అన్వేషించండి

Monthly Pension: సీనియర్‌ సిటిజన్స్‌కు భారీ శుభవార్త - అటల్ పెన్షన్ యోజన కింద నెలనెలా రూ.10 వేలు!

Atal Pension Yojna: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సమర్పించే బడ్జెట్‌లో, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, అటల్ పెన్షన్ యోజన (APY)పై పెద్ద ప్రకటన చేయవచ్చు.

Union Budget 2025: ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ‍‌(Finance Minister Nirmala Sitharaman), ఫిబ్రవరి 01వ తేదీన 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ సమర్పించనున్నారు. ప్రస్తుతం, దేశంలోని అందరి దృష్టి ఈ బడ్జెట్‌ పైనే ఉంది. సామాన్యులు, శ్రీమంతులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇలా ప్రతీ ఒక్కరు బడ్జెట్‌ డే కోసం ఎదురు చూస్తున్నారు. సీనియర్‌ సిటిజన్స్‌ కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన (Atal Pension Yojna)కి సంబంధించి, కేంద్ర ప్రభుత్వం  ఈసారి బడ్జెట్‌లో పెద్ద ప్రకటన చేయవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. సామాజిక భద్రతను పెంపొందించే చొరవలో భాగంగా, ఈ పథకం కింద పొందే కనీస పెన్షన్ మొత్తాన్ని రెట్టింపు చేసే అవకాశం ఉంది. 

ప్రస్తుతం, అటల్ పెన్షన్ యోజన ‍(APY) నెలవారీ పెన్షన్ కనీస మొత్తం రూ.1,000 నుంచి రూ.5,000 వరకు ఉంది. ఒక వ్యక్తి ఎంత పెన్షన్ పొందుతారు అనే విషయం అతని కాంట్రిబ్యూషన్‌ మీద ఆధారపడి ఉంటుంది. 

నెలవారీ పింఛను రెట్టింపు చేసేందుకు ప్రయత్నాలు
అటల్ పెన్షన్ యోజన కింద ప్రస్తుతం అందుతున్న పెన్షన్‌ను పెంచే ప్రతిపాదనకు కేంద్ర సర్కారు ఆమోదం తెలిపే అవకాశం ఉందని నేషనల్‌ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మినిమమ్ గ్యారెంటీ మొత్తాన్ని రూ. 10,000కు పెంచే ప్రతిపాదన చివరి దశలో ఉందని, బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉందని ఆ కథనాలను బట్టి తెలుస్తోంది. 

అటల్ పెన్షన్ యోజన అనేది కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అమలవుతున్న పింఛను పథకం. దీని లక్ష్యం.. పేదలకు & అసంఘటిత రంగంలో పని చేస్తున్న వారికి వృద్ధాప్యంలో ఆర్థిక సహాయం అందించడం. 2015-16 సంవత్సరంలో, 'పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ' (PFRDA) ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్‌లో డబ్బు డిపాజిట్ చేసిన వారికి, ఇప్పుడు, నెలవారీ పెన్షన్ రూ. 1,000 నుంచి రూ. 5,000 వరకు లభిస్తోంది. 

APY ఇతర ప్రయోజనాలు, వివరాలు
అటల్ పెన్షన్ యోజనలోని అతి పెద్ద ఫీచర్‌ డెత్‌ బెనిఫిట్స్‌ కలిగి ఉండడం. ప్రమాదవశాత్తు లబ్ధిదారుడు మరణిస్తే, నామినీకి డెత్‌ బెనిఫిట్స్‌ అందుతాయి. 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ పౌరులు అటల్ పెన్షన్ యోజన కింద అకౌంట్‌ ప్రారంభించవచ్చు. ఈ పథకం కోసం దరఖాస్తు చేయాలనుకున్న వ్యక్తి పేరిట బ్యాంకులో లేదా పోస్టాఫీస్‌లో పొదుపు ఖాతా (savings account) ఉండాలి. సేవింగ్స్‌ ఖాతా & ఆధార్‌తో లింక్‌ అయిన ఫోన్‌ నంబర్‌ కూడా ఉండాలి. పథకం ప్రయోజనాలను పొందడానికి, పొదుపు ఖాతాను కలిగి ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌ నుంచి రిజిస్ట్రేషన్ ఫామ్‌ను తీసుకోవచ్చు లేదా వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత, ఫారంలో సంబంధిత వివరాలను పూరించి పెన్షన్ ఆప్షన్‌ ఎంచుకోవాలి. చివరగా.. ఆధార్ కార్డు జిరాక్స్‌ సహా ఇతర అవసరమైన పత్రాలతో కలిపి ఆ ఫారాన్ని సమర్పించాలి. 

2022 అక్టోబర్‌ 01 తర్వాత ఆదాయ పన్ను చెల్లించిన లేదా చెల్లిస్తున్న వ్యక్తులు APYలో చేరడానికి అనర్హులు.

మరో ఆసక్తికర కథనం: భారత బడ్జెట్‌లో బ్రిటిష్ సంప్రదాయానికి స్వస్థి - తేదీలు, సమయాల్లో విప్లవాత్మక మార్పులు 

టాప్ హెడ్ లైన్స్

National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Embed widget