By: ABP Desam | Updated at : 23 Apr 2023 11:01 AM (IST)
భారీగా పెరిగిన వడ్డీ ఆదాయం & లాభం
ICICI Bank Q4 Resulats: దేశంలోని అతి పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంక్, శనివారం నాడు (22 ఏప్రిల్ 2023) నాలుగో త్రైమాసికం ఫలితాలను, పెట్టుబడిదార్లకు డివిడెండ్‌ను కూడా ప్రకటించింది.
2022-23 ఆర్థిక సంవత్సరం చివరి లేదా మార్చి త్రైమాసికంలో, ఏకీకృత ప్రాతిపదికన (కన్సాలిడేటెడ్) ICICI బ్యాంక్ నికర లాభం 27.64 శాతం పెరిగి రూ. 9,852.70 కోట్లకు చేరింది. స్వతంత్ర ప్రాతిపదికన (స్టాండలోన్) లాభం 30 శాతం వృద్ధితో రూ. 9,121.87 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ స్వతంత్ర నికర లాభం రూ. 7018.71 కోట్లుగా ఉంది.
FY23 జనవరి-మార్చి కాలంలో ఐసీఐసీఐ బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 27,412.32 కోట్ల నుంచి రూ. 36,108.88 కోట్లకు పెరిగింది. అదే సమయంలో, మొత్తం వ్యయాలు రూ. 17,119.38 కోట్ల నుంచి రూ. 22,282.50 కోట్లకు పెరిగాయి.
బలమైన నికర వడ్డీ ఆదాయం
వడ్డీ రేట్ల పెంపు వల్ల కీలకమైన వడ్డీ ఆదాయంలో బలమైన వృద్ధి నమోదైంది. నికర లాభంలో బలమైన వృద్ధికి ఇది తోడ్పడింది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) గత ఏడాది మార్చి త్రైమాసికంలోని రూ. 12,604.6 కోట్లతో పోలిస్తే, ఈసారి 40 శాతం పెరిగి రూ. 17,666.8 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ కూడా 4 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది.
డిపాజిట్లలో గణనీయమైన పెరుగుదల
ICICI బ్యాంక్ మొత్తం డిపాజిట్లు సంవత్సరానికి (YoY) 10.9 శాతం పెరిగి రూ. 1,180,841 కోట్లు లేదా 143.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. CASA (కరెంట్ ఖాతాలు - సేవింగ్స్ ఖాతాలు) నిష్పత్తి 43.6 శాతంగా లెక్క తేలింది.
రుణాల మంజూరులోనూ దాదాపు 19 శాతం వృద్ధి కనిపించింది. FY23 జనవరి-మార్చి కాలంలో, గృహ రుణాలు 20.5 శాతం పెరిగాయి.
తగ్గిన నిరర్ధక ఆస్తులు
ఐసీఐసీఐ బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల (GNPAలు) నిష్పత్తి 3.6 శాతం నుంచి 2.81 శాతానికి తగ్గి, మెరుగుపడింది. నికర నిరర్ధక ఆస్తుల (NNPAలు) నిష్పత్తి కూడా 0.48 శాతం తగ్గింది. అంతకుముందు త్రైమాసికంలో ఇది 0.55 శాతంగా ఉంది. ఈ విధంగా బ్యాంక్ నిరర్థక ఆస్తులు తగ్గుముఖం పట్టడం మంచి పరిణామం. అయితే.. బ్యాంక్ మొత్తం కేటాయింపులు (ప్రొవిజన్స్) రూ. 1,068 కోట్ల (YoY) నుంచి రూ. 1,619 కోట్లకు పెరిగాయి.
ఒక్కో షేరుపై రూ. 8 తుది డివిడెండ్
రూ. 2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై ఐసీఐసీఐ బ్యాంక్ రూ. 8 తుది డివిడెండ్ ప్రకటించింది. బ్యాంక్ వార్షిక సాధారణ సమావేశంలో వాటాదార్ల ఆమోదం తర్వాత ఈ డివిడెండ్‌ను చెల్లిస్తారు. దీనికి సంబంధించిన తేదీలను త్వరలో ప్రకటిస్తారు.
చివరి ట్రేడింగ్ సెషన్‌లో (శుక్రవారం, 21 ఏప్రిల్ 2023) ఐసీఐసీఐ బ్యాంక్ షేర్ BSEలో 1.13 శాతం తగ్గి రూ. 884.20 వద్ద ఉంది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Gold-Silver Price Today 07 June 2023: పసిడి స్థిరం - ఇవాళ బంగారం, వెండి ధరలు
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో వణుకు - రూ.88వేలు తగ్గిన బిట్‌కాయిన్
Stock Market News: టర్న్ అరౌండ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీ - ఎరుపెక్కిన ఐటీ ఇండెక్స్!
LIC Policy: రోజుకు ₹45 పెట్టుబడితో ₹25 లక్షలు మీ సొంతం
BoB: ఫోన్‌తో స్కాన్ చేసి డబ్బు తీసుకోవచ్చు, ఏటీఎం కార్డ్ అక్కర్లేదు
YS Viveka Case : అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ రద్దు చేయండి - సుప్రీంకోర్టులో సునీత పిటిషన్
‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్
Weather Latest Update: నేడు ఏపీలో ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు, తెలంగాణలో వేడి కాస్త తక్కువే - ఐఎండీ
Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్ క్యాలెండర్ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!