G20 Summit 2023: జీ20 విందుకు 170 మంది అతిథులు.. పూర్తి జాబితా ఇదే!
G20 Summit 2023: జీ20 సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులకు విందు ఇస్తున్నారు. దేశవిదేశాల నుంచి అతిరథ మహారథులు ఈ డిన్నర్‌కు హాజరవుతున్నారు.
G20 Summit 2023:
జీ20 సమావేశాల (G20 Summit 2023) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులకు విందు ఇస్తున్నారు. దేశవిదేశాల నుంచి అతిరథ మహారథులు ఈ డిన్నర్‌కు హాజరవుతున్నారు. శనివారం రాత్రి దిల్లీలోని భారత్ మండపం అనే ఫంక్షన్ హాల్‌లో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 170 మంది అతిథులను ఆహానించారు. వివిధ దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు, వారి ప్రతినిధులు, ప్రధాన మంత్రి, మాజీ ప్రధానులు, కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానం అందింది.
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్, ఆయన సతీమణి సుదేశ్ ధన్‌కడ్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఈ విందుకు హాజరవుతారు. ఈ విందుకు రాజకీయ నాయకులను ఆహ్వానించలేదు.
రాజనాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, ఎస్ జైశంకర్, అర్జున్ ముండా, స్మృతి ఇరానీ, పియూష్ గోయెల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషీ సహా కేబినెట్ మినిస్టర్లు విందుకు వస్తున్నారు.
కేంద్ర మంత్రులు నారాయణ రాణె, సర్బానంద సోనోవాల్, వీరేంద్ర కుమార్ పరాస్, గిరిరాజ్ సింగ్, జ్యోతిరాధిత్య సింధియా, అశ్విని వైష్ణవ్, పషుపతి కుమార్ పరాస్, గజేంద్ర సింగ్ షెకావత్, కిరణ్ రిజిజు, రాజ్‌కుమార్ సింగ్, హర్‌దీప్ సింగ్ పూరి, మన్‌సుక్ మాండవీయ, భూపేంద్ర యాదవ్, మహేంద్ర నాథ్ పాండే, పురుషోత్తమ్ రూపాలా, జి కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ ఆహ్వానితుల జాబితాలో ఉన్నారు.
రావ్ ఇందర్‌జీత్ సింగ్, జితేంద్ర సింగ్, అర్జున్ రామ్ మేఘావల్, శ్రీపాద యశోనాయక్, ఫగాన్ సింగ్ కులస్తే, ప్రహ్లాద్ సింగ్ పటేల్, అశ్విన్ కుమార్, విజయ్ కుమార్ సింగ్, కృష్ణ పాల్ గుర్జార్, రావ్ సాహెబ్ పటేల్, రాందాస్ అథవాలె, సాధ్వి నిరంజన్ జ్యోతి, సంజీవ్ కుమార్ బలియాన్, నిత్యానంద రాయ్, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్, రాజీవ్ చంద్రశేఖర్, శోభా కరందలజె, భాను ప్రతాప్ సింగ్, దర్శన జర్దోష్, వీ మురళీధరన్, మీనాక్షి లేఖి, సోమ్ ప్రకాశ్, రేణుకా సింగ్, రామేశ్వర్ తేలి, కైలాష్ చౌదరి, అన్నపుర్ణా దేవి, నారాయణ స్వామి, కుశాల్ కిషోర్, అజయ్ భట్, బీఎల్ వర్మ, అజయ్ కుమార్ మిశ్రా, డెబు సింగ్ చౌహాన్, భగవత్ ఖుబా, కపిల్ మోరేశ్వర్ పాటిల్, ప్రతిమా భౌముక్, దెబు సింగ్ చౌహాన్, భగవత్ ఖుబా, కపిల్ మోరేశ్వర్ పాటిల్, ప్రతిమా భౌముక్, సుభాశ్ సర్కార్, భగవత్ కృష్ణ రావ్ కరాద్, రాజ్‌కుమార్ రంజన్ సింగ్, భరాతీయ ప్రవీన్ పవార్, విశ్వేశ్వర్ తుడు, సుకాంత్ ఠాకూర్, మహేంద్ర భాయి, జాన్ బర్లా, డాక్టర్ ఇల్‌మురుగన్, నిశిత్ ప్రామానిక్ సహా అన్ని శాఖల సహాయ మంత్రులు విందుకు వస్తున్నారు.
కాగ్ అధినేత గిరీశ్ చంద్ర ముర్ము, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఎన్‌ఎస్‌ఏ అజిత్ దోవత్, దిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా, జీ20 షరేపా అమితాబ్ కాంత్, ఇతర ముఖ్య అతిథులు వస్తున్నారు. మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవే గౌడకు ఆహ్వానాలు అందాయి. అనారోగ్య కారణాలతో విందుకు రావడం లేదని దేవెగౌడ ప్రకటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు వెళ్లాయి. అయితే ఎవరెవరు హాజరవుతారో చూడాల్సి ఉంది.