Anil Ambani Group : అనిల్ అంబానీ గ్రూప్‌పై ED చర్యలు- 3000 కోట్ల కుంభకోణంలో 50 చోట్ల సోదాలు
Anil Ambani Group : అనిల్ అంబానీ గ్రూప్ పై ED దాడులు. CBI FIRల నమోదు అనంతరం 48-50 లొకేషన్లలో సోదాలు.

Anil Ambani Group : రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీల (RAAGA)పై మనీ లాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. అనిల్ అంబానీకి సంబంధించిన 48-50 లొకేషన్లలో ED సోదాలు నిర్వహిస్తోంది. CBI రెండు FIRలు నమోదు చేసిన తర్వాత ఈ చర్య తీసుకుంటున్నారు.
దర్యాప్తులో ఈ కంపెనీలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని దుర్వినియోగం చేసినట్లు తేలింది. వాటిని ఇతర కంపెనీలకు మళ్లించి, సామాన్య ప్రజలు, పెట్టుబడిదారులు ,ప్రభుత్వ సంస్థలను మోసం చేశారు. అనేక పెద్ద సంస్థలు కూడా EDతో సమాచారాన్ని పంచుకున్నాయి. ఇందులో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB), సెబి, నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అథారిటీ (NFRA) బ్యాంక్ ఆఫ్ బరోడా ఉన్నాయి.
ED సంచలన విషయాలు
ED యొక్క ప్రారంభ దర్యాప్తులో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2017 నుంచి 2019 మధ్య కాలంలో యెస్ బ్యాంక్ నుంచి 3000 కోట్ల రుణం తీసుకున్నారని, తరువాత దానిని ఇతర కంపెనీలకు మళ్లించారని తెలుస్తోంది. అంతేకాకుండా, రుణం మంజూరు చేయడానికి యెస్ బ్యాంక్ అధికారులకు, ప్రమోటర్లకు లంచం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది.
దేశవ్యాప్తంగా 50 ప్రాంతాల్లో సోదాలు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ మొత్తం కేసులో నేడు దేశవ్యాప్తంగా 48-50 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. యెస్ బ్యాంక్ RAAGA కంపెనీలకు రుణాలు ఇచ్చేటప్పుడు తమ నిబంధనలను ఉల్లంఘించిందని ED దర్యాప్తులో తేలింది. రుణానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన పత్రాలు వెనుక తేదీతో తయారు చేశారు.
దర్యాప్తు ప్రకారం, క్రెడిట్ విశ్లేషణ లేకుండానే భారీ పెట్టుబడులు పెట్టారు. పత్రాలు లేకుండా, సరైన విచారణ లేకుండా రుణాలు మంజూరు చేశారు. అనేక కంపెనీల డైరెక్టర్లు, చిరునామాలు ఒకే విధంగా ఉన్నాయి. ఒకే రోజున రుణాలు దరఖాస్తు చేసుకుని విడుదల చేశారు. చాలాసార్లు రుణం మంజూరు చేయడానికి ముందే డబ్బును బదిలీ చేశారు.
ఈ పెద్ద కంపెనీలు EDకి ముఖ్యమైన సమాచారం అందించాయి
ఈ కేసులో సెబి, నేషనల్ హౌసింగ్ బ్యాంక్, NFRA, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి పెద్ద సంస్థలు కూడా EDకి ముఖ్యమైన సమాచారం అందించాయి. సెబి RHFL (Reliance Home Finance Ltd)కి సంబంధించిన ఒక పెద్ద కేసు గురించి సమాచారం అందించింది, ఇందులో ఒకే సంవత్సరంలో కంపెనీ కార్పొరేట్ రుణాన్ని 3742 కోట్ల నుంచి 8670 కోట్లకు పెంచింది. ఈ ఆకస్మిక పెరుగుదలపై కూడా ED అనుమానం వ్యక్తం చేస్తోంది.




















