట్లో ఘోరం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)