అన్వేషించండి

Happy Fathers Day: మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఆరోగ్య బీమా వరకు - మీ నాన్నగారికి ఇవ్వదగిన ఐదు బహుమతులు

Gift Ideas For Fathers Day 2024: మన కోసం పూర్తి జీవితాన్ని త్యాగం చేసిన తండ్రికి ఉడతా భక్తిగా తిరిగి ఇచ్చే రోజు వచ్చింది. ఆర్థిక పరమైన బహుమతులతో ఫాదర్స్ డే 2024ని జరుపుకోండి.

Financial Gifts For Fathers on Father's Day 2024: మనకు - ఇబ్బందులకు మధ్య అడ్డుగోడలా నిలిచిన వ్యక్తిని గౌరవించే రోజు వచ్చింది. ఈ ఆదివారం (16 జూన్‌ 2024) నాడు ప్రపంచవ్యాప్తంగా పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు. తండ్రిగా మారిన వ్యక్తి.. పిల్లలు, కుటుంబం కోసం తన సంతోషాలనే కాదు, అవసరాలను సైతం త్యాగం చేస్తాడు. ఆయన త్యాగాలను గుర్తించేందుకు ఏడాదిలో కనీసం ఒక్కరోజయినా కేటాయించడం పిల్లలుగా మన బాధ్యత. 

ఫాదర్స్‌ డే నాడు మీ తండ్రికి ఇవ్వదగిన ఐదు ఆర్థిక బహుమతులు

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (Systematic Investment Plan - SIP)
మీ తండ్రికి ఉపయోగపడేలా ఒక మంచి మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడిని ప్రారంభించొచ్చు. దీనికోసం, మీపై ఆర్థిక భారం లేకుండా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను (SIP) ఎంచుకోవచ్చు, దీని ద్వారా నెలనెలా చిన్న మొత్తంలోనైనా పెట్టుబడి పెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి SIP ఒక మంచి మార్గం. కొన్ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లను నెలకు రూ.100 నుంచి కూడా స్టార్‌ చేయొచ్చు. నెలకొకసారి కాకుంటే మూడు నెలలకు ఒకసారి, లేదా ముందుగా నిర్ణయింకున్న నిర్ణీత వ్యవధిలో కూడా చెల్లించొచ్చు. 

అప్పులు తీర్చండి (Clearing Loans/Debts)
అప్పులు గుండెల మీద కుంపటి లాంటివి. ఒకవేళ మీ నాన్నగారికి ఏవైనా అప్పులు ఉంటే, వాటిని మీరే తీర్చేయండి. ఇప్పటికిప్పుడు ఆ లోన్లను క్లియర్ చేయడం సాధ్యం కాకపోతే, భవిష్యత్‌లో తీర్చేందుకు అవసరమైన ప్లాన్‌ను ఇప్పుడు రూపొందించండి. దీనివల్ల మీ నాన్నగారి చాలా పెద్ద సాయం చేసినట్లు అవుతుంది, ఆయనపై పెద్ద భారం తగ్గుతుంది. ఆయన మానసిక ఆందోళన మాయమైపోతుంది. అప్పులు తీరిపోతే కొత్త పెట్టుబడులు కూడా స్టార్ట్‌ చేసేందుకు అవకాశం చిక్కుతుంది.

యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ (Add-on Credit Card)
మీరు మీ తండ్రికి యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. దీనివల్ల, కోరుకున్నది కొనే స్వేచ్ఛ ఆయనకు లభిస్తుంది. ముఖ్యంగా పదవీ విరమణ వయస్సు దాటిన & పిల్లలపై ఆధారపడిన తండ్రులు ఈ తరహా బహుమతులను ఆర్థికంగా స్వతంత్రంగా భావిస్తారు. మిమ్మల్ని అడిగి చిన్నబుచ్చుకోకుండా, ఇకపై స్వతంత్రంగా ఖర్చు పెట్టుకుంటారు.

ఆరోగ్య బీమా (Health Insurance)
మీ తండ్రికి మంచి ఆరోగ్య బీమా పాలసీ లేకపోతే, దానిని గిఫ్ట్‌గా ఇవ్వడానికి ఇదే సరైన సందర్భం. ఆయనకు అన్ని రకాల ఆరోగ్య పరీక్షలు చేయించి, ఆ ఫలితాలకు అనుగుణంగా సరైన ప్లాన్‌ ఎంచుకోండి. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌ను ఎంచుకోవడం కూడా తెలివైన నిర్ణయం. దీనివల్ల మీ తల్లిదండ్రుల ఖర్చులు తగ్గుతాయి.

ఎమర్జెన్సీ ఫండ్‌ (Emergency Fund)
ఆకస్మికంగా వచ్చి పడే ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలు, ఇతర ఖర్చులను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ ఫండ్‌ సాయం చేస్తుంది. మీ తండ్రి పేర కొంత డబ్బును సేవింగ్స్‌ అకౌంట్‌లో లేదా స్వల్పకాలిక పెట్టుబడి మార్గాల్లో మదుపు చేయండి. ఎమర్జెన్సీ సమయంలో ఆ డబ్బును తక్షణం విత్‌డ్రా చేసుకునేలా ప్లాన్ చేయండి. దీనివల్ల, ఎలాంటి ఆర్థిక విపత్తులోనైనా మీ నాన్నగారి గాంభీర్యం చెక్కుచెదరదు.

మరో ఆసక్తికర కథనం: మీ తండ్రి టెక్ ఫ్రెండ్లీ అయితే ఫాదర్స్‌ డే నాడు గిఫ్ట్‌గా ఇవ్వదగిన గాడ్జెట్‌లు ఇవే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Regional Ring Road :నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
నాలుగు ప్యాకేజీలుగా హైదరాబాద్ రీజినల్ రింగ్‌ రోడ్డు నార్త్‌ పార్ట్, టెండర్లు పిలిచిన కేంద్రం
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
Tirumala : తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
తిరుమలలో అన్ని సేవలూ నగదురహితమే- త్వరలోనే అమలు
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Hyderabad News: డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
డబ్బులు పంచుతానంటూ ఇన్ స్టాలో ప్రచారం - కొండాపూర్ ఏఎంబీ మాల్‌లో బౌన్సర్లతో యువకుడి హల్చల్
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
Embed widget