GST Collection: రూ.లక్ష కోట్లు దాటిన ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లు
ఆగస్టులోనూ జీఎస్టీ వసూళ్లు రూ.లక్ష కోట్లపైనే నమోదయ్యాయి. 2020 ఆగస్టు పోలిస్తే గత నెల జీఎస్టీ ఆదాయం 30 శాతం పెరిగినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది.
జీఎస్టీ వసూళ్లు ఆగస్టు నెలలో రూ.లక్ష కోట్లు దాటాయి. అయితే జులై నెలతో పోలిస్తే ఆగస్టులో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు స్వల్పంగా తగ్గాయి. జులైలో రూ.1,16,393 కోట్లు రాగా.. ఆగస్టు నెలలో రూ.1,12,020 కోట్లు వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది.
अगस्त 2021 में जीएसटी राजस्व संग्रह
— पीआईबी हिंदी (@PIBHindi) September 1, 2021
अगस्त में 1,12,020 करोड़ रुपये का सकल जीएसटी राजस्व संग्रह
विवरण: https://t.co/r3DXIL5NRR pic.twitter.com/OSCzq70fea
- సెంట్రల్ జీఎస్టీ వాటా రూ.20,522 కోట్లు
- స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు
- ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.56,247 కోట్లు
వీటితో పాటు సెస్సుల రూపంలో మరో రూ.8646 కోట్లు చొప్పున వసూలైనట్టు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.
గతేడాది ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోలిస్తే ఈ వసూళ్లు 30శాతం అధికంగా కాగా.. అంతకముందు ఏడాదితో (98,202 కోట్లు) పోలిస్తే 14శాతం పెరిగాయి.
గతంలో వరుసగా తొమ్మిది మాసాల పాటు లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు.. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది జూన్‌లో రూ.లక్ష కోట్ల కన్నా దిగువకు పడిపోయాయి. ఆ తర్వాత కొవిడ్ ఆంక్షలు సడలించడంతో వరుసగా జులై, ఆగస్టు మాసాల్లో రూ.లక్ష కోట్లు మార్కు దాటాయి.
యాక్సిస్ బ్యాంక్ పై ఫైన్..
RBI imposes a monetary penalty of Rs 25 Lakhs on Axis Bank Limited (the bank) for contravention of/non-compliance with certain provisions of directions issued by RBI contained in the Reserve Bank of India – (Know Your Customer (KYC)) Direction, 2016: Reserve Bank of India pic.twitter.com/7RuPzCeDVe
— ANI (@ANI) September 1, 2021
యాక్సిస్ బ్యాంక్ పై ఆర్బీఐ రూ. 25 లక్షలు మానిటరీ పెనాల్టీ విధించింది. 2016, (Know Your Customer (KYC)) డైరెక్షన్ ను అమలు పరచనందుకు ఈ మేరకు ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది.
Also Read:Block VPN: 'వీపీఎన్'లను బ్యాన్ చేయండి.. కేంద్రానికి స్టాండింగ్ కమిటీ సిఫార్సు