News
News
X

Cryptocurrency Prices: 24 గంటల్లో ఇంత పెరిగిందా! బిట్‌కాయిన్‌ను అస్సలు ఊహించలేదు!

Cryptocurrency Prices Today, 11 August 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) ఏకంగా 6.20 శాతం పెరిగి రూ.20.34 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.35.82 లక్షల కోట్లుగా ఉంది.

FOLLOW US: 

Cryptocurrency Prices Today, 11 August 2022: క్రిప్టో మార్కెట్లు నేడు భారీ లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) ఏకంగా 6.20 శాతం పెరిగి రూ.20.34 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.35.82 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 11.21 శాతం పెరిగి రూ.1,57,700 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.17.12 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.06 శాతం పెరిగి రూ.83.62, యూఎస్‌డీ కాయిన్‌ 0.06 శాతం పెరిగి 84.06, బైనాన్స్‌ కాయిన్‌ 3.83 శాతం పెరిగి రూ.27,305, రిపుల్‌ 4.51 శాతం పెరిగి రూ.31.80, కర్డానో 4.83 శాతం పెరిగి రూ.44.64 వద్ద కొనసాగుతున్నాయి. ఐఎక్స్‌ ఆర్‌ఎల్‌సీ, గోలెమ్‌, హార్మనీ, సెలెర్‌ నెట్‌వర్క్‌, ఓక్స్‌, ఆవె 10-53 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. క్వాంట్‌ స్టాంప్‌ మాత్రమే నష్టాల్లో ఉంది.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి. 


క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 11 Aug 2022 05:16 PM (IST) Tags: Bitcoin cryptocurrency Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin

సంబంధిత కథనాలు

Electronics Mart IPO: అక్టోబర్‌ 4 నుంచి ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఐపీవో

Electronics Mart IPO: అక్టోబర్‌ 4 నుంచి ఎలక్ట్రానిక్స్‌ మార్ట్‌ ఐపీవో

Suzlon Energy Stock: 50% డిస్కౌంట్‌లో షేర్లు కావాలా?, ఈ రైట్స్‌ ఇష్యూ మీ కోసమే!

Suzlon Energy Stock: 50% డిస్కౌంట్‌లో షేర్లు కావాలా?, ఈ రైట్స్‌ ఇష్యూ మీ కోసమే!

Rupee vs US Dollar: రూపాయి చిల్లు పెరిగింది బాస్‌, 81.52 కు చేరింది

Rupee vs US Dollar: రూపాయి చిల్లు పెరిగింది బాస్‌, 81.52 కు చేరింది

Stock Market Opening Bell 26 September 2022: అసలే బిగ్‌ గ్యాప్‌ డౌన్‌, ఆపై మరింత పతనం

Stock Market Opening Bell 26 September 2022: అసలే బిగ్‌ గ్యాప్‌ డౌన్‌, ఆపై మరింత పతనం

Stocks to watch 26 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Harsha Engineers, BPCL

Stocks to watch 26 September 2022: ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి - ఫోకస్‌లో Harsha Engineers, BPCL

టాప్ స్టోరీస్

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Nellore News : పవన్ వెంటే మెగా ఫ్యాన్స్, నెల్లూరు మెగా గర్జనలో కీలక నిర్ణయం

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Etela Rajender : చిగురుమామిడి పాఠశాలలో కులాల వారీగా అటెండెన్స్, స్కూల్లో దొరతనం ఏంటని ఈటల రాజేందర్ ఫైర్

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Jacqueline Fernandez Bail: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు బెయిల్!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!

Rajasthan Congress Crisis: రాజస్థాన్‌లో రాత్రికి రాత్రే హైడ్రామా- 90 మంది ఎమ్మెల్యేల రాజీనామా!