Christmas Gift Ideas 2024: ఈ 4 క్రిస్మస్ గిఫ్ట్‌లతో మీరు వెరీ స్మార్ట్ అని నిరూపించుకోవచ్చు - రేటు రూ.2 వేల కంటే తక్కువే!
Best Christmas Gifts: ఈ సంవత్సరం, మీరు ఎవరికైనా బెస్ట్ క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, తక్కువ బడ్జెట్‌లో వచ్చే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌ను ఎంచుకోవచ్చు.
Best Electronic Gadgets for Christmas Gifts 2024: క్రిస్మస్ పండుగ అతి దగ్గరలో ఉంది, డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకొంటారు. ఈ రోజున కొత్త బట్టలు ధరించి, కుటుంబ సభ్యులు & స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. తాము ప్రేమించే & అభిమానించే కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు బహుమతులు ఇస్తారు. ఇళ్లలోనే కాదు క్రిస్మస్ వేడుకలు ఆఫీస్ సంస్కృతిలోనూ ఒక భాగం. చాలా కార్యాలయాల్లో ఉద్యోగులు ఆ రోజున సీక్రెట్ శాంటాగా మారి ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం, మీరు కూడా ఎవరికైనా సీక్రెట్ శాంటాగా లేదా నేరుగా బహుమతి ఇవ్వాలనుకుంటే, తక్కువ బడ్జెట్‌లో అత్యుత్తమ ఐడియాలు చాలా ఉన్నాయి. రూ.2000 కంటే తక్కువ ధరతో, మీ బడ్జెట్‌లో వచ్చే టాప్-4 బెస్ట్ గాడ్జెట్‌ల జాబితా ఇది. వీటిని మీరు క్రిస్మస్ కానుకగా ఎంచుకోవచ్చు.
లైన్ ఒరిజినల్స్ జూక్‌బాక్స్ 30 స్పీకర్ (Lyne Originals JukeBox 30 Speaker)
జూక్‌బాక్స్ 30 స్పీకర్, 40W అవుట్‌పుట్‌తో పవర్‌ఫుల్ సౌండ్‌ను క్రియేట్ చేస్తుంది, క్రిస్మస్ వేడుకల్లో హుషారును పెంచుతుంది. ఈ స్పీకర్ బ్లూటూత్ వెర్షన్ 5.2కి సపోర్ట్ చేస్తుంది. మీ పార్టీ మూడ్‌ను పెంచేలా దీనిలో RGB లైటింగ్ కూడా ఉంది, సౌండ్‌కు అనుగుణంగా లైటింగ్ మారుతుంది. వైర్డ్ మైక్, రిమోట్ & USB, TF కార్డ్ & AUX ఇన్‌పుట్ ఆప్షన్లు కూడా ఇందులో ఉన్నాయి. టైప్-సి (Type-C) ఛార్జింగ్ కేబుల్‌తో దీనిని చాలా సులభంగా ఛార్జ్ చేయొచ్చు, మీరు కూడా ఫుల్‌గా రీఛార్జ్ కావచ్చు. దీని ధర 1,649 రూపాయలు. మీరు లైన్ వెబ్‌సైట్ నుంచి ఈ ప్రొడక్ట్‌ను కొనుగోలు చేయవచ్చు.
బౌల్ట్ 20000 mAh 22.5 W పవర్ బ్యాంక్ (Boult 20000 mAh 22.5 W Power Bank)
ఉద్యోగులు, వ్యాపారులతో పాటు దూర ప్రయాణాలు చేసే వాళ్లకు బాగా ఉపయోగపడే ప్రొడక్ట్ ఇది. బౌల్ట్ కంపెనీకి చెందిన ఈ ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్‌ని మీరు ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లొచ్చు. దీనిలో మల్టీపుల్ ఛార్జింగ్ పోర్ట్‌ను ఉంది, దీని ద్వారా మీరు ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయవచ్చు. ఈ పవర్‌బ్యాంక్ 22.5W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. విశేషం ఏంటంటే.. ఈ పవర్ బ్యాంక్ బరువు 300 గ్రాములు మాత్రమే. కాబట్టి, బయటకు తీసుకెళ్లడానికి ఇది భారంగా కూడా ఉండదు. మీరు ఈ ప్రొడక్ట్‌ను ఫ్లిప్‌కార్ట్ (Flipkart) నుంచి 1,499 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ (OnePlus Nord Buds 2r)
వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ ఇయర్‌బడ్స్ క్రిస్మస్ సందర్భంగా బహుమతిగా ఇవ్వడానికి బెస్ట్ ఐడియా. ఈ గిఫ్ట్ చూసి మీ ఆత్మీయులు ఆశ్చర్యపోతారు, సంబరపడతారు. ఈ బడ్స్ బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉన్న 12.4mm డ్రైవర్‌తో వస్తాయి. ఇది 480 mAh బ్యాటరీని కలిగి ఉంది, 38 గంటల ప్లే టైమ్‌ను ఆఫర్ చేస్తుంది. ఈ ఇయర్‌బడ్‌లు టైప్-సి ఛార్జింగ్ కేబుల్‌ను సపోర్ట్ చేస్తాయి కాబట్టి ఛార్జ్ చేయడం చాలా సులభమైన పని. మీరు ఈ ఉత్పత్తిని ఫ్లిప్‌కార్ట్ నుంచి ₹ 1,699 ప్రత్యేక ధరతో కొనుగోలు చేయవచ్చు.
బౌల్ట్ క్రౌన్‌ఆర్ బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్ (Boult CrownR Bluetooth Calling Smartwatch)
బౌల్ట్ లాంచ్ చేసిన ఈ స్మార్ట్‌వాచ్ చాలా తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్ ఇస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ రౌండ్ డయల్‌తో లాంచ్ అయింది. ఇందులో జింక్ అల్లాయ్ మెటాలిక్ ఫ్రేమ్ ఉంటుంది. డస్ట్ రెసిస్టెన్స్‌లో IP67 రేటెడ్ స్మార్ట్ వాచ్ ఇది. స్మార్ట్ నోటిఫికేషన్‌లు, సెడెంటరీ వాటర్ ఇన్‌టేక్ రిమైండర్, వాయిస్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు దీని స్మార్ట్‌నెస్‌ను పెంచుతాయి. మీరు ఈ స్మార్ట్‌వాచ్‌ని ఫ్లిప్‌కార్ట్ నుంచి 1,899 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: 'స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్' - అధిక లాభాలు కోరుకునే హైరిస్క్ ఇన్వెస్టర్లకు బెస్ట్ ఆప్షన్!