By: ABP Desam | Updated at : 12 Sep 2022 10:22 AM (IST)
Edited By: Arunmali
గెయిన్స్‌లో సెన్సెక్స్, నిఫ్టీ (ఇమేజ్ సోర్స్ - ట్విట్టర్)
Stock Market Opening Bell 12 September 2022: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ (సోమవారం) లాభాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికన్ మార్కెట్లు శుక్రవారం పాజిటివ్‌గా ముగియడం, ఇవాళ ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో సెంటిమెంట్ పెరిగింది. కొంతకాలంగా ఫారిన్ ఇన్వెస్టర్లు నెట్ బయ్యర్స్‌గా ఉండడం కూడా మన పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచింది. ప్రారంభ గంటలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 100కు పైగా పాయింట్ల లాభంతో 17,940 వద్ద; బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 350కు పైగా పాయింట్ల లాభంతో 60,150 వద్ద ట్రేడయ్యాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 59,793 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇవాళ 59,912 వద్ద లాభాల్లో మొదలైంది. ఆ వెంటనే 60,000 మార్క్‌ను క్రాస్ చేసి, 60,198 వరకు వెళ్లింది. ప్రారంభ అవర్ వరకు ఇదే ఇంట్రాడే గరిష్టం. ఓపెనింగ్ పాయింట్ అయిన 59,912 మార్కే ప్రారంభ అవర్‌లో ఇంట్రాడే కనిష్టంగా ఉంది. ఉదయం 10 గంటల సమయానికి 0.66 శాతం లేదా 395 పాయింట్ల లాభంతో 60,188 వద్ద ట్రేడవుతోంది.
NSE Nifty
శుక్రవారం 17,833 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ, ఇవాళ 17,890 వద్ద ఓపెనైంది. 17,889.15 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,955.75 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటల సమయానికి 0.64 శాతం లేదా 114 పాయింట్ల లాభంతో 17,947 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
ప్రారంభ గంటలో నిఫ్టీ బ్యాంక్ కూడా లాభాల్లోనే ఉన్నా, చాలా అస్థిరంగా కదిలింది. శుక్రవారం 40,415 పాయిట్ల వద్ద ముగిసిన ఈ సూచీ, ఇవాళ 40,540 వద్ద మొదలైంది. అక్కడి నుంచి కిందకు జారుకుని, 40,377.90 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మళ్లీ అదే స్థాయిలో పెరిగి, 40,604.65 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటల సమయానికి 0.36 శాతం లేదా 143.75 పాయింట్ల లాభంతో 40,559.45 వద్ద కొనసాగుతోంది.
Top Gainers and Lossers
నిఫ్టీ50లోని 45 కంపెనీలు లాభాల్లో, కేవలం 5 కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. టెక్ మహీంద్ర, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, యూపీఎల్, విప్రో షేర్లు లాభాల్లో కళకళలాడుతుండగా... శ్రీ సిమెంట్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్థాన్ యూనిలీవర్ నష్టాలతో విలవిలలాడుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు చూస్తే, అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లోనే ట్రేడవుతున్నాయి. మీడియా, ఐటీ, మెటల్, కన్జూమర్ డ్యురబుల్స్, రియాల్టీ సూచీలు ఎక్కువ లాభపడ్డాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Cryptocurrency Prices: క్రిప్టో జస్ట్ మూవింగ్! బిట్‌కాయిన్ @ రూ.24.42 లక్షలు
Gold-Silver Price 02 April 2023: ₹60 వేలను వదిలి దిగనంటున్న బంగారం, వెండి రేటూ పెరుగుతోంది
Petrol-Diesel Price 02 April 2023: బండిలో పడే ప్రతి చుక్కా బంగారమే, ధరలు మండుతున్నాయ్
Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య
2023 Honda SP 125: కొత్త హోండా షైన్ వచ్చేసింది - రూ. లక్ష లోపే!
Bandi Sanjay : కేసీఆర్ మళ్లీ గెలిస్తే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప తథ్యం- బండి సంజయ్
Perni Nani : ప్రస్తుత కేబినెట్ తోనే ఎన్నికలకు, మంత్రివర్గ మార్పులపై పేర్ని నాని క్లారిటీ
Minister Gangula Kamalakar : బీఆర్ఎస్ ను ఓడించేందుకు బి.ఆర్.ఎస్ కుమ్మక్కు, మనమంతా కేసీఆర్ బలగం - మంత్రి గంగుల
YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?