By: ABP Desam | Updated at : 13 Jul 2022 04:26 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు ( Image Source : Karolina Grabowska/Pexels )
Cryptocurrency Prices Today, 13 July 2022: క్రిప్టో మార్కెట్లు నేడు స్తబ్దుగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.55 శాతం పెరిగి రూ.16.40 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.30.19 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథీరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 1.13 శాతం పెరిగి రూ.90,481 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.10.40 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.05 శాతం పెరిగి రూ.83.09, యూఎస్‌డీ కాయిన్ 0.03 శాతం పెరిగి 84.94, బైనాన్స్ కాయిన్ 1.91 శాతం పెరిగి రూ.18,799, రిపుల్ 1.60 శాతం పెరిగి రూ.26.78, కర్డానో 0.15 శాతం తగ్గి రూ.36.51 వద్ద కొనసాగుతున్నాయి. ఆవె, కర్వ్ డావో, సుషి, అంబైర్ యాడెక్స్, అపె కాయిన్, డీఎఫ్‌ఐ మనీ, స్టేటస్ 4-9 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. ఎయిర్‌స్వాప్, అయిలెఫ్, టెజోస్, లూప్‌రింగ్, స్వైప్, రిపబ్లిక్, చిలిజ్ 2-17 శాతం వరకు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
కొత్త ఎంజీ హెక్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది - ఎలా ఉందో చూశారా?
Cryptocurrency Prices: 24 గంటల్లో ఇంత పెరిగిందా! బిట్‌కాయిన్‌ను అస్సలు ఊహించలేదు!
Stock Market Closing: ఎగిసిన సెన్సెక్స్, నిఫ్టీ! ఒక్క రోజులో రూ.2.5 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు!
Elon Musk Teases X.com: ట్విటర్‌కు పోటీగా X.com తెస్తానన్న ఎలన్ మస్క్! ఓపెన్ చేస్తే ఏమొస్తుందో తెలుసా?
Raksha Bandan 2022: రాఖీ కడితే డబ్బు, బంగారం ఇవ్వకండి! ఇలా ప్రేమను చాటుకోండి!
Telangana Cabinet : ఆగస్టు 15 నుంచి పది లక్షల మంది కొత్తగా సామాజిక పెన్షన్లు - తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు !
కొణిదెల వారింట పెళ్లి సందడి - ఆ యాంకర్‌తో మెగా హీరో నిశ్చితార్థం!
టార్గెట్ లోకేష్ వ్యూహంలో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందా?
TS EAMCET Results 2022 : రేపు తెలంగాణ ఎంసెట్,ఈసెట్ ఫలితాలు విడుదల