Cryptocurrency Fraud: అమెరికాలో క్రిప్టో కంపెనీ పెట్టి $240 కోట్లు మోసం చేసిన భారత వ్యక్తి
Cryptocurrency Fraud: అమెరికాలో క్రిప్టో కరెన్సీ కంపెనీ పెట్టి అంతర్జాతీయ పోంజీ స్కీమ్‌తో 2.4 బిలియన్ డాలర్లు మోసం చేసిన భారత వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు.
Cryptocurrency Fraud: అమెరికాలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడుల వేదిక బిట్ కనెక్ట్ (BitConnect)ను స్థాపించిన భారతీయుడు సతీశ్ కుంభాని (Satish Kumbhani)ని పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ పోంజీ స్కీమ్‌తో అతడు 2.4 బిలియన్ డాలర్లను ఆర్జించడమే కాకుండా ఎంతోమందిని మోసగించడమే ఇందుకు కారణం.
బిలియన్ డాలర్ల మోసం
గుజరాత్ నుంచి వెళ్లిన సతీశ్ కుంభాని బిట్‌కనెక్ట్స్ పేరుతో ఓ లెండింగ్ ప్రోగ్రామ్‌ను (Lending Programme) ప్రవేశపెట్టాడు. ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించాడు. అందరితో పెట్టుబడులు పెట్టించి కంపెనీని దాదాపుగా 3.4 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువకు తీసుకెళ్లాడు. అందులో 2 బిలియన్ డాలర్ల వరకు క్రిప్టో కరెన్సీ స్కీమ్ ద్వారా పెట్టుబడిదారులను మోసం చేశాడని సదరన్ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ యూస్ అటార్నీ రాండీ గ్రాస్‌మన్ అన్నారు.
70 ఓవర్ల వరకు శిక్ష!
ధరల్లో అవతకతవకలు, వైర్ ఫ్రాడ్, అనుమతి లేకుండా డబ్బు బదిలీ చేపట్టడం, అంతర్జాతీయంగా మనీ లాండరింగ్ వంటి అభియోగాలు కుంభానిపై నమోదు అయ్యాయి. ఇవన్నీ కోర్టులో నిరూపిస్తే మాక్సిమమ్ 70 ఏళ్ల వరకు అతడు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది.
ఇలా మోసం చేశాడు
మొదట బిట్‌కనెక్ట్స్‌కే సొంతమైన టెక్నాలజీ 'బిట్‌కాయిన్ ట్రేడింగ్ బాట్', 'వొలటిలిటీ సాఫ్ట్‌వేర్'ను కుంభాని అతడి సహచరులు విక్రయించారు. క్రిప్టో కరెన్సీ ఎక్స్‌ఛేంజ్ మార్కెట్లలో ఉండే ధరల ఒడుదొడుకులను ఆసరాగా చేసుకొని లాభాలు ఆర్జించొచ్చని నమ్మించారు. స్కీమ్‌లో చేర్పించి డబ్బులను తీసుకొని పెట్టుబడులు పెట్టించారు. మొదట బిట్‌కనెక్ట్స్‌లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లకు ఆ తర్వాత చేరిన వారి డబ్బుతో లాభాలు చెల్లించి పోంజీ స్కీమ్ నడిపించాడని కోర్టు తెలిపింది.
మనీ లాండరింగ్ అభియోగాలు
ఇలా ఇన్వెస్టర్ల నుంచి రూ.2.4 బిలియన్ డాలర్లు సొమ్ము చేసుకున్నారని తెలిసింది. ఒక ఏడాది వరకు స్కీమ్‌ను నడిపించిన కుంభాని హఠాత్తుగా బిట్‌కనెక్ట్స్ లెండింగ్ ప్రోగ్రామ్‌ను ఆపేశాడు. ఆ తర్వాత బిట్‌కనెక్ట్స్ డిజిటల్ కరెన్సీ ధరలను పెంచుతూ పోవాలని ప్రమోటర్లను ప్రోత్సహించాడు. స్కీమ్ నిర్వహించిన లొకేషన్‌ను మార్చేశాడు. బిట్‌కనెక్ట్స్ క్లస్టర్‌లోని క్రిప్టో కరెన్సీ వాలెట్లు నుంచి డబ్బులను ఇతర ఎక్స్‌ఛేంజ్‌ల ద్వారా మళ్లించాడు. అన్నిటికన్నా ముఖ్యంగా అమెరికా చట్టాలను ఉల్లంఘించాడు.
Cryptocurrency Prices Today, 26 February 2022: క్రిప్టో మార్కెట్లు శనివారం లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెడుతున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.19 శాతం పెరిగి రూ.30.61 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.56.09 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 2.90 శాతం పెరిగి రూ.2,16,665 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.24.46 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 2.35 శాతం పెరిగి రూ.29,365, టెథెర్ 0.05 శాతం పెరిగి రూ.78.92, కర్డానో 3.22 శాతం పెరిగి రూ.70.35, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం పెరిగి 79.08, రిపుల్ 7.35 శాతం పెరిగి రూ.59.89 వద్ద కొనసాగుతున్నాయి. హార్మనీ, వేవ్స్, టెర్రా, కాస్మోస్, పొల్కాడాట్, మెటల్, స్టేటస్ కాయిన్లు 10 నుంచి 19 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ట్రాన్, సింథెటిక్స్, ది గ్రాఫ్, డియా, పాక్స్ డాలర్, డాయి 1-5 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.