HDFC Bank: బలమైన నంబర్లు ప్రకటించినా షేర్ల నేలచూపులు, బ్రోకరేజ్‌లు ఏం చెప్పాయి?
మొత్తం ఆదాయం ఏడాదికి 31% పెరిగి రూ. 53,851 కోట్లకు చేరుకుంది.
HDFC Bank shares: 2022-23 చివరి త్రైమాసికంలో బలమైన నంబర్లను ప్రకటించినా, మార్కెట్ బలహీనత కారణంగా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు ఇవాళ లోయర్ సైడ్ ట్రేడ్ అవుతున్నాయి.
మార్చితో ముగిసిన త్రైమాసికం ఫలితాలను శనివారం నాడు (15 ఏప్రిల్ 2023) హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప్రకటించింది. Q4లో బ్యాంక్ నికర లాభం సంవత్సరానికి (YoY) దాదాపు 20% పెరిగి రూ. 12,047 కోట్లకు చేరుకుంది. మొత్తం ఆదాయం ఏడాదికి 31% పెరిగి రూ. 53,851 కోట్లకు చేరుకుంది.
7 బ్రోకరేజీలు ఇచ్చిన అంచనాల సగటు ప్రకారం, ఈ రుణదాత నికర లాభం 21% పెరిగి రూ. 12,180 కోట్లకు చేరుకుంటుందన్నది లెక్క.
బ్యాంక్ నిర్వహణ లాభం రూ. 18,620 కోట్లుగా ఉంది, ఇది YoYలో 13.8% పెరిగిన QoQలో 2.1% తగ్గింది. ICICI సెక్యూరిటీస్ అంచనా వేసిన రూ. 19,500 కంటే తక్కువగా ఉంది.
ఇవాళ (సోమవారం, 17 ఏప్రిల్ 2023) ఉదయం 11:55 గంటల సమయానికి, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు రూ. 1,661.15 వద్ద ట్రేడవుతున్నాయి, గురువారం ముగింపు ధరతో పోలిస్తే రూ. 30.85 లేదా 1.82% తగ్గాయి.
ఫలితాల తర్వాత బ్రోకరేజ్‌లు ఏం చెప్పాయంటే..
కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్: బయ్ | టార్గెట్ ప్రైస్: రూ. 1,925 | అప్‌సైడ్ ర్యాలీ: 14%
కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్, ఈ స్టాక్‌కు ఫ్యూచర్ వాల్యూతో రూ. 1,925 వద్ద ఒక్కో షేరును అంచనా వేస్తోంది, గతంలోని రూ. 1,800 నుంచి టార్గెట్ ధరను పెంచింది.
ICICI సెక్యూరిటీలు: బయ్ | టార్గెట్ ప్రైస్: రూ. 1,990 | అప్‌సైడ్ ర్యాలీ: 17%
గత అంచనా అయిన, FY24 బుక్‌కు 3.2 రెట్ల విలువతో ఇచ్చిన రూ. 1,874 టార్గెట్ ధరను సవరించి రూ. 1,990కి మార్చింది, 'బయ్' రేటింగ్ కంటిన్యూ చేసింది.
షేర్‌ఖాన్: కొనండి | టార్గెట్ ప్రైస్: రూ. 1,920
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేరుపై 'బయ్' రేటింగ్‌ను, రూ. 1,920 ప్రైస్ టార్గెట్‌ను ఈ బ్రోకరేజ్ మార్చలేదు.
ప్రభుదాస్ లీలాధర్: బయ్
ఈ బ్రోకరేజ్ సంస్థ, స్టాక్ లక్ష్యాన్ని రూ. 1,850 నుంచి రూ. 1,925 కి పెంచింది, ఒక 'బయ్' రేటింగ్ నిలుపుకుంది.
ఇన్వెస్టెక్: హోల్డ్ | టార్గెట్ ప్రైస్: రూ. 1,720
HDFCని HDFC బ్యాంక్‌లో విలీనానికి సంబంధించిన ఆందోళనలను త్రైమాసిక ఆదాయాల వెల్లడి సమయంలో మేనేజ్‌మెంట్ అడ్రస్ చేయకుండా వదిలేసిందని హైలైట్ చేస్తూ HDFC బ్యాంక్‌పై 'హోల్డ్' రేటింగ్ కొనసాగించింది.
మోతీలాల్ ఓస్వాల్: బయ్ | టార్గెట్ ప్రైస్: రూ. 1,950
ఈ స్టాక్‌పై బయ్ కాల్‌ను కంటిన్యూ చేసిన బ్రోకరేజ్, ప్రైస్ టార్గెట్‌ను రూ. 1,950 కు 15% అప్‌గ్రేడ్ చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.