అన్వేషించండి

గూగుల్‌కి మరోసారి షాక్‌- ఈసారి రూ.936.44 కోట్ల జరిమానా

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరోసారి గూగుల్ కు జరిమానా విధించింది. గూగుల్ ప్రవర్తనను నిర్ణీత గడువులోగా సరిదిద్దుకోవాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది

కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా మరోసారి గూగుల్ కు రూ.936.44 కోట్ల జరిమానా విధించింది. ప్లే స్టోర్ పాలసీ, యాంటీ కాంపిటీటివ్ ప్రాక్టీస్‌లో తన స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గూగుల్ పై సీసీఐ ఈ జరిమానా విధించింది. గత వారం మరో కేసులో సీసీఐ గూగుల్‌కు రూ.1,337.76 కోట్ల జరిమానా విధించింది. 

డామినెంట్‌ పొజిషన్‌ని దుర్వినియోగం చేస్తున్న అభియోగం మీద 1,337.76 కోట్ల జరిమానాను గూగుల్‌ (Google) ఎదుర్కొంటోంది. ఆండ్రాయిడ్ (Android) మొబైల్ డివైజ్‌లకు సంబంధించి, తన ఆధిపత్య స్థానాన్ని కొన్ని మార్కెట్లలో దుర్వినియోగం చేసినందుకు కాపిటీషన్ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) గతవారంలో జరిమానా విధించింది. న్యాయబద్ధంగా లేని వ్యాపార పద్ధతులను తక్షణం నిలిపివేయాలని కూడా గూగుల్‌ను ఆదేశించింది. ప్రవర్తన మార్చుకోవడానికి ఆ కంపెనీకి కొంత సమయం ఇచ్చింది.

మన దేశంలో, ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ల వినియోగదారులు గూగుల్‌ మీద 2019 ఏప్రిల్‌లో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుల మీద వివరణాత్మక విచారణకు రెగ్యులేటర్ ఆదేశించింది. Android అంటే... స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ తయారీ కంపెనీలు (OEMలు) ఇన్‌స్టాల్ చేసిన ఓపెన్ సోర్స్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌.

ఆండ్రాయిడ్‌ OS OEMలు గూగుల్‌తో కుదుర్చుకునే మొబైల్ అప్లికేషన్ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ (MADA), యాంటీ ఫ్రాగ్మెంటేషన్ అగ్రిమెంట్ (AFA) అనే ఒప్పందాలకు సంబంధించిన అన్యాయమైన పద్ధతులపై CCIకి ఫిర్యాదులు అందాయి.

గతవారంలో CCI ఆదేశాలు ఇవే
ప్రి-ఇన్‌స్టలేషన్‌ కోసం గూగుల్‌కు చెందిన యాప్‌ల్‌లో నుంచి ఎంపిక చేసుకోకుండా OEMలను నియంత్రించకూడదని CCI ఆదేశించింది. యాప్‌లన్నింటినీ స్మార్ట్‌ ఫోన్లలో ఏక మొత్తంగా ప్రి-ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని బలవంతం చేయకూడదనీ చెప్పింది. ఫోన్లలో యాప్‌లను ఏ చోట అమర్చాలో ఓఈఎంలకు సూచించకూడదని తెలిపింది. ప్రి-ఇన్‌స్టాల్‌ చేసిన యాప్‌లను అన్‌- ఇన్‌స్టాల్‌ లేదా తొలగించకుండా కూడా వినియోగదారులను గూగుల్‌ నియంత్రించకూడదని తన ఆదేశాల్లో సీసీఐ పేర్కొంది. సీసీఐ ఆదేశాలపై గూగుల్‌ స్పందించ లేదు. ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ఫోన్ల వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు 2019 ఏప్రిల్‌లో సీసీఐ దర్యాప్తును ప్రారంభించింది. సుమారు మూడేళ్లకు పైగా ఈ ప్రక్రియను జరిపిన అనంతరం గురువారం భారీ జరిమానా విధిస్తూ సీసీఐ ఆదేశాలిచ్చింది. వార్తల కంటెంట్‌, స్మార్ట్‌ టీవీ, గూగుల్‌ పే తదితరాలకు సంబంధించి పోటీవిరుద్ధ కార్యకలాపాలకు గూగుల్‌ పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలపైనా సీసీఐ దర్యాప్తు జరిపింది.

తాను మాత్రమే ఉండాలన్న పేరాశ
ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్‌లో ఆధిపత్య స్థానంలో ఉన్న గూగుల్ పేరాశకు పోతోంది. తన కుర్చీలోకి ఎవరూ రాకుండా చూసేందుకు అడ్డదారులు తొక్కుతోంది. ఆండ్రాయిడ్‌ OS OEMలతో ఒప్పందాలు కుదుర్చుకుని, పోటీ సంస్థలకు మార్కెట్‌లో స్థానం లేకుండా చేస్తోంది. యాప్‌ స్టోర్‌ మార్కెట్‌లోనూ ఇదే తరహా విధానాలను అవలంబిస్తోంది. పోటీ కంపెనీ వృద్ధి చెందకుండా తొక్కి పట్టడం పోటీ చట్టానికి విరుద్ధం.

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Vishwanath And Sons Twitter Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ట్విట్టర్ రివ్యూ: సూర్య సినిమా టాకేంటి? వెంకీ మళ్ళీ హిట్టు కొట్టాడా?
Agadha Twitter Review - అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
అగధ ట్విట్టర్ రివ్యూ: కాలయంత్రం క్లైమాక్స్ సూపర్... ఎంఎస్ రాజు థ్రిల్లర్ సినిమా ప్రీమియర్స్ రిపోర్ట్
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
YS Jagan Kurnool Tour: కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటన! ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టుపై నిప్పులు! జైల్లో తనను అవమానించారని కామెంట్స్!
Pawan Kalyan: ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
ఏనుగుల సంరక్షణలో  ఆంధ్రప్రదేశ్‌ నూతన అధ్యాయం! విశాఖలో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవంలో పవన్  
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
కర్మను మించినది ఏదీ లేదు! శని దేవుడు నేర్పించే 7 పాఠాలు!
Embed widget