News
News
వీడియోలు ఆటలు
X

Gold: పదేళ్లలో రెట్టింపైన పసిడి ధర - సగానికి సగం తగ్గిన రూపాయి విలువ

సరిగ్గా 10 సంవత్సరాల క్రితం, 2013లో, స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు దాదాపు 29,000 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది.

FOLLOW US: 
Share:

Gold Price Hike: బంగారం ప్రకాశం రోజురోజుకూ పెరుగుతోంది. బంగారం ధరలు కొత్త రికార్డులు సృష్టించేందుకు ఆసక్తిగా ఉరకెలత్తుతున్నాయి. 2023 మార్చి మూడో వారంలో, బంగారం మొదటిసారిగా 10 గ్రాములకు రూ. 60,000 దాటింది. ఏప్రిల్ నెలలో రూ. 61,000 దాటింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుందన్న సంకేతాలు కనిపిస్తుండడంతో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. పెరుగుతున్న బంగారం ధరలకు రెండు వైపులా పదును ఉంది. బంగారంపై ఇన్వెస్ట్ చేసిన వాళ్లు తమ పెట్టుబడిపై ఇప్పటికే అద్భుతమైన లాభాలు పొందుతున్నారు. రాబోయే పెళ్లిళ్ల సీజన్‌ కోసం నగలు కొందామని భావిస్తున్న వాళ్ల జేబుకు చిల్లు పడుతోంది.

2013లో బంగారం రేటు రూ. 29,000
ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్‌లో ఒడుదొడుకులు కనిపిస్తున్నాయి, కమొడిటీల ధరల్లో భారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను ఉపసంహరించుకోవడానికి విదేశీ పెట్టుబడిదార్లు  ప్రయత్నిస్తున్నారు. ఆ డబ్బును బంగారంలోకి మళ్లించడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు తారుమారైనా, సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారంలోకే పెట్టుబడులు వెళ్తుంటాయి. 

గత 10 ఏళ్లలో, బంగారంపై ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు. గత దశాబ్ద కాలంగా బంగారం ధరల గమనాన్ని పరిశీలిస్తే, సరిగ్గా 10 సంవత్సరాల క్రితం, 2013లో, స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములకు దాదాపు 29,000 రూపాయల వద్ద ట్రేడ్‌ అయింది. ఆ తర్వాత రెండేళ్లలో, 2015లో ధరలు కాస్త మెత్తబడి 10 గ్రాముల ధర రూ. 26,000కు తగ్గింది. ఇక అప్పటి నుంచి బంగారం ధరలు వెనుదిరిగి చూడలేదు. 

10 ఏళ్లలో 110 శాతం పెరిగిన ధర
బంగారం ధర 2018లో రూ. 31,000, 2019లో రూ.35,000, 2020లో రూ.48,000, 2022లో రూ.52,000, ఇప్పుడు 10 గ్రాములు రూ.61,000 పైన ట్రేడవుతోంది. 2022 డిసెంబర్ 30 చివరి ట్రేడింగ్ రోజున, బంగారం ధర రూ. 54,790. అప్పుడు బంగారంపై ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు ఇప్పుడు 10 శాతం కంటే ఎక్కువ రాబడి, లేదా 10 గ్రాములకు రూ.6,300 లభించింది. 2022 ప్రారంభంలో బంగారం 10 గ్రాముల రేటు 47,850 రూపాయలు. ఈ 15 నెలల్లోనే బంగారం 10 గ్రాములకు 27.50 శాతం లేదా రూ.13,150 లాభం ఇచ్చింది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక దాడి, ప్రపంచ ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణం, ఖరీదైన వడ్డీ రేట్లు కనిపించాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లలో భారీ క్షీణత కనిపించింది. కానీ బంగారంపై పెట్టుబడి పెట్టినవాళ్లను ఆ లోహం ధనవంతులను చేసింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం బంగారం పెరుగుదల ఇక్కడితో ఆగదు. 10 గ్రాముల బంగారం ధర రూ.65,000 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

పదేళ్లలో 51 శాతం బలహీనపడిన రూపాయి
బంగారం మాత్రమే కాదు, గ్లోబల్ కరెన్సీ డాలర్‌ను కొనుగోలు చేసి తమ వద్ద ఉంచుకున్న వాళ్లు కూడా విపరీతమైన లాభాలు కూడా పొందాయి. 10 సంవత్సరాల క్రితం, డాలర్‌తో పోలిస్తే ఒక రూపాయి 54 స్థాయిలో ట్రేడవుతోంది. ఈ పది సంవత్సరాల్లో, రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. ఈ కాలంలో, ఒక డాలర్‌తో రూపాయి మారకం విలువ 82 రూపాయల స్థాయికి తగ్గింది. అంటే, గత 10 ఏళ్లలో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 51 శాతం క్షీణించింది. 

డాలర్ బలం కారణంగా భారతదేశ దిగుమతులు చాలా ఖరీదుగా మారాయి. బంగారం, ముడి చమురును భారతదేశం ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది, ఈ రెండింటి దిగుమతి కోసం ఎక్కువ డాలర్లు ఖర్చు చేస్తోంది.

Published at : 06 Apr 2023 07:13 AM (IST) Tags: Gold Price Today Rupee Dollar Gold all time record

సంబంధిత కథనాలు

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్‌ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

Form 16: ఇంకా ఫామ్‌-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్‌ కూడా ఉంది

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?

Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్‌ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్‌ బిలియనీర్ సలహా

Youngest Billionaire: లైఫ్‌లో రిస్క్‌ చేయకపోతే మిగిలేది రస్కే - యంగెస్ట్‌ బిలియనీర్ సలహా

FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్‌, డాలర్ల వరద పారించిన ఫారినర్లు

FPIs: మే నెలలో ట్రెండ్ రివర్స్‌, డాలర్ల వరద పారించిన ఫారినర్లు

టాప్ స్టోరీస్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Gudivada Amarnath: రైల్వే మంత్రితో మంత్రి అమర్నాథ్ భేటీ, ఏపీ సీఎం జగన్ ను అభినందించిన అశ్విని వైష్ణవ్

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Telangana As Number 1: జయహో తెలంగాణ‌, తాజా నివేదికలో రాష్ట్రం నెంబర్ వన్ - మంత్రి కేటీఆర్ హ‌ర్షం

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Odisha Train Accident: ఈ ప్రమాదానికి బాధ్యత ఎవరిది? కాగ్ రిపోర్ట్‌ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు - ప్రియాంక గాంధీ

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?

Sharwanand Wedding Photos : రాయల్‌గా శర్వా - రక్షిత వెడ్డింగ్, కొత్త జంట ఫోటోలు చూశారా?