అన్వేషించండి

Cryptocurrency Prices Today, 31 January 2022: రూ.30.03 లక్షల వద్దే బిట్‌కాయిన్‌..! కొనుగోళ్లకు 'నై' అంటున్న ట్రేడర్లు

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 1.96 శాతం నష్టపోయి రూ.30.03 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.54.08 లక్షల కోట్లుగా ఉంది.

Cryptocurrency Prices Today, 31 January 2022: క్రిప్టో మార్కెట్లు సోమవారం నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 1.96 శాతం నష్టపోయి రూ.30.03 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.54.08 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ గత 24 గంటల్లో 2.73 శాతం తగ్గి రూ.2,05,404 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.23.16 లక్షల కోట్లుగా ఉంది. 

బైనాన్స్‌ కాయిన్‌ 3.38 శాతం తగ్గి రూ.30,077, టెథెర్‌ 0.05 శాతం పెరిగి రూ.80.85, కర్డానో 3.70 శాతం తగ్గి రూ.82.79, యూఎస్‌డీ కాయిన్‌ 0.11 శాతం పెరిగి 80.85, సొలానా 5.35 శాతం నష్టపోయి రూ.7,344 వద్ద కొనసాగుతున్నాయి. కైబర్‌ నెట్‌వర్క్‌, ఆక్ర్‌, ఎన్‌కేఎన్‌, మేకర్‌, ఓమిస్ గో, సింథెటిక్స్‌, ఠీటా ఫ్యూయెల్‌ 2 నుంచి 10 శాతం వరకు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. క్వాంట్‌స్టాంప్‌, వేవ్స్‌, గ్యాస్‌, ఫాంటమ్‌, ఠీటా నెట్‌వర్క్‌, టెర్రా, హార్మొని 7 నుంచి 11 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Also Read: President Speech Highlights: కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం: ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం

Also Read: Union Budget 2022: ఈ CM మొర FM వినేనా!! WFH అలవెన్స్‌లు కావాలి.. ఇంటి రుణం వడ్డీ మినహాయింపు పెంచాలి!!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AI Engineers: ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
 ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
Viral Video: సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Peddi Hindi Glimpse Reaction: 'పెద్ది' మూవీ హిందీ గ్లింప్స్ రిలీజ్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ అదిరిపోయిందిగా..
'పెద్ది' మూవీ హిందీ గ్లింప్స్ రిలీజ్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ అదిరిపోయిందిగా..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tilakvarma removed Mumbai Indians Name | ముంబై ఇండియన్స్ పేరును తొలగించిన తిలక్ వర్మ | ABP DesamJasprit Bumrah Re Entry | బుమ్రాను గాల్లోకి ఎత్తి మరీ ప్రకటించిన పొలార్డ్ | ABP DesamMI vs RCB Match preview IPL 2025 | పదేళ్ల గడిచిపోయాయి..ఇప్పటికైనా దక్కేనా.? | ABP DesamSiraj Bowling in IPL 2025 | ఐపీఎల్ లో వంద వికెట్ల క్లబ్ లోకి దూసుకొచ్చిన హైదరాబాదీ సిరాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AI Engineers: ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
 ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ హబ్‌గా తెలంగాణ, రాష్ట్రంలో 2 లక్షల మంది ఏఐ ఇంజినీర్లు - మంత్రి శ్రీధర్ బాబు
Viral Video: సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
సారీ గాయ్స్, మీకు హెల్ప్ చేయలేకపోతున్నాను.. నారా లోకేష్ ఫన్నీ రియాక్షన్ ట్రెండింగ్
Telangana News: కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
కంచ గచ్చిబౌలి భూములపై విచారణ వాయిదా వేసిన హైకోర్టు, ప్రతివాదులకు నోటీసులు
Peddi Hindi Glimpse Reaction: 'పెద్ది' మూవీ హిందీ గ్లింప్స్ రిలీజ్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ అదిరిపోయిందిగా..
'పెద్ది' మూవీ హిందీ గ్లింప్స్ రిలీజ్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబ్బింగ్ అదిరిపోయిందిగా..
Black Monday: బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
బ్లాక్ మండే భయం నిజమైంది - సెన్సెక్స్ 3300 పాయింట్లు, నిఫ్టీ 1000 పాయింట్లు పతనం
Annamayya Crime News: రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మృతి, సీఎం చంద్రబాబు సంతాపం
World Health Day 2025: సమంత హెల్దీ లైఫ్ స్టైల్ సీక్రెట్ ఇదే... మయోసైటిస్ నుంచి బయటపడ్డాక ఇంత మార్పా?
సమంత హెల్దీ లైఫ్ స్టైల్ సీక్రెట్ ఇదే... మయోసైటిస్ నుంచి బయటపడ్డాక ఇంత మార్పా?
Avanthika Sundar: ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
ఖుష్బూ కూతురి కష్టాలు... పేరెంట్స్‌ ముందుకు రావట్లేదు... సినిమా ఎంట్రీ కష్టాలు విన్నారా?
Embed widget