News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

G20 Summit 2023: G20 నాయకుల్లో ఎక్కువ ఎంజాయ్‌ చేస్తోంది మోదీనే!

G20 Summit 2023: జీ20 సదస్సు నాయకత్వాన్ని మోదీ ఆస్వాదిస్తున్నారు. మిగతా దేశాలు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటే.. ఆయన మాత్రం అందరికీ భారత గ్రోత్ రేటు చూపిస్తున్నారు.

FOLLOW US: 
Share:

G20 Summit 2023: 

జీ20 సమావేశాల వేళ భారత ప్రతిష్ఠ మరింత ఇనుమడించనుంది. పెట్టుబడులు పెట్టేందుకు మనల్ని మించిన దేశం మరొకటి లేదని చాటే తరుణం వచ్చేసింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం మరొకటి లేదని.. మనకు పోటీ ఎవరూ లేరని గర్వపడే క్షణాలు వచ్చేశాయి. చైనాకు తాము మాత్రమే చెక్‌ పెట్టగలమని ప్రధాని నరేంద్రమోదీ తమ చేతలతో చూపించారు. భారత స్టాక్‌ మార్కెట్లు జీవిత కాల గరిష్ఠాల్లో కొనసాగుతుండటం, మార్కెట్‌ విలువ 3.8 లక్షల డాలర్లకు చేరుకోవడాన్ని ఆయన ఆస్వాదిస్తున్నారు.

భారత అభివృద్ధి చూపింపేందుకు స్టాక్‌ మార్కెట్‌ ఒక కొలమానం. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లన్నీ ఇబ్బందులు పడుతుంటే మన స్టాక్‌ మార్కెట్లు మాత్రం పరుగులు పెడుతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా విదేశీ సంస్థాగత మదుపర్లు పెట్టుబడుల వర్షం  కురిపిస్తున్నారు. రిటైల్‌ బూమ్‌ ఆకాశాన్ని తాకుతోంది. చిన్న చిన్న ఇన్వెస్టర్లూ నిస్సంకోచంగా షేర్లను కొంటున్నారు. భారీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, ఇతర సంస్థలు దివాలా తీస్తుండటంతో చైనా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడుతోంది. తయారీ రంగం దెబ్బతి టోంది. కంపెనీల అక్కడ నుంచి భారత్‌కు తరలి వస్తున్నాయి. ఇప్పటికే ఆపిల్‌, సామ్‌సంగ్‌ వచ్చేశాయి. 

పెట్టుబడులకు అత్యంత సురక్షితంగా ఉన్న మార్కెట్‌ భారత్‌ మాత్రమేనని మార్కెట్ మనీ మేనేజర్లు అంటున్నారు. గోల్డ్‌మాన్‌ సాచెస్‌ గ్రూప్‌ చైనాకు అండర్‌ వెయిట్‌ ర్యాంకు ఇచ్చింది. 'స్థానిక అభివృద్ధి, విధాన సంస్కరణలు, తిరుగులేని రుణాభివృద్ధి భారత మార్కెట్లకు ఊతమిస్తోంది' అని స్టాండర్డ్‌ ఛార్టెడ్‌ బ్యాంకు ఎస్‌జీ లిమిటెడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్టు ఔడ్రె గో అంటున్నారు. భిన్న ధ్రువాలుగా మారుతున్న ప్రపంచం భారత్‌కు లాభమని తెలిపారు.

ఈ వారం భారత స్టాక్‌ మార్కెట్ల విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. సరిగ్గా జీ20 సమావేశాల జరుగుతున్న తరుణంలో ఈ ఘనత సాధించడం ప్రధాని నరేంద్రమోదీకి మరో గుర్తింపు తీసుకొచ్చింది. భౌగోళిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు భారత్‌ పెట్టుబడులకు అత్యంత సురక్షితం అని చాటేందుకు ఆయనకు మళ్లీ అవకాశం దొరికింది. చైనా ప్రాబల్యాన్ని తగ్గించాలని పశ్చిమ దేశాలు తహతహలాడుతున్న వేళ ప్రత్యేక టారిఫ్‌లు, ఇన్‌సెంటివ్స్‌తో ఆయన పెద్ద కంపెనీలను ఇటువైపు రప్పించారు. ఇప్పటికే ఆపిల్‌, సామ్‌సంగ్‌ ఉత్పత్తిని మొదలు పెట్టాయి. 

విదేశీ పెట్టుబడిదారులు ఈ ఏడాది నికరంగా 16 బిలియన్‌ డాలర్లను భారత స్టాక్‌ మార్కెట్లోకి పంప్‌ చేశారు. చివరి మూడేళ్లలో అత్యధిక నిధుల ప్రవాహం ఇదే కావడం గమనార్హం. చైనా సహా ఎమర్జింగ్‌ మార్కెట్లు గ్లోబల్‌ సెలాఫ్‌తో ఆందోళన చెందగా భారత్‌కు ఇందుకు మినహాయింపు పొందింది. 'ఆసియాలో నాకు అత్యంత ఇష్టమైన మార్కెట్ భారత్‌' అని జెఫరీస్‌ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్‌ హెడ్‌ క్రిస్‌ వుడ్‌ అనడం గమనార్హం.

కరోనా మహమ్మారి కనిష్ఠ స్థాయి నుంచి భారత్‌ మార్కెట్లు మూడు రెట్లు వృద్ధి చెందాయి. భారత్‌ ఐదో అతిపెద్ద మార్కెట్‌గా అవతరించింది. ఇదే సమయంలో అమెరికా రెండు రెట్లే పెరిగింది. ఎన్నికల సమయంలో మార్కెట్లలో స్వింగ్‌ కనిపిస్తుందని, సుదీర్ఘ కాలంలో భారత్‌కు తిరుగులేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మౌలిక సదుపాయాలు వేగంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో ఉపాధి అవకాశాలు తగ్గుతాయని భయపడుతున్నా.. విద్యా ప్రమాణాలు, మౌలిక సదుపాయాల వల్ల ఉద్యోగాలు పెరుగుతాయని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడ, ఏ ఫండ్‌ హౌజ్‌, మేనేజర్‌ను కదిలించినా భారతే తమ ఫేవరెట్‌ అని చెబుతున్నారు.

Also Read: G20లో ఆఫ్రికన్ యూనియన్‌కి శాశ్వత సభ్యత్వం, ప్రధాని మోదీ కీలక ప్రకటన

Published at : 09 Sep 2023 01:51 PM (IST) Tags: Narendra Modi stock markets G20 summit G20 Summit 2023

ఇవి కూడా చూడండి

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Honda SP 125 Sports Edition: రూ. లక్ష లోపే స్పోర్ట్స్ బైక్ లుక్ - హోండా ఎస్పీ125 స్పోర్ట్స్ ఎడిషన్‌ చూశారా?

Cryptocurrency Prices: మస్తు లాభాల్లో క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిన్‌ రూ.50వేలు జంప్‌

Cryptocurrency Prices: మస్తు లాభాల్లో క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిన్‌ రూ.50వేలు జంప్‌

Stock Market Today: కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?

Stock Market Today: కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు! మధ్యాహ్నం ఏం జరుగుతుందో?

Latest Gold-Silver Price 29 September 2023: నేల చూపుల్లో గోల్డ్‌, షాక్‌ ఇచ్చిన సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

Latest Gold-Silver Price 29 September 2023: నేల చూపుల్లో గోల్డ్‌, షాక్‌ ఇచ్చిన సిల్వర్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

FD Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా?, సెప్టెంబర్‌లో FD రేట్లను సవరించిన లీడింగ్‌ బ్యాంకులు ఇవే!

FD Rates: ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నారా?, సెప్టెంబర్‌లో FD రేట్లను సవరించిన లీడింగ్‌ బ్యాంకులు ఇవే!

టాప్ స్టోరీస్

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం