అన్వేషించండి

EPFO: హయ్యర్‌ పెన్షన్ టెన్షన్‌, వాళ్ల బీపీ పెంచకండయ్యా బాబూ!

హైయ్యర్‌ పెన్షన్‌ ఫార్ములా కేటగిరీల వారీగా నిక్కచ్చిగా, స్పష్టంగా ఉండాలని సీబీటీ మెంబర్లు ప్రస్తావించనున్నారు.

EPFO Higher Pension News: హయ్యర్‌ పెన్షన్‌ విషయంలో ఈపీఎఫ్‌వో (Employees' Provident Fund Organisation) తీసుకుంటున్న నిలకడ లేని నిర్ణయాలు విశ్రాంత ఉద్యోగుల బీపీ పెంచుతున్నాయి. హయ్యర్‌ పెన్షన్‌ ఫార్ములాపై ఈపీఎఫ్‌లో తడవకో మాట చెబుతోంది. దీనివల్ల, ఇప్పటికే ఉన్న సందేహాల నివృతిని అంటుంచితే, కొత్త సందేహాలు పుట్టుకొస్తున్నాయి.

పెన్షన్‌ లెక్కింపు ఫార్ములా విషయంలో ఈపీఎఫ్‌వో నాలుక మెలికలు తిరుగుతోంది. దేశంలోని కొన్ని ఈపీఎఫ్‌వో రీజినల్‌ ఆఫీసులు దామాషా విధానంలో పార్ట్‌-1, పార్ట్‌-2 విభాగాలుగా పెన్షన్‌ లెక్కిస్తున్నాయి. మరికొన్ని కార్యాలయాలు ఒకే పార్ట్‌ కింద ఈ పని చేస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన సమస్య ఇదే. పెన్షన్‌ ఫార్ములా ఒకే పార్ట్‌గా ఉంటుందని రెండుసార్లు చెప్పిన ఈపీఎఫ్‌వో, రీజినల్‌ ఆఫీసులు అడిగినప్పుడు మాత్రం దామాషా విధానం గురించి మాట్లాడింది, దరఖాస్తుదార్లను అయోమయంలోకి నెట్టింది. 

శనివారం రోజున సీబీటీ సమావేశం
శనివారం రోజున (10 ఫిబ్రవరి 2024) ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (CBT) సమావేశం జరుగుతుంది. పెన్షన్‌ ఫార్ములా గురించే ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరుగుతుందని తెలుస్తోంది. హైయ్యర్‌ పెన్షన్‌ ఫార్ములా కేటగిరీల వారీగా నిక్కచ్చిగా, స్పష్టంగా ఉండాలని సీబీటీ మెంబర్లు ప్రస్తావించనున్నారు. 

పెన్షన్‌ను ఏ పద్ధతిలో లెక్కించాలో అర్ధం కాక కొన్ని రీజినల్‌ ఆఫీసుల్లో సంబంధిత పనులన్నీ ఆగిపోయాయి. ప్రస్తుతం, 2014 సెప్టెంబర్‌ 01కి ముందు రిటైర్‌ అయినవాళ్ల మొత్తం దరఖాస్తులు 4,10,039 ఉంటే.. వీటిలో సంబంధిత యాజమాన్యాల దగ్గరే 3,09,123 అప్లికేషన్లు ఉన్నాయి. మరో 84,412 దరఖాస్తులు ఈపీఎఫ్‌వో దగ్గర పెండింగ్‌లో పడి ఉన్నాయి. ఒక అప్లికేషన్ విషయంలో డిమాండ్‌ నోటీస్‌ జారీ అయింది. మరో 16,503 దరఖాస్తులను రిజెక్ట్‌ చేశారు. 

2014 సెప్టెంబర్‌ 01 తర్వాత రిటైర్‌ అయినవాళ్ల విషయానికి వస్తే.. మొత్తం 13,38,729 దరఖాస్తులు ఉన్నాయి. వీటిలో.. సంబంధిత యాజమాన్యాల దగ్గర 8,66,744 అప్లికేషన్లు ఉన్నాయి. 4,23,575 ఫారాలు ఈపీఎఫ్‌వో దగ్గర పెండింగ్‌లో ఉన్నాయి. 42,163 దరఖాస్తుదార్లకు డిమాండ్‌ నోటీస్‌లు జారీ అయ్యాయి, 6,200 దరఖాస్తులు రిజెక్ట్‌ అయ్యాయి.

మొదట చెప్పిన పెన్షన్‌ ఫార్ములా ఇది
ఈపీఎఫ్‌వో, అధిక పింఛను లెక్కింపు విషయంలో 2023 డిసెంబర్‌ 13న ఒక ఫార్ములా చెప్పింది. ఆ సూత్రం ప్రకారం... 2014 సెప్టెంబర్‌ 01కి ముందు పదవీ విరమణ చేసిన వారి చివరి 12 నెలల సగటు వేతనం ఆధారంగా పెన్షన్‌ లెక్కించాలి. 2014 సెప్టెంబర్‌ 01 తర్వాత రిటైర్‌ అయిన వారి చివరి 60 నెలల సగటు వేతనం + పూర్తి సర్వీసు ఆధారంగా పెన్షన్‌ లెక్కించాలి. ఈ ఫార్ములా చెప్పిన ఈపీఎఫ్‌వో నెల రోజుల్లోనే మాట మార్చింది. హయ్యర్‌ పెన్షన్‌ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి ఫార్ములా ఇవ్వలేదు కాబట్టి, దామాషా పద్ధతిలో పెన్షన్‌ లెక్కించాలని 2024 జనవరి 11, 12 తేదీల్లో జరిగిన సమీక్షలో ఆదేశించింది. 

ఈ శనివారం జరిగే సమావేశంలో CBT మెంబర్లు ఈ గందరగోళం గురించి అడుగుతారు కాబట్టి, దామాషా పద్ధతినే ఫాలో కావాలని స్పష్టం చేయనున్నట్లు సమాచారం. రీజినల్‌ ఆఫీసుల్లో హయ్యర్‌ పెన్షన్‌ సంబంధిత పనులన్నీ ఆగిపోవడంతో, డిమాండ్‌ నోటీసుల ప్రకారం బకాయిలు చెల్లించి ఎదురు చూస్తున్న దరఖాస్తుదార్లు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

మరో ఆసక్తికర కథనం: కొత్త కంపెనీని కొంటున్న పేటీఎం, ఇబ్బందులున్నా తగ్గేదే ల్యా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget