By: ABP Desam | Updated at : 03 Dec 2022 03:08 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు ( Image Source : Getty )
Cryptocurrency Prices Today, 03 December 2022:
క్రిప్టో మార్కెట్లు శనివారం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.04 శాతం పెరిగి రూ.13.80 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.26.54 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.32 శాతం తగ్గి రూ.103,520 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.12.47 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.14 శాతం పెరిగి రూ.81.42, బైనాన్స్ కాయిన్ 0.10 శాతం పెరిగి రూ.23,631, యూఎస్‌డీ కాయిన్ 0.21 శాతం పెరిగి 81.42, రిపుల్ 0.32 శాతం తగ్గి రూ.31.80, బైనాన్స్ యూఎస్‌డీ 0.20 శాతం పెరిగి రూ.81.43 వద్ద కొనసాగుతున్నాయి. మ్యాజిక్, అకలా, మూన్‌బీమ్, అప్టోస్, జునో, అస్టర్, ఎనర్జీ వెబ్ లాభపడ్డాయి. కవ, కస్పా, వోల్ట్ ఇను, సేఫ్ పాల్, మాస్క్ నెట్‌వర్క్, ఎథీరియమ్ పావ్, ఎవ్‌మోస్ నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Stock Market News: సాయంత్రానికి రైజైన స్టాక్ మార్కెట్లు - సెన్సెక్స్ 224 ప్లస్, నిఫ్టీ 5 డౌన్
Titan Q3 Results: మెరుపులు మిస్సింగ్, అంచనాలు అందుకోని టైటన్
Upcoming IPOs: సిద్ధంగా ఉన్నారా?, రెండు కంపెనీలు పబ్లిక్ ఆఫర్స్ ప్రకటించబోతున్నాయ్!
Stock Market News: బడ్జెట్ బూస్ట్ దొరికిన 30 స్టాక్స్, మార్కెట్ కళ్లన్నీ ఇప్పుడు వీటి మీదే!
Adani Group: $100 బిలియన్లు పాయే - ఆసియాలోనూ నం.1 పోస్ట్ లేదు, అప్పులపై RBI ఆరా
Telangana budget 2023 : రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ సరే - నిధుల సమీకరణ ఎలా ? తెలంగాణ సర్కార్‌కు ఇదే పెద్ద టాస్క్
Perni Nani On Kotamreddy : జగన్ పిచ్చి మారాజు అందర్నీ నమ్మేస్తారు, కోటంరెడ్డి నమ్మక ద్రోహం చేశారు - పేర్ని నాని
PROJECT-K 2 Parts | ప్రాజెక్ట్-K పై నమ్మకంతో Prabhas రిస్క్ చేస్తున్నారా..?| ABP Desam
Unstoppable 2 Finale Episode : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దెబ్బకు ఆహా ఓటీటీ పని చేస్తుందా?