Toyota Price Hike: టయోటా కార్లు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - మళ్లీ పెరిగిన ధరలు!
టయోటా కిర్లోస్కర్ కార్ల ధరలు పెంచినట్లు అధికారికంగా ప్రకటించారు.
![Toyota Price Hike: టయోటా కార్లు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - మళ్లీ పెరిగిన ధరలు! Toyota Kirloskar Cars Price Increased Again in India Check Details Toyota Price Hike: టయోటా కార్లు కొనాలనుకునేవారికి బ్యాడ్ న్యూస్ - మళ్లీ పెరిగిన ధరలు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/07/0bfb33aa11c127a06def4bbaa5ed8e1e1688751277289456_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Toyota Kirloskar Motor: టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా భారతదేశంలో తన ఎస్‌యూవీలు, ఇతర మోడల్ కార్ల ధరలను పెంచింది. పెరిగిన ధరలు కూడా ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో టయోటా కార్ల ధరలను పెంచడం ఇది రెండో సారి.
కార్ల ధరలు ఎందుకు పెరిగాయి?
ప్రస్తుతానికి టయోటా పెరిగిన ధరలు, ప్రతి మోడల్‌కు కొత్త ధరల వివరాలను తెలియజేయలేదు. ఇన్‌పుట్ కాస్ట్ పెరగడమే ఈ ధర పెరగడానికి కారణమని టయోటా పేర్కొంది. పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావం వినియోగదారులపై తక్కువగా ఉండేలా చూసుకున్నట్లు టయోటా విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ధర ఎంత పెరిగింది?
ప్రస్తుతం అత్యంత డిమాండ్ ఉన్న టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు ధర రూ.18.35 లక్షల నుంచి రూ.18.52 లక్షలకు పెరిగింది. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ధర కూడా పెరిగింది. ఇప్పుడు దాని ప్రారంభ ధర రూ. 10.86 లక్షలుగా ఉంది. అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా ఎస్‌యూవీ ఫార్చ్యూనర్ ప్రారంభ ధర ఇప్పుడు రూ.32.99 లక్షలకు పెరిగింది. కంపెనీ ఇప్పటికే తన అన్ని కార్ల ధరలను 1.5 నుంచి రెండు శాతం వరకు పెంచింది.
ప్రస్తుతం టయోటా భారతదేశంలో అర్బన్ క్రూయిజర్ హైరైడర్, గ్లాంజా, ఇన్నోవా క్రిస్టా, ఇన్నోవా హైక్రాస్, ఫార్చ్యూనర్, ఫార్చ్యూనర్ లెజెండర్, క్యామ్రీ, వెల్‌ఫైర్ వంటి కార్లను విక్రయిస్తుంది. 2023 జూన్‌లో కంపెనీ 19,608 యూనిట్లను విక్రయించింది. ఇది 2022 జూన్ కంటే 19 శాతం ఎక్కువ. కంపెనీ కొత్త ఎస్‌యూవీ కూపే, కొత్త ఏడు సీట్ల SUV, కొత్త తరం టొయోటా ఫార్చ్యూనర్‌ను మారుతీ ఫ్రాంక్స్ ఆధారంగా తదుపరి కాలంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
టొయోటా మనదేశంలో కొత్త అర్బన్ క్రూజర్‌ను గతంలో మనదేశంలో లాంచ్ చేసింది. అదే టొయోటా హైరైడర్ కారు. ఈ కారులో సెల్ఫ్ చార్జింగ్ ఎలక్ట్రిక్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టం ఉన్న కారు. ఈ విభాగంలో లాంచ్ అయిన మొట్టమొదటి పూర్తిస్థాయి హైబ్రిడ్ కారు ఇదే కావడం విశేషం. ఇందులో 1.5 లీటర్ కే-సిరీస్ ఇంజిన్‌ను కంపెనీ అందించింది. ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ కూడా ఈ కారులో అందుబాటులో ఉంది. ఈ ఇంజిన్ పవర్ అవుట్‌పుట్ 100 హెచ్‌పీ కాగా, పీక్ టార్క్ 135 ఎన్ఎంగా ఉంది. ఇంజిన్, హైబ్రిడ్ మోటర్ పవర్‌ను కలిపినపుడు దీని పవర్ అవుట్‌పుట్ మొత్తంగా 113 హెచ్‌పీగా ఉండనుంది.
ఈ విభాగంలో ఆల్ వీల్ డ్రైవ్ ఫీచర్ ఉన్న మొదటి కారు టొయోటా హైరైడరే. ఇందులో ఫైవ్ స్పీడ్ మాన్యువల్, సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే హైబ్రిడ్ టెక్నాలజీ టొయోటా హైఎండ్ ప్రొడక్ట్స్ అయిన కామీ, వెల్‌ఫైర్‌ల్లో కూడా అందించారు.
యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ చార్జర్, తొమ్మిది అంగుళాల ఇన్‌ఫోటెయిన్‌మెంట్ సిస్టం, వెంటిలేటెడ్ డ్యూయల్ టోన్ సీట్ల వంటి ప్రీమియం ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టం, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ కంట్రోల్, డీసెంట్, ఆల్ వీల్ డిస్కులు వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా అందించారు. ఏడు మోనోటోన్ కలర్ ఆప్షన్లు, నాలుగు డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో టయోటా హైరైడర్‌ను కొనుగోలు చేయవచ్చు.
Read Also: వర్షంలో ఎలక్ట్రిక్ వాహనాలు నడపడం, ఛార్జ్ చేయడం సురక్షితమేనా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)