అన్వేషించండి

Happy Fathers Day: మీ తండ్రి టెక్ ఫ్రెండ్లీ అయితే ఫాదర్స్‌ డే నాడు గిఫ్ట్‌గా ఇవ్వదగిన గాడ్జెట్‌లు ఇవే

Fathers Day Gift Ideas: ప్రేమకు, వ్యక్తిత్వానికి, బాధ్యతకు, గాంభీర్యానికి నిలువెత్తు నిదర్శనం నాన్న. మీ తండ్రిని మీరు అమితంగా ప్రేమిస్తుంటే, టెక్‌ బహుమతులతో ఆయన్ను ఆశ్చర్యపరచండి.

Tech Gifts For Fathers on Father's Day 2024: పితృ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారం నాడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. తల్లి, తన బిడ్డను 9 నెలలు గర్భంలో మోస్తే... ఆ బిడ్డ జీవితంలో నిలదొక్కుకునే వరకు తండ్రి మోస్తాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లై తనకంటూ ఓ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకునే వరకు, వాళ్ల జీవితంలో తండ్రి పాత్ర చాలా పెద్దది. ఒక్క మాటలో చెప్పాలంటే.. పిల్లల మొదటి హీరో నాన్నే. 

తండ్రుల సహకారాన్ని గుర్తించడం, గౌరవించడం, వారిపై ప్రేమను వ్యక్తపరచడం కోసం ఏడాదికి ఒక రోజు కేటాయించారు, అదే ఫాదర్స్ డే. ఈ ఏడాది జూన్ 16న ఫాదర్స్ డే జరుపుకుంటున్నాం. తల్లిదండ్రులపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. చాలా మంది తమ తండ్రులకు బహుమతులు ఇస్తారు. 

మీరు కూడా మీ నాన్నకు ఒక సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని ప్లాన్‌ చేస్తే, మీ తండ్రి టెక్ ఫ్రెండ్లీ అయితే... ఆయనకు ఈ గాడ్జెట్‌లను బహుమతిగా ఇవ్వొచ్చు.

ఆపిల్ స్మార్ట్ వాచ్ ‍‌(Apple Smart Watch)
మీ తండ్రి డిజిటల్ గాడ్జెట్‌లను ఇష్టపడితే, మీరు అతనికి Apple SE సెకండ్ జనరేషన్ వాచ్‌ను గిఫ్ట్‌గా ఇవ్వొచ్చు. అమెజాన్ నుంచి ఆన్‌లైన్‌లో దాదాపు రూ. 26,000 దీనిని కొనుగోలు చేయవచ్చు. ఈ వాచ్‌లో చాలా ఫిట్‌నెస్ సెన్సార్‌లు, AMOLED డిస్‌ప్లేతో పాటు అనేక ఇతర ఫీచర్‌లు ఉన్నాయి. దీన్ని ఉపయోగించి, మీ తండ్రి ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.

శామ్‌సంగ్‌ గెలాక్సీ బడ్స్‌ ఎఫ్‌ఈ (Samsung Galaxy Buds FE)
మీ నాన్నగారికి సినిమాలు, వార్తలు చూడటం అంటే ఇష్టం అయితే... మీరు వారికి మంచి ఇయర్‌బడ్స్‌ను బహూకరించవచ్చు. అద్భుతమైన సౌండ్ క్వాలిటీ ఉన్న బడ్స్ కావాలంటే Samsung Galaxy Buds Fe ఒక మంచి ఆప్షన్‌ ఎంపిక. ఆన్‌లైన్‌లో దీని ధర రూ. 6,500 వరకు ఉంది. అత్యుత్తమ సౌండ్‌ క్వాలిటీతో పాటు ఈ బడ్స్‌లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ కూడా ఉంది.

బోట్ స్మార్ట్ రింగ్ (boAt Smart Ring)
స్మార్ట్‌ వాచ్‌ తరహాలోనే స్మార్ట్‌ రింగ్‌ కూడా ఒక స్మార్ట్‌ గిఫ్ట్‌గా మారుతుంది. మీ తండ్రికి గాడ్జెట్‌లంటే ఇష్టమయితే బోట్ కొత్త స్మార్ట్ రింగ్‌ను ఇష్టపడతారు. ప్రస్తుతం, స్మార్ట్ వాచ్‌లు, ఆడియో గాడ్జెట్లలో boAt బ్రాండ్‌ మంచి పేరు తెచ్చుకుంది. బోడ్‌ బ్రాండ్‌లో ఇప్పుడు స్మార్ట్ రింగ్‌లు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఈ స్మార్ట్ రింగ్ హెల్త్ ట్రాకింగ్ సెన్సార్‌తో వస్తుంది. ఇందులో హార్ట్ మానిటర్, SPO2 సెన్సార్, స్లీప్ ట్రాక్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఎమర్జెన్సీ SOS సౌకర్యం కూడా ఉంది. దీనిని మూడు వేర్వేరు సైజుల్లో కొనుగోలు చేయవచ్చు. బోట్ స్మార్ట్ రింగ్ ఆన్‌లైన్‌ ధర రూ. 8,999 వరకు ఉంటుంది.

ఒన్‌ప్లస్‌ పాడ్‌ గో (Oneplus Pad Go)
లేటెస్ట్‌ టెక్నాలజీని కోరుకునే మీ నాన్నగారు, OnePlus నుంచి వచ్చిన ఈ ప్యాడ్‌ని ఇష్టపడవచ్చు.ఒన్‌ప్లస్‌ పాడ్‌ గో 8GB RAM, 128GB ROMతో వస్తుంది. డాల్బీ ఆటోమేటిక్ సౌండ్‌తో పాటు Wi-Fi, సెల్యులార్ డేటా ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. ఉంది. దీని బ్యాటరీ భారీ సైజ్‌లో 8000 mah ఉంది. అంటే, సింగిల్‌ ఛార్జింగ్‌తో ఎక్కువ సేపు ఉపయోగించుకోవచ్చు. ఫాదర్స్ డే సందర్భంగా ఇది గొప్ప బహుమతి అవుతుంది.

మరో ఆసక్తికర కథనం: ఫాదర్స్ డే వచ్చేస్తోంది.. ఎప్పుడో తెలుసా? ఈ గిఫ్టులతో నాన్నను సర్‌ప్రైజ్‌ చెయ్యండి 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

India vs south Africa T20 World Cup Final | టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో ప్రత్యర్థులుగా పోటా పోటీ జట్లుRohit Sharma on Virat Kohli | T20 World Cup 2024 సెమీఫైనల్ లోనూ ఫెయిల్ అయిన కింగ్ విరాట్ కొహ్లీ |ABPAxar Patel MoM Award Ind vs Eng Semi Final | T20 World Cup 2024లో భారత్ ను ఫైనల్ కి చేర్చిన బాపు|ABPIndia vs England T20 World Cup 2024 Semis 2 | రెండేళ్ల గ్యాప్ లో ఇంగ్లండ్ కు ఇవ్వాల్సింది ఇచ్చేశాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Revanth Reddy: త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
త్వరలో ఒకే స్టేజ్‌ మీదికి చంద్రబాబు, రేవంత్‌! స్పెషల్ ఏంటో తెలుసా?
Actor Ali: వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
వైసీపీకి అలీ రాజీనామా, ఇక నా దారి ఇదే - వీడియో విడుదల
Actress Hema: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి హేమ - తన అరెస్ట్‌పై స్పందిస్తూ సెటైరికల్‌ కామెంట్స్‌
Fire Accident: షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
షాద్ నగర్‌లో భారీ అగ్ని ప్రమాదం - ఆరుగురు మృతి
Chandrababu White Paper On Polavaram : రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
రివర్స్ టెండర్ల డ్రామానే పోలవరానికి శాపం - శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు
Chevella MLA: బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్! కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యే కాలె యాదయ్య
Harish Rao Meets Kavitha : తీహార్ జైల్లో కవితతో  హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
తీహార్ జైల్లో కవితతో హరీష్ రావు ములాఖత్ - లిక్కర్ కేసు తాజా పరిణామాలపై చర్చ
AP Government: ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం వరాల జల్లు - ఆ ఉద్యోగులకు నెల అదనపు జీతం, వారికి 5 రోజుల పనిదినాలు ఏడాది పొడిగింపు
Embed widget