Cryptocurrency Prices Today: ఆగని పతనం - బిట్‌కాయిన్‌ 2 రోజుల్లో రూ.2 లక్షల కోట్ల తగ్గుదల!

Cryptocurrency Prices Today, 20 February 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 4.20 శాతం తగ్గి రూ.30.44 లక్షల వద్ద కొనసాగుతోంది. రెండు రోజుల్లో రూ.2 లక్షలు తగ్గింది. మార్కెట్‌ విలువ రూ.56.95 లక్షల కోట్లుగా ఉంది.

FOLLOW US: 

Cryptocurrency Prices Today, 20 February 2022: క్రిప్టో మార్కెట్లు ఆదివారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని ఉపసంహరిస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 4.20 శాతం తగ్గి రూ.30.44 లక్షల వద్ద కొనసాగుతోంది. రెండు రోజుల్లో రూ.2 లక్షలు తగ్గింది. మార్కెట్‌ విలువ రూ.56.95 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథిరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 5.63 శాతం తగ్గి రూ.2,09,328 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.24.82 లక్షల కోట్లుగా ఉంది. 

బైనాన్స్‌ కాయిన్‌ 5.37 శాతం తగ్గి రూ.30,319, టెథెర్‌ 0.03 శాతం పెరిగి రూ.79.79, కర్డానో 6.11 శాతం తగ్గి రూ.74.99, యూఎస్‌డీ కాయిన్‌ 0.04 శాతం పెరిగి 79.72, రిపుల్‌ 1.19 శాతం తగ్గి రూ.63.45 వద్ద కొనసాగుతున్నాయి. ఆగర్‌, బ్రాండ్‌ ప్రొటో, ట్రూ యూఎస్డీ, డాయి 0.01 నుంచి 3 శాతం వరకు లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి. న్యూమరాయిర్‌, క్రోమియా, గాలా, షిబా ఇను, క్వాంట్‌ స్టాంప్‌, హార్మొని, డియా 8 నుంచి 14 శాతం వరకు నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Published at : 20 Feb 2022 03:56 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin Cryptocurrencies

సంబంధిత కథనాలు

Cryptocurrency Prices: ఆదివారం నష్టాల్లోనే! బిట్‌కాయిన్‌ ధర ఎంతంటే?

Cryptocurrency Prices: ఆదివారం నష్టాల్లోనే! బిట్‌కాయిన్‌ ధర ఎంతంటే?

Petrol-Diesel Price, 7 August: నేడు ఈ నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర - మీ నగరంలో తాజా రేట్లు ఇవీ

Petrol-Diesel Price, 7 August: నేడు ఈ నగరాల్లో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధర - మీ నగరంలో తాజా రేట్లు ఇవీ

Gold-Silver Price: నేడు దిగివచ్చిన గోల్డ్ రేట్, వెండి ఏకంగా 800 దిగువకు - లేటెస్ట్ ధరలు ఇవీ!

Gold-Silver Price: నేడు దిగివచ్చిన గోల్డ్ రేట్, వెండి ఏకంగా 800 దిగువకు - లేటెస్ట్ ధరలు ఇవీ!

Cryptocurrency Prices: బిట్‌ కాయిన్‌ డౌన్‌ - ఎథీరియమ్‌ అప్‌! ఎందుకిలా?

Cryptocurrency Prices: బిట్‌ కాయిన్‌ డౌన్‌ - ఎథీరియమ్‌ అప్‌! ఎందుకిలా?

Cheapest Home Loans: రెపోరేటుతో EMI భారం పెరిగిందా! ఇలా చేస్తే తక్కువ వడ్డీతో బయటపడొచ్చు!

Cheapest Home Loans: రెపోరేటుతో EMI భారం పెరిగిందా! ఇలా చేస్తే తక్కువ వడ్డీతో బయటపడొచ్చు!

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్