అన్వేషించండి

Forex Reserves: వరుసగా ఏడో వారంలోనూ పెరిగిన ఫారెక్స్‌ రిజర్వ్స్‌, రికార్డ్‌ స్థాయికి చేరువ

గత ఆరు వారాల్లో విదేశీ మారకద్రవ్య నిల్వలు 30.12 బిలియన్ డాలర్లు పెరిగాయి.

Foreign Exchange Reserves in India: భారతదేశ ఆర్థిక పునాది నానాటికీ గట్టి పడుతోంది. మన దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు వరుసగా ఏడో వారంలోనూ పెరిగాయి, రికార్డు గరిష్ట స్థాయికి అతి చేరువలో ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిలీజ్‌ చేసిన తాజా రిపోర్ట్ ప్రకారం, 2023 డిసెంబర్ 29తో ముగిసిన వారంలో, భారతదేశ విదేశీ మారక నిల్వలు (India's Forex Reserves) 2.75 బిలియన్ డాలర్లు పెరిగి 623.20 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకు ముందు వారంలో విదేశీ నిధి 620.44 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఆరు వారాల్లో విదేశీ మారకద్రవ్య నిల్వలు 30.12 బిలియన్ డాలర్లు పెరిగాయి.  

భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు ‍‌(Forex reserves all-time high record) చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌. ఇప్పుడు, కేవలం 22 బిలియన్ల దూరంలో ఉన్నాయి. 

ఆర్‌బీఐ వీక్లీ స్టాటిస్టికల్ సప్లిమెంట్ ప్రకారం, 2023 డిసెంబర్ 29తో ముగిసిన వారంలో, విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) కూడా భారీగా పెరిగాయి. ఆ వారంలో FCAs 1.86 బిలియన్ డాలర్లు పెరిగి 551.61 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 

మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌ లోన్లలో సగం వాటా ఇళ్లదే, ఆ తర్వాత జనం తీసుకున్న అప్పులు ఇవి 

పెరిగిన బంగారం నిల్వలు
అదే కాలంలో, ఆర్‌బీఐ బంగారం నిల్వలు కూడా భారీగా పెరిగాయి. ఆర్‌బీఐ గోల్డ్‌ ఛెస్ట్‌ (Gold reserves In India) 853 మిలియన్ డాలర్లు పెరిగి 48.32 బిలియన్ డాలర్లకు చేరింది. SDRs (Special Drawing Rights) 38 మిలియన్ డాలర్లు పెరిగి 18.36 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే... అంతర్జాతీయ ద్రవ్య నిధిలో (IMF) డిపాజిట్ చేసిన నిల్వలు తగ్గి 4.89 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 

ఇటీవలి కాలంలో FPI ‍‌‍‌(ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్‌) పెట్టుబడులు బలంగా పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు ఒక రేంజ్‌లో దూసుకెళుతున్నాయి. కరెన్సీ మార్కెట్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ జోక్యం కూడా మరొక కారణం. 

ఏ దేశంలోనైనా విదేశీ మారక నిల్వలు ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉంటుంది. దేశ ఆర్థిక స్థిరత్వంలో ఫారెక్స్‌ రిజర్వ్స్‌ది కీలక పాత్ర. విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా దానిని గుర్తించాలి. 

బలపడిన రూపాయి (Indian Rupee Value)
శుక్రవారం (జనవరి 05, 2024) రోజున, కరెన్సీ మార్కెట్‌లో ఒక డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.16 వద్ద (dollar to rupee exchange rate) ముగిసింది, 7 పైసలు బలపడింది.

మరో ఆసక్తికర కథనం: కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌తో పావలా వడ్డీకే రుణం, దీని పూర్తి లాభాల గురించి తెలుసా? 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP DesamMysore Pak Sweet History | మహారాజును మెప్పించేందుకు తయారైన మైసూరుపాక్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vangalapudi Anitha: 'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
'పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేం లేదు' - డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై హోంమంత్రి అనిత స్పందన
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Actress Kasturi: తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
తమిళనాడులో ప్రతిరోజూ టార్చర్, తెలుగు పాలిటిక్స్ లోకి వస్తున్న - నటి కస్తూరి సంచలన ప్రకటన
Andhra News: ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఉద్యోగాల్లో ఆ కోటా పెంపు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Naga Chaitanya Sobhita Wedding Date: నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి డేట్ ఫిక్స్.. వచ్చే ఏడాది కాదు, ఈ సంవత్సరమేనట
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Realme GT 7 Pro Launched: మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
మోస్ట్ అవైటెడ్ రియల్‌మీ జీటీ 7 ప్రో వచ్చేసింది - భారీ బ్యాటరీతో ఎంట్రీ!
CM Revanth Reddy: ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
ఈ నెల 8న సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర - ఎక్కడంటే?
Embed widget