News
News
X

Indian Automakers: 10 లక్షల మార్క్‌ వైపు కార్‌ కంపెనీల రేస్‌ - లీడింగ్‌లో మారుతి

ఇదే స్థాయిలో అమ్మగలిగితే, ఒక త్రైమాసికంలో మొదటిసారిగా 1 మిలియన్ మార్కును దాటడానికి వీలవుతుంది.

FOLLOW US: 

Indian Automakers: ప్రస్తుత త్రైమాసికంలో (జులై-సెప్టెంబర్‌, Q2), భారతీయ వాహన తయారీ కంపెనీలు భారీ లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. ఒక మిలియన్ (10 లక్షలు) ప్రయాణీకుల వాహనాలను ( passenger vehicles -  PV) అమ్మాలని చూస్తున్నాయి. ప్రధాన పండుగల సీజన్‌ కొనసాగుతోంది కాబట్టి, గోల్‌ కొడతామని నమ్మకంగా ఉన్నాయి. ప్రస్తుత డిమాండ్‌ను, కొత్త లాంచ్‌లను ఉపయోగించుకుంటున్నాయి.

అనుకున్నట్లుగా ఈ త్రైమాసికంలో రికార్డ్‌ స్థాయి అమ్మకాలను ఆటోమేకర్లు సాధించగలిగితే, 2022 క్యాలెండర్ ఇయర్‌లోని ప్రారంభ అంచనాల కంటే దాదాపు అర మిలియన్ (5 లక్షల) యూనిట్లు అదనంగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఇప్పటికే ఆల్ టైమ్ హై వాల్యూమ్స్‌లో ఉంది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో కార్లు, యుటిలిటీ వెహికల్స్‌, వ్యాన్‌ల అమ్మకాలు గత సంవత్సరంతో పోలిస్తే 25-27 శాతం వృద్ధితో 3.85 - 3.90 మిలియన్ యూనిట్లకు చేరతాయని అంచనా.

ఈ త్రైమాసికంలో మొదటి రెండు నెలల్లో (జులై, ఆగస్టు) ఇప్పటికే 6,71,000 ప్యాసింజర్ వాహనాలను కారు కంపెనీలు అమ్మాయి. విడి భాగాల సరఫరాలు మెరుగు పడడంతో, ఈ నెలలో 3,25,000 - 3,35,000 యూనిట్ల అమ్మకాలు  ఉండవచ్చని అంచనా వేశాయి. వాస్తవంగా కూడా ఇదే స్థాయిలో అమ్మగలిగితే, ఒక త్రైమాసికంలో మొదటిసారిగా 1 మిలియన్ మార్కును దాటడానికి వీలవుతుంది.

ప్రస్తుత రికార్డ్‌ 9,33,000 యూనిట్లు
పండుగ విక్రయాలను దృష్టిలో పెట్టుకుని కొత్త రికార్డ్‌ కోసం ఆటో కంపెనీలు ఆరాట పడుతున్నాయి. ప్రస్తుతం ఒక త్రైమాసికంలో (మూడు నెలలు) ఉన్న రికార్డ్‌ 9,33,000 యూనిట్లు. ఇది, 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో నమోదైంది. ఒక మొత్తం సంవత్సరం రికార్డ్‌ 2018లో నమోదైన 3.39 మిలియన్ ప్యాసింజర్ వెహికల్స్‌. ఇదే ఇప్పటివరకు ఆల్ టైమ్ హై సేల్స్‌. 

విడిభాగాల కొరత, ప్రత్యేకించి కీలకమైన సెమీకండక్టర్ల లేమి వల్ల గత సంవత్సరంలో, ఈ సంవత్సరం ప్రారంభంలో వాహన కంపెనీలు ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. ఇప్పుడు ఆ ఇబ్బందులు తగ్గడంతో ఉత్పత్తిని పెంచాయి, కస్టమర్లకు డెలివరీలను వేగవంతం చేశాయి. 

మారుతి వద్ద 4,17,000 పెండింగ్‌ ఆర్డర్‌లు 
రాబోయే దసరా నవరాత్రులు, దీపావళి పండుగ సందర్భంగా డెలివరీల కోసం డిమాండ్‌ విపరీతంగా ఉంది. దీనికి తగ్గట్లుగా, ప్రస్తుత సామర్థ్యంలో 94-95 శాతం వినియోగిస్తున్నట్లు మార్కెట్ లీడర్ మారుతి సుజుకి తెలిపింది. ప్రస్తుతం మారుతి సుజుకి వద్ద 4,17,000 యూనిట్ల ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 40 శాతం SUV ఆర్డర్లు. ఇందులో, కొత్తగా లాంచ్‌ చేసిన బ్రెజ్జా (Brezza), త్వరలో లాంచ్‌ చేయనున్న గ్రాండ్ విటారా ‍‌(Grand Vitara) ఆర్డర్లు కూడా ఉన్నాయి. డిమాండ్ బలంగా ఉందని, కస్టమర్ల డిమాండ్‌కు అనుగుణంగా వాహనాలను ఉత్పత్తి చేయగలిగితే ఈ సంవత్సరం పండుగ అమ్మకాలు బాగానే ఉంటాయని మారుతి వెల్లడించింది.

ఈ కంపెనీ మరో రెండు మోడళ్లను విడుదల చేయనున్నందున, మీడియం టర్మ్‌లో, ప్యాసింజర్ వాహన మార్కెట్లో 50% వాటాను తిరిగి పొందాలని మారుతి సుజుకి లక్ష్యంగా పెట్టుకుంది. 

కొత్త లాంచ్‌లు - మారుతి సుజుకి నుంచి బ్రెజ్జా & గ్రాండ్ విటారా; టయోటా నుంచి హైరైడర్, వెన్యూ; హ్యుందాయ్ నుంచి టక్సన్; టాటా నుంచి పంచ్; మహీంద్ర & మహీంద్ర నుంచి XUV700, స్కార్పియో మీద కస్టమర్ల నుంచి బలమైన ఆసక్తి కనిపిస్తోంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 13 Sep 2022 01:27 PM (IST) Tags: Hyundai Maruti Automakers passenger vehicles 1 Million record

సంబంధిత కథనాలు

Stock Market Closing: ఇన్వెస్టర్ల కాసుల పంట! సెన్సెక్స్‌ 1270, నిఫ్టీ 380 పాయింట్లు అప్‌!

Stock Market Closing: ఇన్వెస్టర్ల కాసుల పంట! సెన్సెక్స్‌ 1270, నిఫ్టీ 380 పాయింట్లు అప్‌!

IT Firms Revoke Offer: మీ ఆఫర్‌ లెటర్లు రద్దు చేశాం! ఫ్రెషర్స్‌కి షాకిచ్చిన విప్రో, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా!

IT Firms Revoke Offer: మీ ఆఫర్‌ లెటర్లు రద్దు చేశాం! ఫ్రెషర్స్‌కి షాకిచ్చిన విప్రో, ఇన్ఫీ, టెక్‌ మహీంద్రా!

Stock Market Update: స్టాక్‌ మార్కెట్లో దసరా సంబరం! రూ.5 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!

Stock Market Update: స్టాక్‌ మార్కెట్లో దసరా సంబరం! రూ.5 లక్షల కోట్లు లాభపడ్డ మదుపర్లు!

Petrol-Diesel Price, 4 October: ఎగబాకిన చమురు ధరలు! మన దగ్గర నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే

Petrol-Diesel Price, 4 October: ఎగబాకిన చమురు ధరలు! మన దగ్గర నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే

Gold-Silver Price: బంగారం ధర పెరుగుతోంది! నేడు ఏకంగా రూ.350 ఎగబాకిన రేటు

Gold-Silver Price: బంగారం ధర పెరుగుతోంది! నేడు ఏకంగా రూ.350 ఎగబాకిన రేటు

టాప్ స్టోరీస్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

కేసీఆర్ వల్ల భూలోకంలోనే నరకం అనుభవించాను: ఈటల రాజేందర్

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

In Pics : తణుకులో ఎడ్ల పోటీలు, పాల్గొన్న మంత్రి రోజా

Munugode TRS : మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Munugode TRS :  మునుగోడులో మోహరించనున్న 86 మంది ఎమ్మెల్యేలు - హరీష్ రావుకే కీలక బాధ్యతలిచ్చిన కేసీఆర్ !

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్

Nagarjuna Bigg Boss 6 : 'బిగ్ బాస్ 6' టీఆర్పీపై నాగార్జున కామెంట్