New GST Rates:వ్యక్తిగత వైద్య బీమాపై నో జీఎస్టీ- సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పిన నిర్మలమ్మ
New GST Rates:బీమాను మరింత మందికి తక్కువ ధరకు అందించేందుకు జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్యులకు కవరేజీని పెంచడమే లక్ష్యంగా వ్యక్తిగత వైద్యబీమాపై జీఎస్టీని రద్దు చేసింది.

New GST Rates: వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీని మినహాయించారు. ఇప్పటి వరకు బీమాలపై 18 శాతం పన్ను వేసేవాళ్లు. దీన్ని పూర్తిగా రద్దు చేస్తూ జీఎస్టీ మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
56వ GST కౌన్సిల్ సమావేశం తర్వాత విలేకరుల సమావేశంలో సీతారామన్ మాట్లాడుతూ, "ప్రస్తుతం 18% శ్లాబ్‌లో ఉన్న బీమా సేవలు రెండు, మూడు వేర్వేరు వర్గాలలోకి వెళ్తాయి. టర్మ్ లైఫ్, ULIP, లేదా ఎండోమెంట్ పాలసీలు, వాటి రీఇన్సూరెన్స్ అయినా అన్ని వ్యక్తిగత జీవిత బీమా పాలసీలపై GST మినహాయింపు ఇస్తున్నాం. సామాన్యులకు బీమాను మరింత చౌకైనదిగా చేసేందుకు దేశంలో బీమా కవరేజీని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం."
#WATCH | Delhi: After the 56th GST Council meeting, Union Finance Minister Nirmala Sitharaman says, "Insurance services from 18% currently will go into two, three different categories. Exemption of GST on all individual life insurance policies, whether term life, ULIP, or… pic.twitter.com/nYrnmoHRVC
— ANI (@ANI) September 3, 2025
"ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీలు, సీనియర్ సిటిజన్ల పాలసీలతో సహా అన్ని వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీలపై GST మినహాయింపు లభిస్తుంది. వాటి పునఃభీమా సామాన్యులకు బీమాను అందుబాటులోకి తీసుకురావడానికి ,దేశంలో బీమా కవరేజీని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆమె జోడించారు.
56వ GST కౌన్సిల్ సమావేశం తర్వాత, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, దేశంలో ఇప్పుడు రెండు GST శ్లాబులు మాత్రమే ఉంటాయని, 5%, 18% అని అన్నారు. ఈ సందర్భంగా, ABP న్యూస్ అడిగిన ప్రశ్నపై ఆమె కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు UPA ప్రభుత్వాన్ని విశ్వసించనందున కాంగ్రెస్ పార్టీ తన హయాంలో GSTని అమలు చేయలేకపోయిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.
పొగాకు సిగరెట్లపై ఐదు శాతం పన్ను విధించాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుందా అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అడిగారు? "మనం ప్రజలకు ప్రయోజనం చేకూరుస్తున్నప్పుడు, కాంగ్రెస్ దానిపై రాజకీయాలు చేస్తోంది. కాంగ్రెస్ మళ్ళీ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఇప్పుడు ప్రజలు వాటిని బయటపెడతారు."
కొత్త GST శ్లాబులో, రోజువారీ ఉపయోగించే వస్తువులపై GST రేట్లు తగ్గిందని. పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లు మినహా కొత్త GST రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. GDPపై GST రేట్ల మార్పు ప్రభావంపై, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, "ఇది GDPపై చాలా సానుకూల ప్రభావాన్ని చూపుతుందని నేను భావిస్తున్నాను" అని అన్నారు.
"సామాన్యులను దృష్టిలో ఉంచుకుని ఈ సంస్కరణలు చేపట్టాం. సామాన్యులు నిత్యం ఉపయోగించే వస్తువులపై విధించే ప్రతి పన్నును క్షుణ్ణంగా సమీక్షించాం. చాలా సందర్భాలలో, రేట్లు గణనీయంగా తగ్గించాం. రైతులు, వ్యవసాయ రంగం, ఆరోగ్య రంగం కూడా ప్రయోజనం పొందుతాయి" అని ఆర్థిక మంత్రి అన్నారు.





















