అన్వేషించండి

Sam Bankman: క్రిప్టో కింగ్‌కు 25 ఏళ్ల జైలు, ఫ్రీడ్‌ కాదు అతనొక 'ఫ్రాడ్‌'

FTX పతనానికి ముందు వరకు సామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌ను క్రిప్టో బిలియనీర్‌గా, క్రిప్టో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పెట్టుబడిదారుగా, క్రిప్టో మేధావిగా పిలిచారు.

Sam Bankman Fried: క్రిప్టో కింగ్‌, క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ FTX కో-ఫౌండర్‌ సామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌కు బిలియన్ డాలర్ల మోసం కేసులో 25 సంవత్సరాల జైలు శిక్ష పడింది. క్రిప్టో కరెన్సీ ఎక్సేంజ్‌ల్లో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ప్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన FTX 2022లో పతనమైంది. FTX రేటు హఠాత్తుగా 99% పతనమై బిలియన్‌ డాలర్ల సంపద ఆవిరైంది. కోట్ల మంది పెట్టుబడిదార్లు అత్యంత భారీగా నష్టపోయారు. రెండేళ్లు వాదనలు సాగిన ఈ కేసులో న్యూయార్క్‌ కోర్టు తీర్పు చెప్పింది. ఆర్థిక ద్రోహంలో ప్రధాన సూత్రధారుడు, పాత్రధారుడు అయిన బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది.

అమెరికా చట్టాల ప్రకారం బ్యాంక్‌మన్‌కు దాదాపు 100 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉంది. బ్యాంక్‌మన్‌ చేసింది తొలి తప్పు & ఎలాంటి హింసకు పాల్పడలేదు కాబట్టి, శిక్షను ఐదు నుంచి ఆరున్నర ఏళ్లకు పరిమితం చేయాలని అతని లాయర్లు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఒకవేళ, బ్యాంక్‌మన్‌ మీద న్యాయస్థానం కనికరం చూపినప్పటికీ అతనికి 40 ఏళ్లకు తగ్గకుండా శిక్ష విధించాల్సిందేనని ప్రభుత్వం తరపు లాయర్లు వాదించారు. చివరకు, కోర్టు 25 ఏళ్ల జైలు శిక్షను విధించింది.

FTX పతనానికి ముందు వరకు సామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌ను క్రిప్టో బిలియనీర్‌గా, క్రిప్టో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పెట్టుబడిదారుగా, క్రిప్టో మేధావిగా పిలిచారు. ప్రస్తుతం బ్యాంక్‌ వయస్సు కేవలం 32 సంవత్సరాలు. రెండేళ్ల క్రితం, అంటే బ్యాంక్‌మన్‌కు 30 ఏళ్ల వయస్సులో, ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం అతని సంపద 26 బిలియన్‌ డాలర్లకు చేరింది. చాలా చిన్న వయస్సులో అంత సంపదకు అధిపతిగా బ్యాంక్‌మన్‌ రికార్డ్‌ కూడా సృష్టించాడు.

అమెరికా చరిత్రలో అతి పెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటి
FTX క్లయింట్లు వాస్తవంలో డబ్బును కోల్పోలేదన్న బ్యాంక్‌మన్ వాదనను న్యూయార్క్‌ కోర్ట్‌ తిరస్కరించింది. విచారణ సమయంలో బ్యాంక్‌మన్‌ అబద్ధాలు చెప్పాడని వ్యాఖ్యానించింది. FTX పతనానికి సంబంధించి సామ్ బ్యాంక్‌మ్యాన్ ఫ్రీడ్‌ ఏడు మోసాలు, కుట్రలకు పాల్పడినట్లు 2023 నవంబర్‌లోనే యూఎస్‌ కోర్టు జ్యూరీ నిర్ధాచింది. ఇది అమెరికా చరిత్రలో అతి పెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటిగా నిలిచింది.

బిలియన్ల డాలర్లు కోల్పోయిన FTX క్లయింట్లు
FTX క్లయింట్లు 8 బిలియన్‌ డాలర్లు, FTX ఈక్విటీ పెట్టుబడిదార్లు 1.7 బిలియన్‌ డాలర్లు, అలమెడా రీసెర్చ్‌ (Alameda Research) హెడ్జ్ ఫండ్ రుణదాతలు 1.3 బిలియన్‌ డాలర్లు నష్టపోయారని న్యాయమూర్తి లూయిస్ కప్లాన్ వెల్లడించారు."FTX కస్టమర్ డిపాజిట్లను తన హెడ్జ్ ఫండ్ అలమెడా ఖర్చు చేసిందన్న విషయం తనకు తెలియదని" బ్యాంక్‌మన్‌ చెప్పడం కూడా అబద్ధమేనని, అతనికి తెలిసేస అంతా జరిగిందని కూడా న్యాయమూర్తి చెప్పారు.

2017లో వాల్‌ స్ట్రీట్‌లో ఉద్యోగం వదిలేసిన బ్యాంక్‌మన్‌, ఆ తర్వాత, అలమెడా రీసెర్చ్‌ హెడ్జ్‌ ఫండ్‌ను స్థాపించాడు. FTX, అలమెడా సంస్థల మధ్య జరిగిన లావాదేవీల వల్లే FTX విలువ పతనమైంది. 2022 నవంబర్ 11న, బ్యాంక్‌మన్‌ అకస్మాత్తుగా తన CEO పదవికి రాజీనామా చేశాడు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న FTX, దివాలా చట్టం కింద రక్షణ కోసం దరఖాస్తు చేసింది. బ్యాంక్‌మన్ సంపద విలువ 24 గంటల్లో దాదాపు 94 శాతం పడిపోయింది, 991.5 మిలియన్‌ డాలర్లకు దిగి వచ్చింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, ఇప్పటివరకు, 1 రోజులో ఏ బిలియనీర్ సంపదలో కూడా ఇంత క్షీణించలేదు.

సామ్ బ్యాంక్‌మన్ ఫ్రీడ్‌ను 2023 ఆగస్టు నుంచి బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో నిర్బంధంలో ఉన్నాడు. 

మరో ఆసక్తికర కథనం: మళ్లీ రికార్డ్‌ స్థాయిలో పెరిగిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి ధరలు కొత్త ఇవి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
U19 Women Asia cup: సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
సత్తా చాటిన తెలంగాణ ప్లేయర్ త్రిష- U19 ఆసియాకప్ భారత్ వశం.. 41 పరుగులతో బంగ్లా చిత్తు
Prakasam Earthquake: ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు, ఈ నెలలో తెలుగు రాష్ట్రాల్లో వరుస భూకంపాలు
Prashanth Neel: ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
ఎన్టీఆర్ సినిమా గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్... మైథాలజీ కాదు
Viral News: పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
Perni Nani: మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
మాజీ మంత్రి పేర్ని నాని, కుమారుడు పేర్ని కిట్టుకు పోలీసుల నోటీసులు- నేటి మధ్యాహ్నం వరకు డెడ్‌లైన్
Game Changer Dhop Song: రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్.. డీప్‌గా ఎక్కేస్తోన్న డోప్.. అస్సలు దిగట్లే!
రామ్ చరణ్, కియారా మెస్మరైజింగ్ స్టెప్స్‌తో డీప్‌గా ఎక్కేస్తోన్న ‘గేమ్ చేంజర్’ డోప్.. అస్సలు దిగట్లే!
Sri Simha Koduri : పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
పెళ్లి, పర్సనల్ ఫోటోలు షేర్ చేసిన శ్రీ సింహ.. రాగ మాగంటితో ఆరేళ్లు ప్రేమ కథ నడిపించాడట
KTR Resign Challenge: ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
ఒక్కటి నిరూపించినా BRS ఎమ్మెల్యేలంతా రాజీనామా- కేటీఆర్ ఛాలెంజ్‌‌ను ప్రభుత్వం స్వీకరిస్తుందా?
Embed widget