Dogecoin: మస్కా.. మజాకా! అక్కడ ట్విటర్ కొంటే ఇక్కడ డోజీకి ఊపొచ్చింది, 35% పెరిగింది!
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ (Elon Musk) ట్విటర్ (Twitter) కొనుగోలు చేస్తుండటంతో క్రిప్టో మార్కెట్లకు (Crypto Markets) ఊపొచ్చింది. డోజీకాయిన్ (Dogecoin) గత 24 గంటల్లో 35 శాతానికి పైగా ర్యాలీ అయింది.
Cryptocurrency Dogecoin rallies 35 Percent to enter top 10 cryptos as Twitter approves Elon Musk proposal : టెస్లా సీఈవో ఎలన్ మస్క్ (Elon Musk) ట్విటర్ (Twitter) కొనుగోలు చేస్తుండటంతో క్రిప్టో మార్కెట్లకు (Crypto Markets) ఊపొచ్చింది. డోజీకాయిన్ (Dogecoin) గత 24 గంటల్లో 35 శాతానికి పైగా ర్యాలీ అయింది. టాప్-10 క్రిప్టో కరెన్సీలోకి దూసుకొచ్చింది. ఇంతకీ డోజీకాయిన్, ట్విటర్, ఎలన్ మస్క్‌కు ఏంటీ లింకు?
Also Read: ఎలాన్ మస్క్ ఓ వింత మనిషి- అంతేనా కాదు అంతకుమించి!
ఎలన్ మస్క్ చేసిన కొనుగోలు ప్రతిపాదనకు ట్విటర్ అంగీకరించినట్టు మంగళవారం ఉదయం వార్తలు వచ్చాయి. అతడి 44 బిలియన్ డాలర్ల ఆఫర్ తమకు నచ్చినట్టు కంపెనీ వివరించింది. ఈ లావాదేవీతో ఎలాంటి సంబంధం లేనప్పటికీ డోజీకాయిన్ ధర దూసుకుపోయింది. ఎందుకంటే చాలాసార్లు డోజీని మస్క్ ఎండార్స్ చేశాడు. టెస్లా ఉత్పత్తులను కొనుగోలు చేసేందుకు డోజీకాయిన్ వాడుకోవచ్చని చెప్పాడు.
ట్విటర్ కొనుగోలు ప్రతిపాదన విజయవంతం కాగానే ఈ మీమ్‌టోకెన్ పొల్కాడాట్, అవలాంచెను దాటేసి టాప్-10లోకి చేరుకుంది. 21.2 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను అందుకుంది. గత 24 గంటల్లో డోజీ ట్రేడెడ్ వాల్యూమ్ 1000 శాతానికి పైగా పెరిగింది. 6.25 బిలియన్ డాలర్ల విలువైన డోజీకాయిన్లు చేతులు మారాయి. 20.13 బిలియన్ డాలర్ల మేరకు లిక్విడేషన్ జరిగింది. కాయిన్ గ్లాస్ డేటా ప్రకారమైతే 132 మిలియన్ల విలువైన డోజీ లిక్వేడేట్ అయింది. బిట్‌కాయిన్, ఎథిరియమ్ తర్వాత ఎక్కువ లిక్విడేట్ అయిన కాయిన్‌గా నిలిచింది.
Also Read: ఎలాన్ మస్క్ చేతికి ట్విట్టర్, 44 బిలియన్ డాలర్లకు భారీ డీల్ - అనుకున్నది సాధించిన కుబేరుడు
ఎలన్ మస్క్ ట్విటర్‌ను సొంతం చేసుకుంటారన్న వార్తలు రాగానే క్రిప్టో మార్కెట్లను డోజీకాయిన్ ఔట్‌పెర్ఫామ్ చేసినట్టు మడ్రెక్స్ సీఈవో ఎడుల్ పటేల్ అన్నారు. 'ఎలన్ మస్క్ డోజీకాయిన్‌ను ట్విటర్‌తో ఇంటిగ్రేట్ చేస్తారని చాలామంది డోజీ మద్దతుదారులు నమ్ముతున్నారు. దాంతో ధర పెరిగింది. ట్విటర్ ఎకోసిస్టమ్‌తో డోజీని మస్క్ ఎలా అనుసంధానం చేస్తారో చూడాలి' అని పటేల్ పేర్కొన్నారు.
డోజీకాయిన్ కమ్యూనిటీలో ఎలన్ మస్క్‌ను 'డోజీఫాథర్'గా భావిస్తారు. కొన్నేళ్లుగా అతడు డోజీని ఎండార్స్ చేస్తుండటమే ఇందుకు కారణం. నెల రోజుల క్రితమే అతడు ట్విటర్ బ్లూ సేవలకు డోజీకాయిన్‌ను పేమెంట్ ఆప్షన్‌గా ఇవ్వాలని ప్రతిపాదించాడు. ఇప్పటికే టెస్లా మర్చండైజ్ ఆన్‌లైన్ స్టోర్‌కు డోజీ పేమెంట్స్‌ను స్వీకరిస్తున్నాడు.
Also Read: ఎవరు తీసుకుంటే నాకేంటి? తగ్గేదేలే, ట్విట్టర్‌కు మళ్లీ రాను: ట్రంప్
View this post on Instagram