Nepal: నేపాల్‌లో ఒకే ఒక్క బిలియనీర్ బినోద్ చౌదరీ-ఇండియాలోనూ వ్యాపారాలు - ఆస్తి మొత్తం ఎంతో తెలుసా?
Nepal billionaire : మన దేశంలో వేల మంది బిలియనీర్లు ఉన్నారు. కానీ నేపాల్ లో మాత్రం ఒక్కరే ఉన్నారు. ఆయన పేరు బినోద చౌదరి.

Nepal billionaire Binod Chaudhary: నేపాల్ ఇంకా వెనుకబడిన దేశమే. అత్యధికంగా దిగుమతులు చేసుకుంటుంది. కానీ ఆ దేశం నుంచి కూడా కొన్ని ఎగుమతులు ఉంటాయి. ఓ బిలియనీర్ అక్కడ వ్యాపార ప్రపంచాన్ని ఏలుతున్నారు. ఆయన పేరు బినోద్ చౌదరి, నేపాల్‌లోని ఏకైక బిలియనీర్. చౌదరి గ్రూప్ అధ్యక్షుడిగా, 136 కంపెనీలతో కూడిన విస్తృత వ్యాపార సామ్రాజ్యా న్ని నడిపిస్తున్నారు. ఫోర్బ్స్ ప్రకారం, 2023లో అంచనా వేసిన అతని నికర సంపద $1.8 బిలియన్ (సుమారు ₹14,700 కోట్లు).
1973లో చిన్న స్థాయిలో వ్యాపారాలు ప్రారంభించిన బినోద్ చౌదరి
బినోద్ చౌదరి వ్యాపారాలు బ్యాంకింగ్, హాస్పిటాలిటీ, కన్స్యూమర్ గూడ్స్, ఎనర్జీ, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ వంటి వివిధ రంగాల్లో విస్తరించి ఉన్నాయి. అతని అత్యంత ప్రసిద్ధ బ్రాండ్‌లలో ‘వై వై నూడుల్స్’. నేపాల్‌లోని నబీల్ బ్యాంక్ ఉన్నాయి. ఇవి ఇతర దేశాల్లో ప్రజాదరణ పొందాయి. బినోద్ చౌదరి మొదట 1973లో డిస్కోను ప్రారంభించారు, ఇది యువతలో బాగా ఆదరణ పొందింది.య 1984లో, థాయ్‌లాండ్ పర్యటన నుండి స్ఫూర్తి పొంది, ‘వై వై నూడుల్స్’ను నేపాల్‌లో ప్రవేశపెట్టారు - 1995లో నబీల్ బ్యాంక్‌లో నియంత్రణ షేర్లను దుబాయ్ ప్రభుత్వం కొనుగోలుచేసింది. ఇది నేపాల్‌లోని ప్రముఖ బ్యాంకులలో ఒకటిగా మారింది.
వైవై నూడిల్స్ తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
చౌదరి గ్రూప్ 12 కంటే ఎక్కువ రంగాల్లో 136 కంపెనీలను నిర్వహిస్తుంది, ఇందులో రియల్ ఎస్టేట్, హోటళ్లు, ఎలక్ట్రానిక్స్, టెలికాం, బయోటెక్ ఇతర రంగాలు ఉన్నాయి. 160కి పైగా సంస్థలను నిర్వహిస్తూ, 15,000 మందికి పైగా ఉద్యోగులను నియమించిన ఈ గ్రూప్ పలు దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. చౌదరి గ్రూప్ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి, ‘వై వై నూడుల్స్’, భారతదేశంతో సహా అనేక దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. చౌదరి గ్రూప్ సుజుకి , పానాసోనిక్ వంటి అంతర్జాతీయ బ్రాండ్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకున్నారు. ఇది అతని వ్యాపార విస్తరణకు దోహదపడింది. ని గ్రూప్ హోటళ్లు, ఎడ్యుకేషన్, ఎనర్జీ, టెలికాం వంటి రంగాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇది దక్షిణ ఆసియా వ్యాపార రంగంలో అతన్ని ఒక ప్రముఖ వ్యక్తిగా నిలిపింది.
రాజకీయాల్లోనూ తనదైన ముద్ర
వ్యాపారవేత్తగా మాత్రమే కాకుండా, బినోద్ చౌదరి రాజకీయ నాయకుడిగా, ఫిలాంత్రోపిస్ట్‌గా కూడా గుర్తింపు పొందారు. 2013లో ఫోర్బ్స్ ద్వారా నేపాల్‌లోని ఏకైక బిలియనీర్‌గా గుర్తింపు పొందారు. బినోద్ చౌదరి రతన్ టాటా నుండి ప్రేరణ పొందారు. అతని సంపద ముఖేష్ అంబానీ ($115.3 బిలియన్) , ఎలన్ మస్క్ ($411.4 బిలియన్) వంటి గ్లోబల్ బిలియనీర్లతో పోలిస్తే చాలా తక్కువ అయినప్పటికీ, నేపాల్ పరిస్థితులతో పోలిస్తే అతను ఒక అసాధారణ వ్యక్తిగా గుర్తింపు పొందాడు. బినోద్ చౌదరిని ‘నూడుల్ కింగ్’గా పిలుస్తారు. వై వై నూడుల్స్‌తో ప్రారంభమై, బ్యాంకింగ్, హాస్పిటాలిటీ, ఎనర్జీ వంటి రంగాల్లో విస్తరించిన అతని సీజీ కార్ప్ గ్లోబల్, దక్షిణ ఆసియాలో ఒక శక్తివంతమైన వ్యాపార గ్రూప్‌గా నిలిచింది.





















