అన్వేషించండి

Forex Reserves: ఫారెక్స్‌ ఖజానా కళకళ - పెరిగిన విదేశీ కరెన్సీ, బంగారం నిల్వలు

భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధికంగా 645 బిలియన్ డాలర్లకు ‍‌చేరుకున్నాయి.

Foreign Exchange Reserves in India: భారతదేశ విదేశీ మారక ద్రవ్య ఖజానా మళ్లీ కళకళలాడింది. అంతకుముందు క్షీణించిన విదేశీ కరెన్సీ నిల్వలు, తిరిగి పుంజుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుక్రవారం నాడు విదేశీ మారక నిల్వల గణాంకాలను విడుదల చేసింది. ఆర్‌బీఐ డేటా ప్రకారం, 2024 జనవరి 26తో ముగిసిన వారంలో భారతదేశంలో విదేశీ మారక నిల్వలు (India's Forex Reserves) 591 మిలియన్‌ డాలర్లు పెరిగి 616.733 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీనికిముందు, 2024 జనవరి 19తో ముగిసిన వారంలో 2.79 బిలియన్ డాలర్లు తగ్గి 616.14 బిలియన్‌ డాలర్లకు చేరాయి. దీనికి ముందు, వరుసగా ఏడు వారాల పాటు ఫారెక్స్‌ రిజర్వ్స్‌ రైజింగ్‌లో ఉన్నాయి. ఆ ఏడు వరుస వారాల్లో 30.12 బిలియన్ డాలర్లు పెరిగాయి. 

భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధికంగా 645 బిలియన్ డాలర్లకు ‍‌చేరుకున్నాయి. ఇది, జీవిత కాల గరిష్ట రికార్డ్‌ (Forex reserves all-time high record). భారత ప్రభుత్వం ఎగుమతులపై ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల, త్వరలోనే ఆ రికార్డ్‌ను దాటి కొత్త రికార్డ్‌ సృష్టించొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం, ఫారెక్స్‌ నిల్వలు, తమ జీవిత కాల గరిష్ట రికార్డ్‌ స్థాయికి దాదాపు 28 బిలియన్‌ డాలర్ల దూరంలో ఉన్నాయి. 

2024 జనవరి 5తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets - FCA) కూడా 289 బిలియన్ డాలర్ల వృద్ధితో 546.14 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 

పెరిగిన బంగారం నిల్వలు
సమీక్ష కాలంలో ఆర్‌బీఐ వద్ద బంగారం నిల్వలు కూడా పెరిగాయి. RBI గోల్డ్‌ ఛెస్ట్‌ (Gold reserves In India) 269 మిలియన్ డాలర్లు పెరిగి 47.48 బిలియన్ డాలర్లకు చేరాయి. SDRs (Special Drawing Rights) 27 మిలియన్‌ డాలర్ల జంప్‌తో 18.24 బిలియన్‌ డాలర్లకు చేరాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధిలో (IMF) డిపాజిట్ చేసిన నిల్వలు 6 మిలియన్ డాలర్లు పెరిగి 4.86 బిలియన్ డాలర్లకు చేరాయి. 

కరెన్సీ మార్కెట్‌లో RBI జోక్యం తర్వాత, దేశంలో విదేశీ కరెన్సీ ఆస్తులలో మార్పులు కనిపిస్తున్నాయి. మన దేశంలో తగినన్ని ఫారెక్స్‌ రిజర్వ్స్‌ ఉన్నాయని భారత ప్రభుత్వం చెబుతోంది. ఏ దేశంలోనైనా విదేశీ మారక నిల్వలు ఎంత ఎక్కువ స్థాయిలో ఉంటే ఆ దేశం ఆర్థికంగా అంత బలంగా ఉంటుంది. దేశ ఆర్థిక స్థిరత్వంలో ఫారెక్స్‌ రిజర్వ్స్‌ది కీలక పాత్ర. విదేశీ మారక నిల్వలు తగ్గుతున్నాయంటే, ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా దానిని గుర్తించాలి. 

బలపడిన రూపాయి (Indian Rupee Value)
శుక్రవారం (02 ఫిబ్రవరి 2024) రోజున, కరెన్సీ మార్కెట్‌లో ఒక డాలర్‌తో రూపాయి మారకం విలువ 82.92 వద్ద (dollar to rupee exchange rate) ముగిసింది, 06 పైసలు బలపడింది. అంతకుముందు సెషన్‌లో ఇది 82.98 స్థాయిలో ఉంది.

మరో ఆసక్తికర కథనం: 

టాప్ హెడ్ లైన్స్

Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News:మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
మహిళలతో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Venkatesh: కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్... అనిల్ రావిపూడితో కొత్త సినిమాలో ఆయన ఫస్ట్ లుక్ చూశారా?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Embed widget