Global Recession: 'భారత్‌కు మాంద్యం ముప్పు లేదు- రాబోయే రోజుల్లో ఉద్యోగాలే ఉద్యోగాలు'
Global Recession: భారత్.. మాంద్యం గురించి బెంగ పడాల్సిన అవసరం లేదని, రాబోయే సంవత్సరాల్లో ఉపాధి రేటు భారీగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Global Recession: ప్రపంచ దేశాలు మాంద్యం (Recession) ముప్పు పొంచి ఉందని భయపడుతున్నాయి. కానీ భారత్ (India)లో మాత్రం మాంద్యం ప్రభావం అంతగా ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత నియామక ధోరణులు చూస్తే కొన్ని సంవత్సరాలలో భారత్ బలమైన ఉపాధి వృద్ధి రేటును చూసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు బిజినెస్ సర్వీసెస్ ప్రొవైడర్ Quess Corp వ్యవస్థాపకుడు, నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అజిత్ ఐజాక్ తెలిపారు.
బెంగళూరులో బుధవారం జరిగిన జాబ్ అన్వేషణ పోర్టల్ మాన్‌స్టర్ ఇండియా, ఎస్‌ఇ ఆసియా, మిడిల్ ఈస్ట్‌ల టాలెంట్ ప్లాట్‌ఫామ్ 'ఫౌండిట్' రీబ్రాండింగ్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీని ద్వారా ఉద్యోగులు, మేనేజర్‌లను నియమించుకోవడానికి అనేక రకాల సేవలను అందిస్తున్నట్లు ఐజాక్ చెప్పారు.
పలు దేశాల్లో
క్వెస్ కార్ప్.. 2018లో మాన్‌స్టర్ వరల్డ్‌వైడ్ APAC & ME వ్యాపారాలను తన HR సేవల పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేయడానికి వ్యూహాత్మక పెట్టుబడిగా కొనుగోలు చేసింది. భారత్, సింగపూర్, మలేషియా, ఫిలిప్పైన్స్, హాంకాంగ్, వియత్నాం, థాయిలాండ్, ఇండోనేసియా, యూఏఈ, సౌదీ అరేబియాలో ఈ సంస్థ పని చేస్తోంది.
ఉద్యోగాలు
ఇటీవల ఇన్ఫోసిస్, హెచ్‌పీ, విప్రో వంటి దిగ్గజ ఐటీ కంపెనీలు సహా గూగుల్, మెటా, ఫేస్‌బుక్, ట్విట్టర్.. భారీ సంఖ్యలో లేఆఫ్‌లు (ఉద్యోగాలు తీసేయడం) ఇస్తున్నాయి. దీంతో ఐటీ, టెక్ రంగాల ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
Also Read: China Covid-19 Cases: చైనాలో కరోనా పంజా- రికార్డ్ స్థాయిలో డైలీ వైరస్ కేసులు!