By: ABP Desam | Updated at : 26 Jan 2022 03:35 PM (IST)
Edited By: Ramakrishna Paladi
క్రిప్టో కరెన్సీ ధరలు
Cryptocurrency Prices Today, 26 January 2022: క్రిప్టో మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 4.07 శాతం పెరిగి రూ.20.75 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.51.78 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ గత 24 గంటల్లో 3.57 శాతం పెరిగి రూ.2,03,829 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.21.76 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 3.84 శాతం పెరిగి రూ.31,400, టెథెర్ 0.07 శాతం పెరిగి రూ.81.60, కర్డానో 2.83 శాతం పెరిగి రూ.86, యూఎస్‌డీ కాయిన్ 0.01 శాతం పెరిగి 81.58, సొలానా 4.52 శాతం పెరిగి రూ.7,851 వద్ద కొనసాగుతున్నాయి. వేవ్, క్వాంట్‌స్టాంప్, క్వార్‌చైన్, లూప్‌రింగ్, గాలా, సింథెటిక్స్, ఎజింన్ కాయిన్ 12 నుంచి 40 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. డియా, మేకర్, కాస్మోస్, టెర్రా, ఇంటర్నెట్ కో, నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Cryptocurrency Prices : బిట్‌కాయిన్ @ రూ.22.96 లక్షలు! ఎరుపెక్కిన క్రిప్టో మార్కెట్
Stock Market Today: కొనసాగిన నష్టాలు! 19,550 కిందకు నిఫ్టీ!
FD Rates: రెండు స్పెషల్ స్కీమ్స్‌ను క్లోజ్ చేసిన HDFC బ్యాంక్, FDలపై కొత్త వడ్డీ రేట్లు ఇవే
Stock Market Today: నెగెటివ్ సెంటిమెంటు నింపిన ముడి చమురు! నష్టాల్లో సెన్సెక్స్, నిఫ్టీ!
Investment Tips: 30-40 ఏళ్ల వయస్సులో పాటించాల్సిన బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటెజీ, మీ టార్గెట్ మిస్ కాదు!
KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
RK Roja: మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత
Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'
Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!
/body>