ICICI Bank Service Charges: ఐసీఐసీఐ అలర్ట్, ఆగస్టు 1 నుంచి కొత్త ఛార్జీలు
అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ సర్వీస్ ఛార్జీల విషయంపై ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఆగస్టు 1 నుంచి అమలుకానున్న ఛార్జీల వివరాలను అందజేసింది.
ఇటీవల కొన్ని బ్యాంకులు విలీనమయ్యాయి. విలీనం అయిన బ్యాంకు ఖాతాదారులకు కొత్త పాస్ బుక్, కొత్త ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్, కొత్త చెక్ బుక్ లాంటి మార్పులు చోటుచేసుకోవడం సహజం. ఇటీవల దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank Of India) క్యాష్ విత్‌డ్రాలో మార్పులు చేర్పులు చేసింది. చెక్ బుక్ వినియోగం, క్యాష్ విత్‌డ్రాలపై ఛార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రైవేట్ బ్యాంకు ఐసీసీఐసీ అదే బాటలో పయనిస్తోంది.
అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ సర్వీస్ ఛార్జీల విషయంపై ఖాతాదారులను అప్రమత్తం చేసింది. ఇదివరకే ఛార్జీల పెంపుపై నిర్ణయం తీసుకోగా, ఆగస్టు 1 నుంచి అమలుకానున్న ఛార్జీల వివరాలను అందజేసింది. ఐసీఐసీఐ ఖాతాదారులు ఇతర ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేస్తే ఏటీఎం ఇంటర్ చేంజ్ ఛార్జీలు, సేవింగ్ అకౌంట్స్ ఖాతాదారుల చెక్ బుక్ ఛార్జీలను సవరించింది. ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా లిమిట్, చెక్ బుక్ ఛార్జీల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
1. 6 మెట్రో నగరాలలో ఒక నెలలో మొదటి 3 లావాదేవీలు (ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలు) ఉచితంగా చేసుకోవచ్చు.
2. మెట్రోయేతర (Non Metro Cities) అన్ని ప్రాంతాలలో మొదటి 5 లావాదేవీలు ఉచితంగా అందిస్తుంది.
3. ఐసీఐసీఐ బ్యాంకులలో ప్రతినెలా మొదటి 4 లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదు. పరిమితి దాటితే లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.
4. ఆర్థిక సంబంధిత లావాదేవీలకి రూ.20, ప్రతి ఆర్థికేతర లావాదేవీకి బ్యాంకు రూ.8.50 వసూలు చేస్తుంది.
5. ఉచిత లావాదేవీలు ముగిసిన తరువాత ప్రతి లావాదేవికి రూ.150 మేర నగదు చెల్లించాల్సి ఉంటుంది.
6. ఆగస్టు 1వ తేదీ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో చేసే ప్రతి ట్రాన్సాక్షన్ల నగదు పరిమితి రూ.1 లక్ష వరకు ఉచితమని వెల్లడించింది. రూ.లక్ష దాటిన తరువాత చేసే లావాదేవిలకు ప్రతి రూ.1,000కు రూ.5 చొప్పున వసూలు చేస్తారు. చెల్లించాలి. కనీస రుసుము రూ.150 అని బ్యాంక్ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు.
7. నాన్ హోమ్ బ్రాంచీ (మీ ఖాతా లేని ఇతర ఐసీఐసీఐ బ్యాంకు)లో రోజుకు రూ.25,000 వరకు జరిపే నగదు లావాదేవిలకు ఎలాంటి ఛార్జీలు చెల్లించనవసరం లేదు. 25 వేలు దాటిన లావాదేవిలలో ప్రతి రూ.1,000కు రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. ఇందులోనూ మినిమం నగదు రూ. 150 చెల్లించాలి.
8. థర్డ్ పార్టీ లావాదేవీలపై రోజువారీ పరిమితి రూ.25,000గా నిర్ణయించింది. ఆ పరిమితి దాటిన తరువాత ప్రతి లావాదేవీపై రూ.150 వసూలు చేస్తారు. రూ.25,000 పరిమితికి మించి నగదు లావాదేవీలు చేయడానికి అవకాశం ఇవ్వలేదు.
9. ఒక ఏడాదిలో మొదటి 25 చెక్ పేజీల వరకు ఉచితంగా పొందవచ్చు. ఆపై ప్రతి 10 చెక్కులు ఉండే చెక్ బుక్‌కు రూ.20 వసూలూ చేస్తారు.
10. ఓ నెలలో నిర్వహించే మొదటి 4 లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు. అనంతరం జరిపే లావాదేవిలలో ప్రతి రూ.1000కి అదనంగా రూ.5 చెల్లించాలని బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలలో మినిమం ఛార్జీలు రూ.150గా ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది.