By: ABP Desam | Updated at : 25 May 2022 05:13 PM (IST)
క్రిప్టో కరెన్సీ ధరలు
Cryptocurrency Prices Today, 25 May 2022: క్రిప్టో మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టడం లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.94 శాతం పెరిగి రూ.24.30 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.43.91 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 1.00 శాతం తగ్గి రూ.1,60,335 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.18.46 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ విలువ ప్రకారం బిట్‌కాయిన్ తర్వాత స్థానంలో ఉండే ఈ కాయిన్ రోజురోజుకీ పతనం అవుతోంది.
టెథెర్ 0.05 శాతం పెరిగి రూ.82.47, బైనాన్స్ కాయిన్ 0.89 శాతం పెరిగి రూ.26,897, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం పెరిగి 82.62, కర్డానో 1.15 శాతం తగ్గి రూ.42.01, రిపుల్ 2.18 శాతం తగ్గి రూ.32.84 వద్ద కొనసాగుతున్నాయి. ఎథీరియమ్ కాయిన్, గ్యాస్, స్వైప్, లూప్‌రింగ్, థ్రెష్‌హోల్డ్, ఆవె, నియో 2 నుంచి 8 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. డీఎఫ్‌ఐ మనీ, లైవ్‌పీర్, రిక్వెస్ట్, ఆగర్, నెమ్, డియా, లించ్ 4-31 శాతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
ED Raids Chinese Mobile Companies: చైనా మొబైల్ కంపెనీలకు ఈడీ షాకు! 40 ప్రాంతాల్లో సోదాలు
Stock Market News: నవ్విన మదుపరి! ఊహించని లాభాల్లో సెన్సెక్స్, నిఫ్టీ
Petrol-Diesel Price, 5 July: ఈ నగరాల్లో ఇవాళ ఇంధన ధరలు పైపైకి! ఇక్కడి వారికి మాత్రం గుడ్ న్యూస్
Gold-Silver Price: రెండ్రోజుల నుంచి నిలకడగా బంగారం ధర, నేడు ఎగబాకిన వెండి, లేటెస్ట్ రేట్లు ఇవీ
Maruti Brezza vs Hyundai Venue: కొత్త మారుతి బ్రెజా, హ్యుండాయ్ వెన్యూ ఫేస్లిఫ్ట్ల్లో ఏది బెస్ట్?
Nandamuri Kalyan Ram New Movie: గన్స్ అండ్ యాక్షన్ - కళ్యాణ్ రామ్ కొత్త ఫిల్మ్
Teegala Krishna Reddy: మంత్రి సబిత - తీగల కృష్ణారెడ్డి మధ్య ముదిరిన వార్! సంచలన వ్యాఖ్యలు, ఇవి అందుకు సంకేతమా?
MLA Kotamreddy Protest: మురికి కాల్వలో దిగి YSRCP ఎమ్మెల్యే వింత నిరసన - వద్దని వేడుకుంటున్న ప్రజలు
Tigers Roaming In AP: పులి ఉంది జాగ్రత్త, ప్రజలను అలర్ట్ చేసిన ఏపీ అటవీ శాఖ - ఈ సూచనలు పాటిస్తే బెటర్