(Source: ECI/ABP News/ABP Majha)
India’s Richest Persons: ఇండియాలో టాప్-10 ధనవంతులు వీళ్లే, తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు వాళ్ల సొంతం
ఫోర్బ్స్ మ్యాగజైన్, 2023లో భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాను తయారు చేసింది.
Forbes Magazine India’s Richest Persons: ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకారం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ, ఇండియాలోనే రిచెస్ట్ పర్సన్ హోదా అనుభవిస్తున్నారు. $92 బిలియన్ల నెట్‌వర్త్‌తో (Mukesh Ambani net worth) భారతదేశంలో అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని తిరిగి దక్కించుకున్నారు. అంబానీ వ్యక్తిగత సంపద ఈ సంవత్సరం $4 బిలియన్లు పెరిగింది.
ఫోర్బ్స్ మ్యాగజైన్, 2023లో భారతదేశంలోని 100 మంది ధనవంతుల జాబితాను తయారు చేసింది.
అదానీ గ్రూప్ అధినేత & బిలియనీర్ గౌతమ్ అదానీ, 2022లో మొదటిసారిగా అంబానీని ఓవర్‌టేక్ చేసి భారతదేశపు అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈ ఏడాది జనవరిలో, US షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలతో అదానీ నికర విలువ $82 బిలియన్లకు పడిపోయింది. ప్రస్తుతం, $68 బిలియన్ల (Gautam Adani net worth) ఆస్తులతో రెండో అత్యంత సంపన్న భారతీయుడిగా ఉన్నారు.
HCL టెక్ వ్యవస్థాపకుడు, సాఫ్ట్‌వేర్ వ్యాపారవేత్త శివ్ నాడార్ 2023 జాబితాలో $29.3 బిలియన్ల ఆస్తులతో మూడో స్థానంలో నిలిచారు. టెక్ సర్వీసులకు మళ్లీ డిమాండ్ పెరగడంతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు 42 శాతం పెరిగాయి, అతను రెండు స్థానాలు పైకి జంప్ చేశారు. ఫోర్బ్స్ ప్రకారం, ఏడాదిలో ఆయన శివ్ నాడార్ సంపద $7.9 బిలియన్లు పెరిగింది. ఈ మొత్తం లిస్ట్‌లోని మరెవరి ఆస్తులు ఈ స్థాయిలో పెరగలేదు.
పవర్ & స్టీల్ కంపెనీల జిందాల్ గ్రూప్‌నకు చెందిన సావిత్రి జిందాల్, $24 బిలియన్లతో నాలుగో ర్యాంక్ సాధించారు. దేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల్లో అత్యంత ధనవంతురాలైన సావిత్రి జిందాల్, ఓవరాల్ లిస్ట్‌లో టాప్-5లో అడుగు పెట్టడం విశేషం.
అవెన్యూ సూపర్‌మార్ట్స్ ఓనర్ రాధాకిషన్ దమానీ $23 బిలియన్ల సంపదతో ఐదో ప్లేస్‌లో ఉన్నారు. దమానీ వ్యక్తిగత సంపద $27.6 బిలియన్ల నుంచి $23 బిలియన్లకు తగ్గింది.
టాప్ 6 -10 స్థానాల్లో ఉన్న సంపన్న భారతీయులు
6. సైరస్ పూనావాలా: $20.7 బిలియన్లు
7. హిందూజా ఫ్యామిలీ: $20 బిలియన్లు
8. దిలీప్ సంఘ్వి: $19 బిలియన్లు
9. కుమార్ బిర్లా: $17.5 బిలియన్లు
10. షాపూర్ మిస్త్రీ & ఫ్యామిలీ: $16.9 బిలియన్లు
వ్యక్తిగత సంపద కనీసం $2.3 బిలియన్లు ఉన్నవారిని టాప్ 100 బిలియనీర్స్ ఎలైట్ క్లబ్‌లోకి ఫోర్బ్స్ మ్యాగజైన్ తీసుకుంది. 2023లో భారత్‌లో రికార్డు స్థాయిలో 169 బిలియనీర్లు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో అయిదుగురు ఉన్నారు.
గత ఏడాదితో పోలిస్తే, మన దేశంలో తొలి 100 మంది సంపన్నుల మొత్తం సంపద పెద్దగా మారలేదని ఫోర్బ్స్ వెల్లడించింది. వీళ్ల టోటల్ వెల్త్ 2023లో $799 బిలియన్ల వద్ద ఉండగా, 2022లో ఇది $800 బిలియన్లగా ఉంది.
ప్రపంచంలోనే అత్యధిక బిలియనీర్స్ ఉన్న దేశం అమెరికా. ఫోర్బ్స్ ఏప్రిల్‌లో రిలీజ్ చేసిన వరల్డ్ బిలీనియర్స్ లిస్ట్‌లో 735 మంది అమెరికన్లు ఉన్నారు, వారి మొత్తం విలువ $4.5 ట్రిలియన్లు. చైనా (హాంకాంగ్ & మకావుతో కలిపి) సెకండ్ ప్లేస్‌లో ఉంది, 2 ట్రిలియన్ డాలర్ల విలువైన 562 బిలియనీర్లు అక్కడ నివశిస్తున్నారు. భారతదేశం ఆ తర్వాతి స్థానంలో ఉంది.
2022లో ఆర్థిక ప్రతికూలతలు ఎదుర్కొన్న తర్వాత, ప్రపంచ సంపద 2023లో దాదాపు 5 శాతం పుంజుకుని 267 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సెప్టెంబర్ రిపోర్ట్‌లో తెలిపింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial