News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cryptocurrency Prices Today, 4 February 2022: కాస్త జోష్‌లో క్రిప్టో మార్కెట్లు! బిట్‌కాయిన్‌, ఎథిరియమ్‌ కొనుగోళ్లపై ఆసక్తి!

గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 4.29 శాతం లాభపడి రూ.30.17 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.52.08 లక్షల కోట్లుగా ఉంది.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today, 4 February 2022: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం లాభాల్లోనే ట్రేడ్‌ అవుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ 4.29 శాతం లాభపడి రూ.30.17 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.52.08 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ గత 24 గంటల్లో 9.25 శాతం మెరుగై రూ.2,25,677 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.23.31 లక్షల కోట్లుగా ఉంది. 

బైనాన్స్‌ కాయిన్‌ 4.74 శాతం పెరిగి రూ.30,140, టెథెర్‌ 0.06 శాతం పెరిగి రూ.79.95, కర్డానో 4.30 శాతం పెరిగి రూ.84.79, యూఎస్‌డీ కాయిన్‌ 0.07 శాతం పెరిగి 79.65, సొలానా 11.60 శాతం లాభపడి రూ.8,369 వద్ద కొనసాగుతున్నాయి. క్వాంట్‌స్టాంప్‌, రిక్వెస్ట్‌, నియో, కాస్మోస్‌, జిలికా, సొలానా, కాంపౌండ్‌ 11 నుంచి 24 శాతం వరకు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. గోలెమ్, ఆగర్‌ మాత్రమే 1 శాతం లోపు నష్టాల్లో ఉన్నాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Also Read: Metaverse Meaning: మెటావర్స్.. ఓ మాయా ప్రపంచం.. సింపుల్‌గా చెప్పాలంటే వర్చువల్ జిందగీ!

Also Read: Facebook Meta: మెటావర్స్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మార్క్.. ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం!

Published at : 04 Feb 2022 04:15 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin Cryptocurrencies

ఇవి కూడా చూడండి

Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol - Diesel Rates Today: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Prices Today: జాబ్స్‌ దెబ్బకు భారీగా తగ్గిన గోల్డ్‌ రేటు - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Upcoming Cars on January 2024: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Top Mutual Funds: ఇలాంటి ఫండ్స్‌ చేతిలో ఉంటే చాలు, టాప్‌ క్లాస్‌ రిటర్న్స్‌తో మీ కోసం డబ్బు సంపాదిస్తాయి

Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

Forex Reserves: పెరుగుతున్న ఆర్థిక బలం, 600 బిలియన్‌ మార్క్‌ దాటిన ఫారెక్స్‌ నిల్వలు

టాప్ స్టోరీస్

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Telangana News: బీజేపీ, ఎంఐఎం దోస్తులని ప్రచారం, కానీ అక్బరుద్దీన్ కు ఛాన్స్: ఎమ్మెల్యే ఏలేటి

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Navy Day: విశాఖలో ఆకట్టుకున్న నేవీ డే విన్యాసాలు - ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు

Nizamabad Conductor Charged women: ఆర్టీసీలో మహిళల నుంచి ఛార్జీ వసూలు, కండక్టర్ పై విచారణకు సజ్జనార్ ఆదేశాలు