By: ABP Desam | Updated at : 21 Apr 2022 12:49 PM (IST)
స్తబ్దుగా క్రిప్టోలు! బిట్‌కాయిన్ పెరిగింది ఎథిరియమ్ తగ్గింది
Cryptocurrency Prices Today, 21 April 2022: క్రిప్టో మార్కెట్లు గురువారం స్తబ్దుగా ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టడం లేదు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ (Bitcoin) 0.28 శాతం పెరిగి రూ.33.23 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.60.07 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ (Ethereum) గత 24 గంటల్లో 0.61 శాతం తగ్గి రూ.2,46,609 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.28.25 లక్షల కోట్లుగా ఉంది.
టెథెర్ 0.03 శాతం పెరిగి రూ.80.20, బైనాన్స్ కాయిన్ 0.76 శాతం తగ్గి రూ.33,570, యూఎస్‌డీ కాయిన్ 0.01 శాతం పెరిగి 80.15, సొలానా 1.54 శాతం తగ్గి రూ.8,495, రిపుల్ 2.77 శాతం తగ్గి రూ.59.76 వద్ద కొనసాగుతున్నాయి. ఓక్స్, జాస్మీ కాయిన్, జిలికా, రిక్వెస్ట్, సింథెటిక్స్, లైవ్‌పీర్, 8 నుంచి 45 శాతం వరకు లాభాల్లో ఉన్నాయి. మెటల్, స్టార్జ్, వేవ్స్, అపెకాయిన్, ది సాండ్‌బాక్స్, డోజీకాయిన్, కోటి 3 నుంచి 11 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Gautam Adani: అదానీ రిటర్న్స్ - టాప్-20 బిలియనీర్స్ లిస్ట్‌లోకి రీఎంట్రీ, ఒక్కరోజులో రూ.లక్ష కోట్ల ర్యాలీ
Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంక్‌లకు 18 రోజులు సెలవులు, 6 రోజులు సమ్మె - ఇక మీ బ్యాంక్ పని అయినట్టే!
Deadlines in December: డెడ్‌లైన్స్ ఇన్ డిసెంబర్, వీటిని సకాలంలో పూర్తి చేయకపోతే మీకే నష్టం!
Downgraded Stocks: రిలయన్స్, ఎస్‌బీఐ కార్డ్ సహా 7 పాపులర్ స్టాక్స్ - ఇవి మీ దగ్గర ఉంటే జాగ్రత్త!
Latest Gold-Silver Prices Today 29 November 2023: రూ.63 వేలు దాటిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>