అన్వేషించండి

Forex Reserves: భారత ఖజానాకు ఫారిన్‌ కరెన్సీ కళ, $595.1 బిలియన్లకు ఫారెక్స్‌ అకౌంట్‌ జంప్‌

విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1.85 బిలియన్‌ డాలర్లు పెరిగి 595.05 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి,

India Forex Reserves: ఇండియా వద్ద ఉన్న ఫారిన్‌ కరెన్సీ నిల్వలు మరోసారి విజృంభించాయి. జూన్ 30, 2023తో ముగిసిన వారానికి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు 1.85 బిలియన్‌ డాలర్లు పెరిగి 595.05 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఇది అంతకుముందు వారంలో ఇవి 593.2 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన డేటా ప్రకారం, జూన్ 30, 2023తో ముగిసిన వారానికి, విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets) 2.53 బిలియన్‌ డాలర్ల జంప్‌తో 527.79 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. ఫారిన్‌ కరెన్సీ అసెట్స్‌ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్‌ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు. 

దేశంలో బంగారం నిల్వలు
అయితే, సమీక్ష కాలంలో దేశంలో బంగారం నిల్వలు (Gold reserves In India) తగ్గుముఖం పట్టాయి. జూన్ 30, 2023తో ముగిసిన వారంలో గోల్డ్‌ ఛెస్ట్‌ విలువ 472 మిలియన్ డాలర్ల డాలర్లు తగ్గి 43.83 బిలియన్ డాలర్లకు దిగి వచ్చింది.

RBI ప్రకారం, ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ (IMF) వద్ద ఉన్న ఇండియన్‌ రిజర్వ్స్‌ 118 మిలియన్‌ డాలర్లు తగ్గింది, 5 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. 

రూపాయి మారకం విలువ
శుక్రవారం (07 జులై 2023), డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బలహీనపడింది. కరెన్సీ మార్కెట్ ముగిసే సమయానికి, రూపాయి ఒక డాలర్‌తో పోలిస్తే 22 పైసలు తగ్గి రూ. 82.74 వద్ద క్లోజ్‌ అయింది. దీనికి ముందు సెషన్‌లో రూ. 82.52 వద్ద ముగిసింది.

ఆల్ టైమ్ హై లెవెల్ ఇది
భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్‌ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది, ఆల్‌ టైమ్‌ హై రికార్డ్‌. అప్పటి నుంచి RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరం ప్రారంభంలోనూ, మన దేశ విదేశీ మారక నిల్వలు 633 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదార్లు భారత్‌లోని తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని డాలర్ల రూపంలో ఆ డబ్బును వెనక్కు తీసుకెళ్లారు. ఈ కారణంగా, విదేశీ మారక నిల్వలు తగ్గుతూ వచ్చాయి, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నుంచి ఉత్పన్నమయిన ప్రపంచ ఉద్రిక్తతలు కూడా మన దేశ ఫారెక్స్‌ రిజర్వ్స్‌పై ప్రభావం చూపాయి. క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరిగాయి. ముడి చమురు కొనుగోళ్ల కోసం డాలర్ల రూపంలో ఎక్కువగా వ్యయం చేయాల్సి వచ్చింది. 2022లో US ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ప్రారంభించడంతో విదేశీ పెట్టుబడిదార్లు తమ పెట్టుబడులను వెనక్కు తీసుకోవడం ప్రారంభించారు. దీంతో, రూపాయి విలువలో బలహీనత కనిపించింది. ఆ సమయంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 శాతం పడిపోయి రూ.83 కనిష్ట స్థాయికి చేరుకుంది. రూపాయికి మద్దతు ఇవ్వడానికి, ఆర్‌బీఐ డాలర్లను విక్రయించాల్సి వచ్చింది. ఈ కారణంగానూ విదేశీ మారక నిల్వలు క్షీణించాయి.

ఏ దేశంలోనైనా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే విదేశీ మారక నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. విదేశీ మారక నిల్వల్లో క్షీణతను ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా చూడాలి. నిల్వలు పెరుగుతుంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడుతున్నాయని భావించాలి.

మరో ఆసక్తికర కథనం: టయోటా కార్లు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - మళ్లీ పెరిగిన ధరలు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget