అన్వేషించండి

Twitter: బ్రేక్‌-ఈవెన్‌ స్థితికి చేరుకున్న బుల్లి పిట్ట, పెరిగిన కంపెనీ ఆదాయం

ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలతో పాటు, కంపెనీ ఖర్చులను తగ్గించడానికి వేలాది మంది ఉద్యోగులను ఎలాన్‌ మస్క్‌ ఉన్నఫళంగా ఇళ్లకు పంపేశారు.

Elon Musk -Twitter: సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను కొని నానా తిప్పలు పడుతున్న ఎలాన్‌ మస్క్‌, ఎట్టకేలకు ఆ నష్టాల నుంచి బయటపడే దారిలో ఉన్నారు. 

సోషల్ మీడియా సంస్థ "దాదాపు బ్రేకింగ్ ఈవెన్" స్థాయిలో ఉందని అని, ప్రకటనదార్లు (advertisers) చాలా మంది తిరిగి వచ్చారని ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ (Twitter Inc CEO Elon Musk) చెప్పారు. ఒక వ్యాపారంలో ప్రారంభ నష్టాలు తగ్గి, లాభనష్టాలు లేని స్థితికి చేరడాన్ని బ్రేక్‌-ఈవెన్‌గా పిలుస్తారు. బ్రేక్‌-ఈవెన్‌ స్థితిని కూడా దాటితే, లాభాలు రావడం ప్రారంభం అవుతుంది.

బీబీసీకి ఎలాన్‌ మస్క్‌ ఇంటర్వ్యూ 
BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలాన్‌ మస్క్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ ముఖాముఖిని ట్విట్టర్ స్పేసెస్‌లో (Twitter Spaces) ప్రత్యక్ష ప్రసారం చేయగా, 30 లక్షలకు పైగా వీక్షకులు చూశారు.

గత ఏడాది అక్టోబర్‌లో 44 బిలియన్‌ డాలర్లకు ట్విట్టర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొన్నారు. అప్పటి నుంచి ట్విట్టర్ ప్రకటనల ఆదాయం భారీగా తగ్గింది. ప్రకటనల ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాలతో పాటు, కంపెనీ ఖర్చులను తగ్గించడానికి వేలాది మంది ఉద్యోగులను ఎలాన్‌ మస్క్‌ ఉన్నఫళంగా ఇళ్లకు పంపేశారు.

కాలానుగుణంగా ప్రకటనల వ్యయం తగ్గిందని, "రాజకీయ" కారణాలు కూడా దీనికి తోడడయ్యాయని మస్క్ చెప్పారు. ఇప్పుడు, ప్రకటనదార్లలో చాలా మంది తిరిగి వచ్చారని బీబీసీ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

అప్పుడు 7,000 - ఇప్పుడు 1,500 
ట్విటర్‌లో ఇప్పుడు దాదాపు 1,500 మంది ఉద్యోగులు ఉన్నారన్న మస్క్‌, తాను కొనుగోలు చేయడానికి ముందు దాదాపు 7,000 మంది ఉన్నారని చెప్పారు. ఆ నంబర్‌తో పోలిస్తే ఇప్పటి నంబర్‌ చాలా తగ్గిందని వెల్లడించారు.

ట్విట్టర్‌ను కొనుగోలు చేసేందుకు మస్క్ ఒప్పందం చేసుకున్నప్పటి నుంచి ఆ సంస్థ స్థిరత్వంపై ఆందోళనలు విస్తృతంగా వ్యాప్తి చెందాయి. ట్విట్టర్‌ సేవల్లో అంతరాయాలను పరిష్కరించే చాలా మంది ఇంజినీర్లు కూడా ఆందోళన వ్యక్తం చేసినవాళ్లలో ఉన్నారు. అయితే.. మస్క్‌ ఈ విమర్శలను అస్సలు పట్టించుకోలేదు, యథాప్రకారం తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ట్విట్టర్‌ కొనుగోలు తర్వాత వచ్చిన పని ఒత్తిడి కారణంగా తాను నిద్రకు కూడా దూరమయ్యానని గతంలో ఒకసారి ఎలాన్‌ మస్క్‌ చెప్పారు. మొత్తానికి.. సీఈవో మస్క్‌, కంపెనీ ఉద్యోగుల కృషి ఫలితంగా బ్రేక్‌-ఈవెన్‌ స్థాయికి ట్విట్టర్‌ చేరుకుంది.

ఎక్స్‌ యాప్‌లో ట్విట్టర్‌ విలీనం
ఇటీవలే, ఒక కోర్టు కేసు విచారణ సందర్భంగా, ట్విటర్‌ అనే స్వతంత్ర కంపెనీ మనుగడలో లేదని ఆ సంస్థ వెల్లడించి ఆశ్చర్యపరిచింది. ఎక్స్‌ అనే యాప్‌లో ట్విటర్‌ను కలిపేసినట్లు న్యాయస్థానానికి తెలిపింది. దీనిని ధృవీకరిస్తూ..  ‘X’ అక్షరాన్ని మస్క్‌ మంగళవారం (11 ఏప్రిల్‌ 2023) నాడు ట్వీట్‌ చేశారు. ఎక్స్‌ అనేది ఒక సూపర్‌ యాప్‌. ట్విటర్‌ను ఎక్స్‌ యాప్‌లో విలీనం చేయడం ద్వారా.. మెసేజింగ్‌, కాలింగ్‌, పేమెంట్స్‌ వంటి పనులన్నీ ఒకే యాప్‌ ద్వారా చేపట్టేలా చూడాలన్నది ఎలాన్‌ మస్క్‌ లక్ష్యం. ప్రస్తుతం, చైనాకు చెందిన ‘వీచాట్‌’ ఇదే తరహా సేవలను అందిస్తోంది. ఎక్స్‌ యాప్‌ను తన దీర్ఘకాల వ్యాపార ప్రణాళికగా మస్క్‌ అభివర్ణించారు.

టాప్ హెడ్ లైన్స్

15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
15 ఏళ్ల హోమ్ లోన్ 6 ఏళ్లలో క్లోజ్ చేసే షార్ట్ కట్ ఇదే! డబ్బు ఆదా చేసే సులభమైన మార్గం!
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Pooja Murthy: బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
బుల్లితెర గుండమ్మ పూజా మూర్తి.. అప్పుడు బాడీ షేమింగ్.. ఇప్పుడు లీడ్ రోల్‌లో అదుర్స్!
Embed widget