News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Oil Prices: కిచెన్‌ ఖర్చు నుంచి ఊరట, తగ్గిన వంట నూనెల రేట్లు

అన్ని రకాల ధార బ్రాండ్‌ ఎడిబుల్ ఆయిల్ MRPని లీటర్‌కు రూ. 10 తగ్గించాలని నిర్ణయించారు.

FOLLOW US: 
Share:

Mother Dairy Edible Oil Prices: వేరుశనగ, పొద్దు తిరుగుడు, రైస్‌బ్రాన్‌ సహా చాలా రకాల వంట నూనెల ధరలు మరింత తగ్గనున్నాయి. ధార (dhara) బ్రాండ్ పేరిట వంట నూనెలను (edible oil) విక్రయిస్తున్న మదర్ డెయిరీ, అన్ని ఎడిబుల్ ఆయిల్స్ ధరలను లీటర్‌కు రూ. 10 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ధరలతో కూడిన ఎడిబుల్ ఆయిల్ స్టాక్స్ వచ్చే వారం నుంచి మార్కెట్లో అందుబాటులోకి వస్తుంది.
 
అంతర్జాతీయ పరిణామాల కారణంగా గత కొన్ని నెలలుగా వంట నూనెల రేట్లు పెరిగాయి, భారీ ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు, అంతర్జాతీయంగా పరిస్థితులు సానుకూలంగా మారి, గ్లోబల్‌ మార్కెట్‌లో నూనెల రేట్లు తగ్గాయి. దీంతో, ఎడిబుల్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటున్న కంపెనీల వ్యయాలు తగ్గాయి. తగ్గిన వంట నూనె ధరల ప్రయోజనాన్ని ప్రజలకు పంపిణీ చేయడానికి భారత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఎడిబుల్‌ ఆయిల్‌ రేట్లు తగ్గించేలా ఆయా కంపెనీలకు సూచించాలని ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌ను కోరింది. లీటరు ధర రూ. 8 నుంచి రూ. 12 వరకు తగ్గించాలని సూచించింది. దీనిపై, ఎడిబుల్ ఆయిల్ ఇండస్ట్రీస్ అసోసియేషన్‌ నుంచి కేంద్ర ప్రభుత్వానికి హామీ లభించింది. ఈ నేపథ్యంలో, ధార బ్రాండ్‌ వంట నూనెల రేట్లు తగ్గిస్తూ మదర్ డెయిరీ నిర్ణయం తీసుకుంది. మదర్‌ డెయిరీ తన రేట్లను తగ్గించడం ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి. ఈ ఏడాది మే నెల మొదటి వారంలో కూడా వివిధ రకాల వంట నూనెల ధరలను మదర్ డెయిరీ తగ్గించింది. 

లీటర్‌కు రూ. 10 తగ్గింపు
మదర్ డెయిరీ సమాచారం ప్రకారం, అన్ని రకాల ధార బ్రాండ్‌ ఎడిబుల్ ఆయిల్ MRPని లీటర్‌కు రూ. 10 తగ్గించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గుముఖం పట్టడంతో పాటు దేశీయ మార్కెట్‌లోనూ పంట లభ్యత పెరగడంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. 

ధార బ్రాండ్‌ నూనెల కొత్త ధరలు
కొత్త రేట్ల ప్రకారం... ధార బ్రాండ్‌ లీటర్‌ ప్యాకెట్ల వంట నూనెల MRP రూ. 140 నుంచి రూ. 230 వరకు ఉంటుంది. ధార రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్ రేటు లీటరుకు రూ. 140కి తగ్గగా, రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ MRP రూ. 160కు తగ్గింది. లీటర్‌ రిఫైన్డ్‌ వెజిటలబుల్‌ ఆయిల్‌ రూ. 200, కాచి ఘనీ ఆవాల నూనె లీటరు రూ. 160కి లభిస్తుంది. లీటర్‌ ఆవాల నూనె రూ. 158కు, లీటర్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ. 150కు, లీటర్‌ వేరుసెనగ నూనె - రూ.230గా ఉంటుంది. ఈ ధరలు వచ్చే వారం నుంచి అందుబాటులోకి వస్తాయి. మే నెలలో కూడా, ఎడిబుల్ ఆయిల్‌పై లీటరుకు 15 నుంచి 20 రూపాయల వరకు తగ్గించింది. 

మే నెలలోనే మరికొన్ని కంపెనీలు కూడా వంట నూనెల రేట్లు తగ్గించాయి. మరికొన్ని కంపెనీలు ఇప్పుడు అదే ప్రయత్నాల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం వల్లే కంపెనీలు రేట్లు తగ్గిస్తున్నాయి.

మరో ఆసక్తికర కథనం: మార్కెట్‌ నుంచి సగం పింక్‌ నోట్లు మాయం, ₹500 నోట్లపై కీ అప్‌డేట్‌ 

Published at : 09 Jun 2023 11:25 AM (IST) Tags: Cooking Oil edible oil prices mother dairy dhara

ఇవి కూడా చూడండి

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?

Gold-Silver Price 21 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వెండి బంగారం ధరలు

Gold-Silver Price 21 September 2023: తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా వెండి బంగారం ధరలు

Byjus India CEO: 'బైజూస్‌ ఇండియా'కు కొత్త సీఈవో - పాస్‌ మార్కులు తెచ్చుకుంటారో!

Byjus India CEO: 'బైజూస్‌ ఇండియా'కు కొత్త సీఈవో - పాస్‌ మార్కులు తెచ్చుకుంటారో!

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Stock Market Crash: వణికించిన స్టాక్‌ మార్కెట్లు! 796 పాయింట్ల పతనమైన సెన్సెక్స్‌

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో మిక్స్‌డ్‌ ట్రెండ్‌ - బిట్‌కాయిన్‌పై నజర్‌!

Cryptocurrency Prices: క్రిప్టో మార్కెట్లో మిక్స్‌డ్‌ ట్రెండ్‌ - బిట్‌కాయిన్‌పై నజర్‌!

టాప్ స్టోరీస్

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్

Minister KTR: డబుల్ బెడ్రూము ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు: కేటీఆర్