(Source: ECI/ABP News/ABP Majha)
Gold Rate Today: గుడ్ న్యూస్, బంగారం ధరలకు బ్రేక్, రూ.4000 తగ్గిన వెండి ధర - లేటెస్ట్ రేట్లు ఇవీ
Gold Price Today 24th April 2022: గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (Gold Rates Today In Hyderabad) రూ.53,450కు దిగొచ్చింది.
Gold Price Today 24th April 2022: బంగారం ధరల జోరుకు బ్రేక్ పడింది. జీవితకాల గరిష్టానికి చేరుకున్న పసిడి ధరలు తాజాగా నిలకడగా ఉన్నాయి. బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,870 ఇటీవల నమోదైంది. గత రెండు రోజులుగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర (Gold Rates Today In Hyderabad) రూ.53,450కు దిగొచ్చింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,000 కు పతనమైంది. మరోవైపు వెండి ధర వారం రోజుల్లో రూ.4000 మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.71,600గా ఉంది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు నేడు నిలకడగా ఉన్నాయి. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 24th April 2022) 10 గ్రాముల ధర రూ.53,450 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. రూ.500 తగ్గడంతో విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.71,600 కు దిగొచ్చింది.
విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధరలు శాంతించాయి. లైఫ్ టైమ్ రికార్డ్ రేట్లు నమోదు చేసిన బంగారం ధరలు దిగొచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,450 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,000 కు పతనమైంది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.300 మేర తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.74,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.53,450 కి పతనమైంది.
చెన్నైలో గరిష్ట ధరలు నమోదు చేసింది బంగారం. రూ.210 మేర ధర తగ్గినా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,450 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.53,950 తో దేశంలోనే రికార్డ్ ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,000 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.53,450 కి దిగొచ్చింది.
ప్లాటినం ధర (Platinum Rates Today)
హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,720కి పతనమైంది.
ఢిల్లీలో 95 రూపాయలు తగ్గి, 10 గ్రాముల ధర రూ.22,770 అయింది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.23,720 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబైలో రూ.95 తగ్గడంతో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.22,770 అయింది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.