Diwali 2021: బంగారానికి పెరిగిన డిమాండ్.. దీపావళి, ధన త్రయోదశి, పెళ్లిళ్ల సీజన్‌తో కళకళ
పుత్తడికి మళ్లీ కళ వచ్చింది. డిమాండ్ కొవిడ్ ముందునాటి పరిస్థితికి చేరుకుంది. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో డిమాండ్ మరింత పెరగనుంది.
![Diwali 2021: బంగారానికి పెరిగిన డిమాండ్.. దీపావళి, ధన త్రయోదశి, పెళ్లిళ్ల సీజన్‌తో కళకళ Diwali 2021: Demand For Gold Soars In India Due To Diwali, Dhanteras And Wedding Season Diwali 2021: బంగారానికి పెరిగిన డిమాండ్.. దీపావళి, ధన త్రయోదశి, పెళ్లిళ్ల సీజన్‌తో కళకళ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/02/36a1e0d4540ad1c682807ec259ca22cd_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశంలో మళ్లీ బంగారానికి డిమాండ్ పెరిగింది. దీపావళి, ధన త్రయోదశి, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధర భారీగా పెరుగుతోంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో భారత దేశ బంగారం డిమాండ్ 47 శాతం పెరిగి 139.1 టన్నులకు చేరుకుంది. కరోనా వైరస్ ప్రభావం తగ్గడంతో బంగారం కొనుగోళ్లు పెరిగాయి.
భారత్‌లో బంగారానికి డిమాండ్ కొవిడ్ ముందునాటి స్థితికి చేరుకుందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. మున్ముందు డిమాండ్ మరింతగా పెరగనుందని అంచనా వేసింది. 2020 సెప్టెంబర్ క్వార్టర్‌కు దేశంలో బంగారం డిమాండ్ 94.6 టన్నులుగా ఉందని గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ 2021 నివేదిక తెలిపింది.
కరోనా టీకాల ప్రక్రియ వేగంగా సాగుతుండటంతో ఆర్థిక వ్యవస్థలో యాక్టివిటీ పెరిగిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత సీఈవో పీఆర్ సోమసుందరం అన్నారు. 2021 మూడో క్వార్టర్లోనే పండగ సీజన్‌కు సంబంధించిన సరకు వచ్చేసిందని అందుకని కొత్తగా దిగుమతి చేసుకోవడం లేదని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆంక్షలు ఎత్తివేయడంతో రిటైల్ డిమాండ్ కొవిడ్ ముందునాటి స్థితికి చేరుకుందని పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ వస్తుండటంతో పుత్తడి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు యువత ఆసక్తి ప్రదర్శిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మూడో క్వార్టర్లో బంగారం డిమాండ్ 58 శాతం పెరిగి 96.2 టన్నులకు చేరుకుంది. గతేడాది ఇదే సమయంలో డిమాండ్ 60.8 టన్నులుగా ఉంది. ఇక ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ మూడో క్వార్టర్లో 27 శాతం పెరిగి 42.9 టన్నులకు చేరుకుంది. ఇదే క్వార్టర్లో గతేడాది డిమాండ్ 33.8 టన్నులు కావడం గమనార్హం. పెరిగిన విలువ రూ.18,300 కోట్లుగా ఉంది.
Also Read: Maruti Celerio 2021: అదిరిపోయిన కొత్త సెలెరియో లుక్.. ఎలా ఉందో చూసేయండి!
Also Read: Financial Tips: డబ్బు సంపాదించాలంటే ఈ 6 అలవాట్లు చేసుకోండి..! ఆ తర్వాత...!
Also Read: LIC Jeevan Labh Policy: నెలకు రూ.233 చెల్లిస్తే రూ.17 లక్షలు మీ సొంతం.. వివరాలు ఇవే!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Happy #Dhanteras! Today marks the first day of the #Diwali festival of lights and is considered to be an auspicious day for buying #gold. pic.twitter.com/Wk40LNaU7o
— World Gold Council (@GOLDCOUNCIL) November 2, 2021
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)