By: ABP Desam | Updated at : 27 Mar 2022 01:25 PM (IST)
Edited By: Ramakrishna Paladi
crypto-currency-bitcoin
Cryptocurrency Prices Today, March 27 2022: క్రిప్టో మార్కెట్లు ఆదివారం స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి పెట్టుబడులు పెడుతున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.62 శాతం పెరిగి రూ.34.66 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.64.27 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 1.00 శాతం పెరిగి రూ.2,44,583 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.28.61 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.05 శాతం పెరిగి రూ.77.71, బైనాన్స్ కాయిన్ 0.56 శాతం పెరిగి రూ.32,414, యూఎస్‌డీ కాయిన్ 0.02 శాతం పెరిగి 77.71, రిపుల్ 0.73 శాతం పెరిగి రూ.65.30, కర్డానో 0.78 శాతం పెరిగి 89.09 వద్ద కొనసాగుతున్నాయి. జిలికా, క్వార్క్ చైన్, ఓక్స్, స్టేటస్, ఐఓఎస్‌టీ, సెలెర్, వీచైన్ 14 నుంచి 73 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. యాక్సీ ఇన్ఫినిటీ, వేవ్స్, ఎథిరియమ్ కాయిన్, లైవ్‌పీర్, కైబర్ నెట్‌వర్క్, పాక్స్ డాలర్, క్వాంట్ స్టాంప్ 1-3 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
India Rankings In Various Indices: 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత వివిధ సూచికల్లో భారత్ స్థానం ఇది!
సెలబ్రిటీలు సైతం క్యూ కడుతున్న రంగం - ఎన్ఎఫ్టీ అంటే ఏంటి?
NFTs: నాన్ ఫంగీబుల్ టోకెన్లలో భారత్ వాటా ఎంత..?
Sri Lanka Crisis: లంకలో రగులుతున్న రావణ కాష్ఠం! విక్రమ సింఘే చల్లార్చగలడా!
Hyundai Tucson SUV Price: హ్యుండాయ్ టక్సన్ ధర రివీల్ చేసిన కంపెనీ - మొదటిసారి ఆ ఫీచర్‌తో!
BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం
Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య
Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !
Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి