అన్వేషించండి

ED Raid: పేటీఎంకు గట్టి దెబ్బ - ఈడీ తనిఖీలు, రూ.17 కోట్లు స్వాధీనం

చైనా వ్యక్తుల నియంత్రిస్తున్న ఈ సంస్థల మర్చంట్‌ ఐడీలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉంచిన రూ.17 కోట్ల విలువైన నిధులను స్వాధీనం చేసుకుంది.

ED Raid: ఇన్‌స్టంట్‌ లోన్స్‌, డిజిటల్‌ లోన్స్‌.. పేరు ఏదైనా, తీసుకున్నవాడి పీకల మీదకు వస్తోందా అప్పు. 3 నిమిషాల్లో లోన్‌ ఇస్తామంటూ కబుర్లు చెప్పి, వసూలు చేసే సమయంలో మాత్రం 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నాయి స్మార్ట్‌ఫోన్‌ బేస్‌డ్‌ లోన్‌ యాప్స్‌. రూపాయికే రుణాలంటూ ఆశ చూపి, తీర్చే సమయానికి అసలు కంటే వడ్డీనే ఎక్కువగా పిండేస్తున్నాయి. అంతేకాదు, లోన్ వసూళ్లను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించి, వాళ్లతో గూండాగిరీ చేయిస్తున్నాయి. ఇవన్నీ దాదాపుగా చైనా యాప్సే కావడం విశేషం. ఈ మొబైల్‌ యాప్‌ లోన్స్‌ వసూళ్ల దందాలపై ఫిర్యాదులు పెరిగి పోవడంతో ఒకవైపు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దర్యాప్తులు చేపట్టాయి.

అక్రమ లోన్లను ఈడీ సీరియస్‌గా తీసుకుంది. శుక్రవారం, బెంగళూరులోని రజోర్‌పే, పేటీఎం, క్యాష్‌ఫ్రీ వంటి ఆన్‌లైన్ పేమెంట్‌ గేట్‌వేల కార్యాలయాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మొత్తం ఆరు ప్రాంతాల్లో సోదాలు జరిగాయి.

చైనా సంస్థలు లేదా చైనీస్‌ వ్యక్తులు నియంత్రిస్తున్న "చట్టవిరుద్ధ" ఇన్‌స్టాంట్‌ స్మార్ట్‌ఫోన్ బేస్డ్‌ రుణాలపై కొనసాగుతున్న విచారణలో భాగంగా సోదాలు నిర్వహించామని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని కూడా వెల్లడించింది. 

చైనా వ్యక్తుల నియంత్రిస్తున్న ఈ సంస్థల మర్చంట్‌ ఐడీలు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న ఉంచిన రూ.17 కోట్ల విలువైన నిధులను స్వాధీనం చేసుకుంది.

లోన్‌ యాప్స్‌ నిర్వహణ కోసం భారతీయులకు సంబంధించిన నకిలీ పత్రాలను ఉపయోగించారు. ఆ పత్రాల్లో ఉన్న పేర్లను డైరెక్టర్లుగా చూపి, అక్రమ ఆర్జనకు తెర తీశారు. ఈ సంస్థలన్నీ చైనా వ్యక్తుల నియంత్రణలో నడుస్తున్నాయని ఈడీ తెలిపింది. అంతేకాదు, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో లేదా ఆయా సంస్థలు పేర్కొన్న చిరునామాలకు వెళ్లి చూస్తే అక్కడేమీ ఉండదు. ఇచ్చిన చిరునామాల నుంచి అవి పనిచేయవు, ఎందుకంటే అవన్నీ నకిలీ అడ్రస్‌లుగా ఏజెన్సీ పేర్కొంది.

బెంగళూరులో, మొబైల్ లోన్‌ యాప్స్‌ ద్వారా రుణాలు తీసుకుని, సదరు యాజమాన్యాలు లేదా వసూళ్ల గ్యాంగ్‌ చేతుల్లో దోపిడీకి, వేధింపులకు, అవమానాలకు గురైన బాధితులు అనేక సంస్థలు లేదా వ్యక్తుల మీద ఇప్పటికే పోలీసులకు అనేక ఫిర్యాదులు చేశారు. బెంగళూరు పోలీస్‌ సైబర్ క్రైమ్ స్టేషన్‌లో దాఖలయిన కనీసం 18 ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. దీనిని మనీలాండరింగ్ కేసుగా అభివర్ణించింది. 

రుణగ్రహీతల ప్రయోజనాలను కాపాడేందుకు ఆర్‌బీఐ దర్యాప్తు కూడా కొనసాగుతోంది. దీనిలో భాగంగా, కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలను పాటించి తీరాల్సిందేనని అన్ని బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను (ఎన్‌బీఎఫ్‌సీలు) ఆర్‌బీఐ ఆదేశించింది. కొత్తగా ఇచ్చే లోన్లేగాక, ఇప్పటికే ఇచ్చిన రుణాలను కూడా కొత్త నిబంధనల పరిధిలోకి మార్చాలని స్పష్టం చేసింది. పాత లోన్లను నవంబరు 30లోగా కొత్త మార్గదర్శకాల కిందకు తీసుకురావాలని గడువు విధించింది. 

కొత్త నిబంధనల ప్రకారం, ఒక బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఇచ్చే రుణాలను నేరుగా రుణగ్రహీత బ్యాంక్‌ ఖాతాలోనే జమ చేయాలి తప్ప ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ గేట్‌ల ద్వారా మళ్లించకూడదు. బ్యాంకు లేదా ఎన్‌బీఎఫ్‌సీ మధ్యే రుణ వ్యవహారం జరగాలి తప్ప, మధ్యలో రుణ సేవల సంస్థలను (ఎల్‌ఎస్‌పీ) తీసుకురాకూడదు. ఎల్‌ఎస్‌పీలకు చెల్లించే ఫీజులను బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలే భరించాలి, ఆ మొత్తం కోసం రుణగ్రహీత జేబుకు చిల్లు పెట్టకూడదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
CNG Price Hike: మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
మళ్లీ పెరిగిన CNG ధరలు.. 11 రోజుల్లో నాలుగో సారి పెంపు, ఇంకెంత పెరుగుతుందో!
IDFC First Bank Case: రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన
రూ. 504 కోట్ల ప్రభుత్వ ధనం స్వాహా.. CBI తొలి ఛార్జిషీటు దాఖలు, 15 మంది పేర్లు ప్రస్తావన

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy unveils NTR statue: కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
కాంగ్రెస్ సీఎం అయితే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయకూడదా? - ఇందిరమ్మతో పోల్చిన రేవంత్
NTR Bharat Ratna resolution Mahanadu 2026: మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
మహానాడులో భారతరత్న తీర్మానం - ఈసారి ఎన్టీఆర్‌కు గౌరవం దక్కేనా? చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
Sara Khan On EID: బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్
బక్రీద్‌కు జంతు బలి ఎందుకు? సారా ఖాన్ పోస్టుపై గరమ్ గరమ్
Hyderabad land auction Rayadurgam 2026: హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
హైదరాబాద్ రాయదుర్గం రియల్ సంచలనం - ఎకరం రూ.237 కోట్లు.. దేశంలోనే కొత్త రికార్డు!
Jagan PA KNR liquor scam investigation: ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - అరెస్టు తప్పదా?
ఏపీ లిక్కర్ స్కాంలో జగన్ పీఏ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు - అరెస్టు తప్పదా?
Why Hot Water Freezes Faster:వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?
వేడి నీళ్లు కూల్ వాటర్ కంటే వేగంగా గడ్డకడతాయా? దీని వెనుక ఉన్న సైన్స్ మిస్టరీ ఏంటీ?
Tips To Happy Marriage : మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
మ్యారేజ్ లైఫ్ సంతోషంగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్.. లేదంటే నరకంగా మారొచ్చు
Anasuya: షార్ట్స్‌లో అనసూయ... స్టైలిష్‌గా బ్యూటిఫుల్ లేడీ
షార్ట్స్‌లో అనసూయ... స్టైలిష్‌గా బ్యూటిఫుల్ లేడీ
Embed widget