By: ABP Desam | Updated at : 07 Feb 2022 06:47 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర వరుసగా నేడు కూడా స్థిరంగా ఉంది. వెండి ధరలో కిలోకు రూ.100 తగ్గింది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.49,200 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలోకు రూ.65,000గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.65,000 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.45,100 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.49,200గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.65,000గా ఉంది.
దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..
అయితే, ఇతర నగరాల్లో బంగారం ధరల్లో కూడా నేడు ఎలాంటి మార్పు కనిపించలేదు. చెన్నై నగరంలో ఈ రోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.45,420గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,550గా కొనసాగుతోంది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,100 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,200 గా ఉంది.
ప్లాటినం ధర నేడు ఇలా..
సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర నేడు తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర నేడు రూ.17 పెరిగి.. రూ.24,560 గా అయింది. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర యథాతథంగా ఉంది.
అనేక అంశాలపై పసిడి, వెండి ధరలు
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Maruti Suzuki: అద్భుతమైన ఫీచర్లు, అందుబాటు ధరలో సామాన్యుడి కారు- Alto K10 ప్రత్యేకతలు ఇవే!
టాటా నెక్సాన్ ఈవీలో కొత్త మోడల్ - ధర మ్యాక్స్ కంటే తక్కువే!
Syrma SGS Technologies IPO: సిర్మా ఐపీవో అదుర్స్! రూ.48కి పెరిగిన గ్రే మార్కెట్ ప్రీమియం
Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్‌లో బ్లడ్‌బాత్! బిట్‌కాయిన్ 24 గంటల్లో రూ.2 లక్షలు క్రాష్!
Stock Market Closing: 8 రోజుల లాభాలకు తెర! మళ్లీ 60K కిందకు సెన్సెక్స్!
TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో
Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం