అన్వేషించండి

Health Insurance: నిఫా వైరస్‌ భయపెడుతోంది, మీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ దానిని కవర్‌ చేస్తుందా?

మీకు ఇప్పటికే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంటే, నిఫా వైరస్‌ లాంటి వైరల్‌ ఔట్‌బ్రేక్స్‌ను ఆ పాలసీ కవర్‌ చేస్తుందో, లేదో అర్థం చేసుకోవడం చాలా అవసరం.

Health Insurance Cover on Nipah Virus: కేరళలో నిఫా వైరస్‌ నాలుగో ఏడాదీ ఔట్‌బ్రేక్‌ అయింది, కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వైరస్‌ వల్ల పేషెంట్ల ప్రాణాలు కూడా పోతున్నాయి. కరోనా వైరస్‌తో పోలిస్తే నిఫా వైరస్‌ చాలా డేంజర్‌ అని, ప్రజలు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందేనని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR)  హెచ్చరించింది. కరోనా కేసుల్లో కేసుల్లో మరణాలకు అవకాశం 2-3 శాతంగా ఉంటే, నిఫా వైరస్‌ సోకిన వ్యక్తుల్లో అది 40-70 శాతంగా ఉంటుందంటూ బాంబ్‌ పేల్చింది. ఈ ఇన్ఫెక్షన్‌ కేరళ మొత్తం వ్యాపించే ప్రమాదం ఉందని WHO, ICMR చెబుతున్నాయి. కేరళకు ఆనుకుని ఉన్న కర్ణాటక, తమిళనాడు కూడా అలెర్ట్‌ అయ్యాయి. 

నిఫా వైరస్‌ సోకిన వ్యక్తుల చికిత్సలో కీలకంగా ఉపయోగించే మోనోక్లోనల్‌ యాంటీబాడీస్‌ (Monoclonal Antibodies) ఔషధాన్ని ఆస్ట్రేలియా నుంచి తెప్పిస్తున్నారు. నిఫా లక్షణాలు కనిపించిన తొలి రోజుల్లో వాడితేనే దీని వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ఈ నేపథ్యంలో, ఒక మంచి ఆరోగ్య బీమా (Good Health Insurance Cover) తోడుగా ఉంటే, మనకు ధైర్యంగా ఉంటుంది. అంతేకాదు, మీకు ఇప్పటికే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉంటే,  నిఫా వైరస్‌ లాంటి వైరల్‌ ఔట్‌బ్రేక్స్‌ను ఆ పాలసీ కవర్‌ చేస్తుందో, లేదో అర్థం చేసుకోవడం చాలా అవసరం. లేకపోతే, రైడర్స్‌ రూపంలో అదనపు బీమా కవరేజ్‌ తీసుకోవాలి.

సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ అవసరం
సాధారణంగా, అనారోగ్యానికి దారి తీసే అన్ని రకాల ఇన్ఫెక్షన్‌లకు సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలో ‍‌(comprehensive health insurance policy) కవరేజ్‌ ఉంటుంది, నిఫా వైరస్ కూడా ఈ వర్గంలోకి వస్తుంది. కాబట్టి, దాదాపు ప్రతి బీమా ప్రొవైడర్ నిఫా ఇన్ఫెక్షన్‌పై కవరేజీ ఇస్తుంది. ఇలాంటి ఇన్‌ఫెక్షన్‌ వల్ల వచ్చే అనారోగ్యాల వల్ల పాలసీదారు ఇన్‌-పేషెంట్‌గా హాస్పిటల్‌లో చేరితే, ఆ ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. అంతేకాదు, ఆసుపత్రిలో చేరడానికి ముందు, ఆసుపత్రిలో చేరిన తర్వాత సంరక్షణ వరకు పూర్తి ప్రయోజనాలను పొందవచ్చు.

ఇప్పుడు, చాలా బీమా కంపెనీలు ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ (OPD) కవర్‌ను కూడా అందిస్తున్నాయి. అంటే, అనారోగ్యం బారిన పడిన వ్యక్తి ఆసుపత్రిలో చేరాల్సిన (ఇన్‌-పేషెంట్‌) పరిస్థితి లేకపోతే, ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటే, దానికి సంబంధించిన ఖర్చుల్ని బీమా కంపెనీ భరిస్తుంది. ఔట్ పేషెంట్ ఖర్చుల్ని కవర్ చేయడానికి కూడా యాడ్-ఆన్‌ ఎంచుకోవచ్చు. 

ఆరోగ్య బీమా కంపెనీలు, తమ పాలసీల నుంచి పాండమిక్స్‌ లేదా వైరల్ ఇన్‌ఫెక్షన్‌లను మినహాయించవు. ఎందుకంటే అవి హఠాత్తుగా వ్యాపిస్తాయి. కాబట్టి, హెల్త్‌ పాలసీలు ఈ తరహా అనారోగ్యాలకు సంబంధించిన ఖర్చులను కవర్ చేస్తాయి.

బీమా పాలసీల్లో మినహాయింపులు
మరోవైపు, ఆరోగ్య బీమా పథకాల్లో కొన్ని మినహాయింపులు కూడా ఉంటాయి. ముందస్తుగా ఉన్న పరిస్థితులు, జీవనశైలికి సంబంధిత వ్యాధులు, అందానికి సంబంధించిన ప్రక్రియలు (cosmetic procedures), ప్రకృతివైద్యం & ఆక్యుప్రెషర్ వంటి చికిత్సలు కవరేజ్‌లోకి రావు.

ఐసోలేషన్ & క్వారంటైన్ ఖర్చులను పాలసీ కవర్ చేస్తుందా?
'డొమిసిలియరీ హాస్పిటలైజేషన్'ను (Domiciliary Hospitalisation) ఇన్సూరెన్స్‌ ప్లాన్‌ కవర్ చేస్తే... ఇన్-పేషెంట్‌గా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందవచ్చు. ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకపోతే, వైద్యుల సలహాతో ఇంట్లోనే చికిత్స తీసుకోవచ్చు. ఈ రెండు సందర్భాల్లోనూ కవరేజ్‌ ఉంటుంది.

ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఉండి చికిత్స తీసుకోవచ్చు?

1. ఆసుపత్రికి తరలించే పరిస్థితిలో రోగి లేకపోవడం

2. ఆసుపత్రిలో గది అందుబాటులో లేకపోవడం

నిఫా వైరస్ లాంటి అంటువ్యాధుల కేసుల్లో వెయిటింగ్‌ పిరియడ్‌
సాధారణంగా, ఒక వ్యక్తి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేస్తే, పాలసీ ప్రారంభ తేదీ నుంచి తొలి 30-రోజుల వరకు వెయిటింగ్‌ పిరియడ్‌ ఉంటుంది. నిఫా లాంటి ఇన్‌ఫెక్షన్లు హఠాత్తుగా చెలరేగుతాయి కాబట్టి, వాటి విషయంలో వెయిటింగ్‌ పిరియడ్‌ రూల్‌ వర్తించదు, తక్షణ కవరేజ్‌ లభిస్తుంది. పాలసీ ఇప్పటికే అమల్లో ఉండి తొలి 30 రోజులు పూర్తయినా వెయిటింగ్‌ పిరియడ్‌ అవసరం ఉండదు.

ప్రస్తుతం, వైద్య ద్రవ్యోల్బణం అతి భారీగా ఉంది. వైరల్ వ్యాధులు అకస్మాత్తుగా అత్యవసర పరిస్థితిని కల్పిస్తాయి. కాబట్టి, సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ ఉండడం చాలా అవసరం. అలాగే, పాలసీకి యాడ్-ఆన్ కవరేజ్‌లు ఉండడం కూడా మంచిది. హెల్త్‌ పాలసీలోకి రాని ఖర్చుల్ని (బయటి నుంచి కొనాల్సినవి, డైలీ అలవెన్స్‌, రూమ్ రెంట్‌ లాంటివి) అవి కవర్‌ చేస్తాయి. 

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదంతీరం దాటిన తుపాను, కొద్దిగంటల్లో ఏపీ, తెలంగాణ‌కు బిగ్ అలర్ట్!కేజ్రీవాల్‌పై రసాయన దాడి, గ్లాసుతో పోసిన దుండగుడుBobbili Guest House History Tour | బొబ్బిలి రాజుల గెస్ట్ హౌస్ ఎందుకంత ఫేమస్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
TTD Guidelines: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం - మార్గదర్శకాలు జారీ చేసిన టీటీడీ, ఈ రూల్స్ తప్పనిసరి!
Kia Syros: చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
చవకైన 7 సీటర్ కారును తీసుకురానున్న కియా - రూ.9 లక్షల్లోనే సైరోస్ ఎంట్రీ!
Peelings Song Pushpa 2: అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
అల్లు అర్జున్, రష్మిక దుమ్ము దులిపేశారంతే - మాంచి మాస్ డ్యాన్స్ నంబర్ 'పీలింగ్స్' వచ్చేసిందండోయ్
Nadendla Manohar: 'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
'జగన్.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి' - కాకినాడ పోర్టు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ సంచలన వ్యాఖ్యలు
Common Used Passcodes: 2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!
2024లో ఎక్కువ ఉపయోగించిన పాస్‌కోడ్‌లు ఇవే - మీది ఉంటే జాగ్రత్తగా ఉండాల్సిందే!
Mulugu Encounter: 'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
'అన్నంలో విష ప్రయోగం జరిగింది' - ములుగు ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘం అనుమానాలు, బహిరంగ లేఖ విడుదల
Maharastra CM: ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
ఉత్కంఠకు తెర పడుతుందా? - రేపే మహారాష్ట్ర సీఎం పేరు ఖరారు!
Embed widget