అన్వేషించండి

Gas Rate: బడ్జెట్‌ తాయిలాల్లోనే కాదు, గ్యాస్‌ రేట్లలోనూ సామాన్యుడికి మొండిచెయ్యి

దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price Today) రూ. 14 పెరిగి రూ. 1769.50కి చేరింది.

LPG Cylinder Price Hike: తాత్కాలిక బడ్జెట్‌ (Interim Budget 2024) నెపంతో కామన్‌మ్యాన్‌కి కనీసం ఒక్క శుభవార్త కూడా చెప్పని కేంద్ర ప్రభుత్వం, గ్యాస్‌ ధరల విషయంలోనూ నిరాశపరిచింది. వాస్తవానికి, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ (Finance Minister Nirmala Sitharaman) కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి కొన్ని గంటల ముందే కొత్త గ్యాస్‌ సిలిండర్‌ రేట్లు పెరిగాయి. తాత్కాలిక బడ్జెట్‌ + సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఈసారైనా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గిస్తారేమోనని ఎదురు చూసిన సామాన్య జనానికి కేంద్రం రిక్తహస్తం చూపింది. ఆహార పదార్థాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న జనానికి, ఫిబ్రవరి నెలలోనూ గ్యాస్‌ బండ గుదిబండగా మారింది.

ఈ నెల ప్రారంభం (01 ఫిబ్రవరి 2024) నుంచి వర్తించేలా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ రేటును చమురు మార్కెటింగ్‌ కంపెనీలు (OMCs) పెంచాయి. ఇప్పుడు, కమర్షియల్‌ సిలిండర్‌ కొనాలంటే ఇంకాస్త ఎక్కుడ డబ్బును వ్యాపారులు ఖర్చు చేయాలి. 

దేశంలోని ప్రధాన నగరాల్లో  19 కిలోల LPG సిలిండర్‌ కొత్త ధరలు ఇవి:         
దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్ ధర (Commercial LPG Cylinder Price Today) రూ. 14 పెరిగి రూ. 1769.50కి చేరింది. కోల్‌కతాలో రూ. 18 పెరిగి రూ.1887 కు; ముంబైలో రూ. 15 పెరిగి రూ. 1723.50 కు; చెన్నైలో రూ.12.50 పెరిగి రూ. 1937 కు చేరింది.

ప్రభుత్వ చమురు కంపెనీలు, 01 జనవరి 2024న, 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను తూతూమంత్రంగా కేవలం రూపాయిన్నర తగ్గించాయి. ఆ నెలలోకూడా 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ప్రైస్‌ను తగ్గించలేదు. 

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి 

రూటు మారని దేశీయ గ్యాస్‌ సిలిండర్ రేటు        
సామాన్య ప్రజలకు ఈసారి కూడా ఊరట దక్కలేదు. ఇంట్లో వంటకు ఉపయోగించే 14 కిలోల దేశీయ గ్యాస్‌ సిలిండర్‌ రేటును OMCలు ఈసారి కూడా తగ్గించలేదు. చివరిసారిగా, 2023 ఆగస్టు 30న, డొమొస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్‌ రేట్లను కేంద్ర సవరించింది. అప్పటి నుంచి, ఆరు నెలలుగా రేట్లు తగ్గించకుండా అధిక స్థాయిలోనే కొనసాగిస్తోంది.

ప్రస్తుతం, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర (Domestic LPG Cylinder Price Today) దిల్లీలో రూ. 903, కోల్‌కతాలో రూ. 929, ముంబైలో రూ. 902.50, చెన్నైలో రూ. 918.50, హైదరాబాద్‌లో రూ. 955, విజయవాడలో రూ. 944.50 గా ఉంది. రవాణా ఛార్జీలను బట్టి ఈ రేటులో చిన్నపాటి మార్పులు ఉండొచ్చు.

LPG సిలిండర్ కొత్త రేట్లను ఎలా తెలుసుకోవాలి?
LPG సిలిండర్ రేటును ఆన్‌లైన్‌లో చెక్‌ చేయాలనుకుంటే, ఇండియన్ ఆయిల్ అధికారిక వెబ్‌సైట్ https://iocl.com/prices-of-petroleum-products లో చూడవచ్చు. ఈ సైట్‌లో LPG ధరలతో పాటు జెట్ ఫ్యూయల్‌, ఆటో గ్యాస్, కిరోసిన్ వంటి ఇంధనాల కొత్త రేట్లు కనిపిస్తాయి.

మరో ఆసక్తికర కథనం: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' IndiGo, Tata Motors, Titan, Paytm

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందనAndhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP DesamKasturi Entry Telangana Politics | జనసేనలో చేరుతున్న నటి కస్తూరీ..? | ABP DesamKasturi Insult Telugu People | తెలుగువాళ్లపై నోరు పారేసుకున్న కస్తూరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
విపక్ష పాత్ర కూడా కూటమిదే - పవన్ కల్యాణ్ మాస్టర్ ప్లాన్ - వైసీపీకి అర్థమవుతోందా ?
Telangana: బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
బీసీ రిజర్వేషన్ల కోసం స్పెషల్ కమిషన్ ఏర్పాటు, తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
Vizianagaram MLC: విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో వైసీపీకే పూర్తి మెజార్టీ - టీడీపీ పోటీ చేస్తుందా ?
US Presidential Election 2024: సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
సాయంత్రం 4.30కి యుఎస్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభం- సర్వేలు ఏం చెబుతున్నాయి?
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Andhra Pradesh Assembly on Nov 11th | వైసీపీనే వెంటాడుతూనే ఉన్న 11వ నెంబర్ | ABP Desam
Ola News: కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
కస్టమర్ ఫిర్యాదు, రూ.1.73 లక్షలు చెల్లించాలని ఓలాకు కోర్టు ఆదేశాలు
Siddaramaiah MUDA Case: కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు, ఈ 6న విచారణకు హాజరు
CM Revanth Reddy: 'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
'రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలు నమ్మొద్దు' - విద్యార్థులకు చదువు, సామాజిక స్పృహ రెండూ ముఖ్యమన్న సీఎం రేవంత్
Embed widget