By: ABP Desam | Updated at : 07 Jul 2022 03:08 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు, ( Image Source : Art Rachen/Unsplash )
Cryptocurrency Prices Today, 7 July 2022: క్రిప్టో మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 1.32 శాతం పెరిగి రూ.16.40 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.30.37 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 3.09 శాతం పెరిగి రూ.95,499 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.10.89 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.05 శాతం పెరిగి రూ.81.18, యూఎస్‌డీ కాయిన్ 0.06 శాతం పెరిగి 82.60, బైనాన్స్ కాయిన్ 0.08 శాతం పెరిగి రూ.19,488, రిపుల్ 1.68 శాతం పెరిగి రూ.27.56, కర్డానో 1.26 శాతం పెరిగి రూ.38.49 వద్ద కొనసాగుతున్నాయి. అంబైర్ యాడెక్స్, ఏలియన్ వరల్డ్స్, స్టార్జ్, జాస్మీకాయిన్, ఎథీరియమ్ నెట్‌వర్క్, మై నైబర్‌హుడ్, రిపబ్లిక్ 5-35 శాతం వరకు ఎగిశాయి. న్యూమరైర్, ఎయిర్‌స్వాప్, ఆర్జిన్ ప్రొటో, ట్రాన్, సింథెటిక్స్, కాస్మోస్, కర్వ్‌డావో 1-4 శాతం వరకు నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Cryptocurrency Prices: దూసుకెళ్లిన బిట్‌కాయిన్! జోరుమీదున్న ఎథీరియమ్
Stock Market Weekly Review: 4 రోజుల్లో రూ.8 లక్షల కోట్లు! 60K దాటితే సెన్సెక్స్‌ను ఆపలేం!
NPS Balance Check: ఎన్పీఎస్ బ్యాలెన్స్ తెలుసుకోవాలా! సింపుల్‌గా 4 మార్గాలు!!
Gold Price: బంగారం కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్! నెల రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్!
Petrol-Diesel Price, 13 August: ఈ నగరంలో బాగా పెరిగిన ఇంధన ధరలు, ఇక్కడ తగ్గుదల - మీ ప్రాంతంలో ఈరోజు ఇలా
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?
Telangana TDP Votes : టీడీపీ మద్దతుంటే తెలంగాణలో విజయం ఖాయమా ? రాజకీయ పార్టీలేం ఆలోచిస్తున్నాయి ?
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!