By: ABP Desam | Updated at : 27 Dec 2022 03:12 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు
Cryptocurrency Prices Today, 27 December 2022:
క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.32 శాతం పెరిగి రూ.13.96 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.26.86 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.04 శాతం పెరిగి రూ.1,00,858 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.12.15 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.22 శాతం పెరిగి రూ.82.82, బైనాన్స్ కాయిన్ 0.19 శాతం పెరిగి రూ.20,107, యూఎస్‌డీ కాయిన్ 0.21 శాతం పెరిగి 82.86, రిపుల్ 5.44 శాతం పెరిగి రూ.30.62, బైనాన్స్ యూఎస్‌డీ 0.27 శాతం పెరిగి రూ.82.89 వద్ద కొనసాగుతున్నాయి. రెన్, క్వాంట్, టెర్రా, లిడో డావో, డీసెంట్రల్యాండ్, ఫీనిక్స్ గ్లోబల్ పెరిగాయి. ఈ కాయిన్, సోలోజెనిక్, ఎగోరిక్, స్టాసిస్ యూరో, పాకెట్ నెట్‌వర్క్, క్రెడిట్‌కాయిన్, ఎంఎక్స్‌సీ నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Stocks to watch 03 February 2023: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి - SBI, ITC మీద ఓ కన్నేయండి
Petrol-Diesel Price 03 February 2023: ఏపీలో భగ్గుమన్న చమురు ధరలు, తెలంగాణలో స్థిరంగా రేట్లు
Gold-Silver Price 03 February 2023: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు - సామాన్యుడు కొనే పరిస్థితే లేదు
HDFC Q3 Results: హెచ్డీఎఫ్సీ అదుర్స్! 13% పన్నేతర లాభం - నేడు షేర్లు ట్రేడయ్యాయో చూడండి!
Porsche Panamera: రూ.14 లక్షలకే రూ.1.21 కోట్ల పోర్షే - ప్రకటన ఇచ్చిన కంపెనీ - తర్వాత ఏం అయింది?
YSRCP Tensions : వైఎస్ఆర్సీపీలో ఈ అలజడి ఎందుకు ? ఇంటలిజెన్స్ అత్యుత్సాహమే కొంప ముంచుతోందా ?
TS New Secretariat Fire Accident: తెలంగాణ నూతన సచివాలయంలో భారీ అగ్ని ప్రమాదం
Writer Padmabhushan Review - 'రైటర్ పద్మభూషణ్' రివ్యూ : కామెడీయే కాదు, మెసేజ్ కూడా - సుహాస్ సినిమా ఎలా ఉందంటే?
KCR Political strategy : గవర్నర్‌తో రాజీ - బడ్జెట్ పై సైలెన్స్ ! బీజేపీపై కేసీఆర్ దూకుడు తగ్గిందా ?